దటీజ్ పిఠాపురం వర్మ!

Publish Date:Mar 17, 2025

Advertisement

పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జి ఎస్పీఎస్ఎస్ వర్మ  చేసిన త్యాగానికి గుర్తింపు లభించకపోయినా, ఎవరికోసమైతే గత అసెంబ్లీ ఎన్నికలలో సీటు త్యాగం చేశారో.. వారే గుర్తించడం సంగతి అటుంచి నియోజకవర్గంలో తొక్కేయాలని ప్రయత్నిస్తున్నా, అడుగడుగునా అవమానాల పాలు చేస్తున్నా తన స్థిర చిత్తాన్ని కోల్పోలేదు. తెలుగుదేశం పట్ల తన విధేయతను చెక్కు చెదరనీయలేదు. తనకు జరుగుతున్న అవమానాలు, పరాభవాలపై అనుచరగణం రగిలిపోతున్నా.. వారిని సముదాయిస్తూ, వారు గీత దాటకుండా నియంత్రిస్తూ వస్తున్నారు. 

గత ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తన పిఠాపురం సీటును త్యాగం చేసిన ఎస్పీఎస్ఎస్ వర్మకు అప్పట్లో చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్దానం చేశారు. అయితే ఇప్పటికి రెండు సార్లు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. అయినా వర్మలో ఎక్కడా అసంతృప్తి కానీ, అసహనం కానీ కనిపించలేదు.  మరో వైపు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జనసేన వైసీపీ వారిని పార్టీలోకి చేర్చుకుంటూ ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నది. కొంత కాలం కిందట పిఠాపురంలో పర్యటించిన జనసేన నాయకుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఒక అడుగు ముందుకు వేసి  అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పిఠాపురం జనసేన ఇన్ చార్జ్ కి మాత్రమే రిపోర్ట్ చేయాలి కానీ వర్మకు కాదన్నది ఆ ఆదేశాల సారాంశం.  

ఇక తాజాగా పిఠాపురం వర్మకు తెలుగుదేశం ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించడం వెనుక ఉన్నది స్వయంగా జనసేనానే అని అంటున్నారు.  పిఠాపురంలో ఎమ్మెల్సీ వర్మ మరొక అధికార కేంద్రంగా మారతారన్న భయంతోనే.. పవన్ కల్యాణ్ చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చి వర్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కకుండా చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.అక్కడితో ఆగకుండా.. తాజాగా జనసేన 12వ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం వేదికగా జరిగిన సభలో వర్మ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావిం చకుండానే.. మెగా బ్రదర్ నాగబాబు ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి   విజయానికి  పవన్ కళ్యాణ్, జనసేన క్యాడర్,  పిఠాపురం ప్రజలు మాత్రమే కారణం.. అలాకాకుండా  పవన్ కళ్యాణ్ తమ వల్లే గెలిచారని ఎవరైనా ఊహించుకుంటే, అది వారి కర్మ” అని  చేసిన వ్యాఖ్యల తరువాత కూడా వర్మ సంయమనాన్ని పాటిస్తూ, తన సహచరులను, పార్టీ క్యాడర్ ను కూడా పార్టీకి, అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అననీయకుండా నియంత్రిస్తున్నారు.

తాజాగా మంగళవారం (మార్చి 17) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం అయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఒక పోస్టర్ లో కూడా చంద్రబాబునాయుడి పక్కన పవన్ కల్యాణ్ పొటోను ఉంచారు.  ఈ పోస్టర్ ను చూసిన వారంతా దటీజ్ వర్మ అంటూ ప్రశంసిస్తున్నారు. నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఎంత క్రమశిక్షణతో ఉంటారో వర్మ తన ప్రవర్తన ద్వారా రుజువు చేస్తున్నారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  

By
en-us Political News

  
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ఉండవల్లిలో ఆయన విద్యార్థులతో ముఖముఖి నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్‌ సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు మాత్రం డోర్‌ డెలివరీ చేస్తాని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థాన మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్ని అట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యించారు. ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు రూ.4 కోట్ల కేటాయించింది. స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు రేపు చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి దర్శించుకుంటారు.
జగన్ అడ్డా కడపలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 19 వరకూ జరిగే పసుపు పండుగ మహానాడు నిర్వహణ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఆందోళన రేపుతున్నాయి. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు.
బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో వంశీని రెండు రోజుల కస్టడీకి ఇవ్వాలని హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టుకు కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు. యూనివర్శిటీలో జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పెంచిన ప్రయాణ ఛార్జీలను సవరించింది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ, వాటిని 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్నాది.
నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో బుధ, గురువారాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.