Publish Date:Jun 19, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్టు కాబోతున్నారా? కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేసి ఆ తరువాత ఆయనతో విభేదించి బయటకు వచ్చ బీజేపీ గూటికి చేరిన ఈటల రాజేందర్ మాటల సంకేతమదేనా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేసిన సిట్ ఇప్పుడు బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నది. అందులో భాగంగానే ఈటల రాజేందర్ వాంగ్మూలం కూడా తీసుకోనున్నది. ఈ మేరకు ఇప్పటికే ఈటలకు సిట్ సమాచారం ఇచ్చింది.
దీనిపై మీడియాతో మాట్లాడిన ఈటల సంచలన విషయాలు చెప్పారు. దానిని బట్టే ఆయన టార్గెట్ కేసీఆర్ అని అర్ధమౌతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను సిట్ కు వాంగ్మూలం ఇస్తానని మీడియా ముఖంగా చెప్పిన ఈటల.. ఫోన్ ట్యాపింగ్ లో తొలి బాధితుడిని తానేనని అన్నారు. తన ఫోనే కాదు, తన కుటుంబ సభ్యులు, డ్రైవర్, గన్ మెన్, బంధువులు, స్నేహితుల ఫోన్లూ కూడా అప్పట్లో ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తాను సిట్ ఎదుట చెబుతానని వెల్లడించారు. అన్ని ఆధారాలు, రుజువులతో సహా సిట్ ఎదుటకు వెళ్లి వాంగ్మూలం ఇస్తానన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమనీ, ఇందులో ప్రమేయం ఉన్న వారందరికీ శిక్షపడాలని చెప్పారు. కేసు దర్యాప్తు సాగుతున్నకొద్దీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని వేళ్లూ మాజీ సీఎం కేసీఆర్ వైపే చూపుతున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నిర్థారణ అయ్యిందని అంటున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు తాను ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఇప్పటి వరకూ అంగీకరించకపోయినప్పటికీ ఇప్పటి దాకా ఈ కేసులో అరెస్టైన వారు, విచారణకు హాజరైన వారు కూడా ఆయన ఆదేశాల మేరకే పని చేశామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఈటల వాంగ్మూలం కీలకంగా మారిందంటున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఈటల.. కాళేశ్వరం అవినీతితో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకోవడమే కాకుండా, ఏమైనా అవకతవకలు జరిగితే కేసీఆర్, హరీష్ లే అందుకు బాధ్యులని సంకేతం ఇచ్చే విధంగా మాట్లాడారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-kcr-arrest-25-200298.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.