మోడీ నిలువెత్తు తెలుగుదనం..
Publish Date:Oct 16, 2025
Advertisement
ప్రధాని నరేంద్రమోడీ ఏపీ పర్యటనలో ఆయన శ్రీశైలం సందర్శన హైలైట్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో కలిసి ఆయన శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సహా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా సంప్రదాయ దుస్తులను ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ముగ్గురుకి ముగ్గరూ నిలువెత్తు తెలుగుతనాన్ని ప్రతిబించించేలా ఉన్నారని నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దీనికి ఫైనల్ టచ్ అన్నట్లుగా ప్రధాని తన శ్రీశైలం ఆలయ సందర్శనపై అచ్చ తెలుగులో చేసిన ట్వీట్ మరింత పాపులర్ అయ్యింది. ‘నా తోటి భారతీయుల కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను, అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకున్నా’నని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మొత్తం మీద సంప్రదాయ దుస్తులతో ఉన్న మోడీ, బాబు, పవన్ ల ఫొటోను పిక్చర్ ఆఫ్ ది డే అంటూ నెటిజనులు షేర్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/picture-of-the-day-36-208055.html





