మ‌హా కుంభ‌మేళాలో తొక్కిస‌లాట‌ ఘ‌ట‌న‌.. సుప్రీంకోర్టులో పిల్

Publish Date:Jan 30, 2025

Advertisement

ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభ‌మేళాలో బుధ‌వారం (జనవరి 29) తెల్ల‌వారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించిన ఘటనపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన  వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ సర్కారే బాధ్యత వహించాలంటూ విశాల్ తివారీ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  భవిష్యత్ లో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా  ప్రొసిడ్యురల్ గైడ్ లైన్స్ జారీ చేయాలని ఆయన తన పిటిషన్ లో సుప్రీం కోర్టును కోరారు. అంతే కాదు భక్తుల భ్రదత ప్రమాదంలో పడకుండా వీఐపీల కదలికలను నియంత్రించాలని కోరారు.

ఈ పిటిషన్ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై యూపీ సర్కార్ స్టేటస్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేలాలో జనవరి 29 వరకూ 27 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. కుంభమేళా ముగింపు దశకు వచ్చే క్రమంలో భక్తుల తాకిడి మరింత పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. మొత్తం మీద కుంభమేళా 70 కోట్ల మంది వరకూ భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది.  

ఇలా ఉండగా తొక్కిసలాట ఘటన తరువాత అలర్ట్ అయిన యోగి ఆదిత్యనాథ్ సర్కార్  భక్తుల భద్రత మెరుగుపరచడం కోసం కొన్ని చర్యలు చేపట్టింది. వీవీఐపీలకు పాసులు రద్దు చేసింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించింది. మౌని అమావాస్య నాడు స్నానమాచరించలేని భక్తులు వసంత పంచమి నాడు స్నానమాచరించాలన్న అఖాడా పిలుపు నేపథ్యంలో ఫిబ్రవరి 3 అంటే వసంత పంచమి రోజున, అలాగే మాఘ పౌర్ణమి అయిన ఫిబ్రవరి 12న, ఇక మహా కుంభ మేళా ముగింపు రోజైన ఫిబ్రవరి 26, ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం కూడా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న అంచనాతో యోగి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.  

By
en-us Political News

  
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివకాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
కేంద్రమంత్రి పెమ్మ‌సాని, అంబ‌టి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది
భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.