ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకరరావును ఇప్పటికే పలు మార్లు విచారించిన సిట్ అధికారులు తాజాగా ఆయన ఫోన్ ను,ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులను గుర్తించిన సిట్.. బాధితులకు కూడా నోటీసులు ఇచ్చి వారి వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నది. కాగా తాజాగా ఈ కేసులో ఉన్న ఎస్ఐబీ ప్రభాకరరావు ఫోన్ ను, ల్యాప్ టాప్ ను సీజ్ చేసింది. ప్రభాకరరావు ఫోన్ ల్యాప్ టాప్ లో ఉన్న డేటా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు కీలకమని సిట్ భావిస్తోంది.
ప్రభాకరరావు ల్యాప్‌టాప్, మొబైల్ నుంచి డేటా రిట్రైవ్ చేసేందుకు వాటిని ఎఫ్ఎస్‌ఎల్ కి పంపారు. వాటి రిపోర్టులు వచ్చిన తరువాత సిట్ తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ప్రభాకరరావు పెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న సిట్.. వాటి ఆధారంగా 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి 15 వరకు మొత్తం కాల్ డేటాతో సహా బ్యాకప్ చేసేందుకు సిట్ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 14న మరోసారి విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు ప్రభాకరరావుకు నోటీసులు పంపింది. సెల్ ఫోన్, ల్యాప్ టాప్ సీజ్ చేసిన తరువాత ప్రభాకరరావుకు సిట్ మరో సారి నోటీసులు జారీ చేయడం ప్రధాన్యత సంతరించుకుంది. ఇక సిట్ అరెస్టుల పర్వం జోరందు కుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-sit-seize-39-201591.html
వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డారు. ఇందులో వీరి పై సుమారు 36 కేసులు నమోదు అయినాయి. ఇప్పటికే వీరు పాల్పడ్డ మోసాలపై బాధితులు ఒక్కొక్కరు వచ్చి ఫిర్యాదులు చేస్తుండంతో వీరి మోసాలు బయటపడ్డాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారత్ ప్రధాన నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్బంగా రష్యా- ఉక్రెయిన్ యుద్దానికి సంబంధంచిన తాజా పరిమాణాలను పుతిన్ ప్రధానికి వివరించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు బాంబు పేల్చారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉనన్నారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ నేత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి మండిపడ్డారు.
టెక్నాలజీ లేని రోజుల్లో టీచర్లు పాఠాలు మాత్రమే చెప్పారు. నేడు టెక్నాలజీ పేరుతో విద్యార్థులకు విద్య రాకుండా చేయడానికే అనిపిస్తోంది.
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు.
మెడిసిటీ మెడికల్ కాలేజ్ గంజాయి కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. మూడు ఏళ్ల నుంచి వైద్య విద్యార్థులు గంజాయి వాడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ వద్ద సిట్ విచారణ అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు దేశం పార్టీ నేత విశ్వనాథరెడ్డిని ఇటీవల ఫోన్‌లో బెదిరించిన కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డికి కడప జిల్లా పులివెందుల పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు.
వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఇటీవలి కాలంలో.. మరీ ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ నుంచి కాంగ్రెస్ కు ఉద్దేశపూర్వకంగా దూరం జరుగుతున్నట్లు కనిపించిన ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ ఆశ్చర్యకరంగా యూటర్న్ తీసుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ విమర్శలకు వంత పాడారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పై తమకు ఇసుమంతైనా నమ్మకం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇదే కేసులో శుక్రవారం (ఆగస్టు 8) సిట్ ముందు హాజరు కావడానికి ముందు బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.