యూపీఐ ఛార్జీలపై ఫోన్‌పే కీలక ప్రకటన..!

Publish Date:Aug 8, 2026

Advertisement

 

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులపై ఇటీవల నెట్టింట ఊపందుకున్న ఛార్జీల ప్రచారానికి ప్రముఖ డిజిటల్ వ్యాపార దిగ్గజం ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెరదించారు. సాధారణ ప్రజలకు యూపీఐ వినియోగం మునుపటిలాగే ఉచితంగానే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల లోక్‌సభలో నూతన పన్ను సవరణ బిల్లు ఆమోదం పొందిన తదుపరి పరిణామాలతో యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధిస్తారనే చర్చలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రతి సాధారణ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌కూ వినియోగదారుల నుంచి రుసుములు వసూలు చేస్తారేమోననే సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.

ఈ ప్రచారాలపై సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించిన ఫోన్‌పే అధినేతి సమీర్ నిగమ్, భారతీయ యూపీఐ వినియోగదారులందరికీ సేవలందించడం ఎల్లప్పుడూ ఉచితంగానే ఉంటుందని తేల్చి చెప్పారు. సాధారణ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారమూ పడదని ఆయన స్పష్టమైన భరోసా ఇచ్చారు.

మరోవైపు పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) సైతం ఈ అంశంపై సమగ్ర వివరణ జారీ చేసింది. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి (P2P) జరిగే సాధారణ బదిలీలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీలు ఉండవని తెలిపింది. అదేవిధంగా చిన్నపాటి వ్యాపారులు, కిరాణా దుకాణాదారులకు కూడా ఎండీఆర్ నుంచి మినహాయింపు లభిస్తుందని వెల్లడించింది.

ఈ నిబంధనల ప్రకారం రూ. 2,000 కంటే ఎక్కువ విలువ కలిగిన కొన్ని నిర్దిష్ట వ్యాపార సంబంధిత ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మాత్రమే 0.25 శాతం నుండి 0.4 శాతం వరకు ఎండీఆర్ వర్తించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా పెద్ద వ్యాపార సంస్థలకు వర్తించే అంశమే తప్ప సామాన్య పౌరుల ఆన్‌లైన్ లావాదేవీలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది.

గత దశాబ్ద కాలంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్‌పీసీఐతో పాటు బ్యాంకులు, ఫిన్‌టెక్ డిజిటల్ సంస్థలు యూపీఐ నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ మరియు ఆన్‌లైన్ మోసాల నివారణకు అయ్యే వ్యయాన్ని భరిస్తూ వస్తున్నాయి. ఈ డిజిటల్ మౌలిక వ్యవస్థను దీర్ఘకాలం పాటు స్థిరంగా నడపడానికి ఆర్థిక నమూనాపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయని కౌన్సిల్ పేర్కొంది.

డిజిటల్ ఇండియాని మరింత ప్రోత్సహిస్తున్న నేపధ్యంలో వినియోగదారులకు సులభమైన, ఉచిత సేవలు అందించడమే ప్రాధాన్యమని రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. ఈ అధికారిక స్పష్టతతో కోట్ల మంది యూపీఐ వినియోగదారులకు పెద్ద ఊరట లభించినట్లయింది.

రాబోయే రోజుల్లో ఆర్‌బీఐ  ఎన్‌పీసీఐ కలిసి ఫిన్‌టెక్ రంగం సురక్షితంగా, సుస్థిరంగా ముందడుగు వేసేలా మరిన్ని మార్గదర్శకాలను విడుదల చేయనున్నాయి. సాంకేతిక భద్రతను పటిష్టం చేస్తూనే వినియోగదారుల హక్కులను కాపాడటమే ప్రధాన లక్ష్యమని డిజిటల్ సంస్థలు పునరుద్ఘాటిస్తున్నాయి.


PhonePe, UPI Payment Charges, Sameer Nigam, Merchant Discount Rate MDR, Digital Payments India, NPCI UPI Update,  PhonePe CEO Sameer Nigam Statement, Payments Council of India PCI, Free UPI Transactions India

By
en-us Political News

  
సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌ల వేదికగా అమాయకులకు వలవేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సంచలన హనీట్రాప్ ముఠా గుట్టు
మియాపూర్ జీఎస్ఎమ్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..!
ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని శాసించిన మహా దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ జీవితంలో తీరని శోకం అలముకుంది.
క్యాబ్ డ్రైవర్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా స్ఫూర్తిదాయక ప్రయాణం..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది.
తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టను న్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జాతీయ స్థాయిలో నీరు, గ్యాస్, విద్యుత్ విచ్చలవిడిగా దుబారా చేసే అలవాటు వల్లే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందని బాహాటంగా చెప్పారు. నీటి సమస్యలు పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని, దానికి బయటి దేశాలను బాధ్యులను చేయలేమని అన్నారు. నాటి మంత్రి వ్యాఖ్యలకు, నేటి పాక్ పాలకులు భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు పొంతనే లేకపోవడం గమనార్హం.
ఒంటరిగా ఫీలవుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో!
మరొకవైపు, రెండు ప్రధాన టన్నెళ్ల పరిధిలో చేపడుతున్న కాంక్రీట్ సీసీ లైనింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదు గ్యాంట్రీ యంత్రాల....
సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
నోరు పారేసుకుంటే ఇళ్లకు వచ్చి కొడతాం....!
నెలకు రూ.1.5 లక్షల జీతం అని చెప్పి.. బీర్ షాప్ ఓనర్‌కు అమ్మేశారు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.