తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకరరావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన సోమవారం (జూన్ 9) సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత 15 నెలలుగా అంటే ఈ కేసు నమోదు కావడానికి కొద్ది రోజుల ముందు నుంచీ ఆయన అమెరికాలోనే ఉన్నారు. అక్కడే స్థిర నివాసం ఏర్పటు చేసుకోవడానికి గ్రీన్ కార్డ్ కూడా తీసుకున్నారు. చికిత్స పేరుతో అక్కడకు వెళ్లిన ప్రభాకరరావు.. ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా ఉండేందుకు చేయగలిగినంతా చేశారు. అయితే ఆయనను ప్రకటిత నేరస్థుడిగా గుర్తించే పరిస్థితి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించి. ఆ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు హైదరాబాద్ తిరిగి వచ్చారు. మాజీ ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగు చూసిన వెంటనే ముందు జాగ్రత్త పడ్డారు. విచారణను తప్పించుకునేందుకు అమెరికా చెక్కేశారు. అక్కడే ఉండిపోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. అవన్నీ విఫలం కావడంతో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో విపక్షాలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు అప్పట్లో కలకలం రేపిన సంగతి విదితగమే. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎ తిరిగి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభాకర్ రావు ద్వారా ఆ పని చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ రావు కూడా బీఆర్ఎస్ చెప్పినట్లుగా నడుచుకున్నారనీ, ఆయనకు ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు సహకరించారనీ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును సిట్ విచారించింది. ఆ విచారణలో రాబట్టిన అంశాల ఆధారంగా ప్రభాకరరావు ప్రమేయాన్ని నిర్ధారించుకుందని తెలుస్తోంది.
తనకు పొలిటికల్ అస్సైలమ్ ఇవ్వాలంటూ ప్రభాకరరావు దాఖలు చేసుకున్న పిటిషన్ ను అమెరికా కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ప్రభాకరరావు అనివార్యంగా హైదరాబాద్ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమిరేట్స్ విమానంలో దుబాయి మీదుగా ఆయన హైదరాబాద్ కు ఆదివారం (జూన్ 8) చేరుకున్నారు. సోమవారం (జూన్ 9) జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. ఇప్పుడు ప్రభాకరరావు సిట్ విచారణలో ఏం చెబుతారన్న దానిపై ఇప్పడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన నోరు విప్పితే బీఆర్ఎస్ అగ్రనాయకులకు గడ్డు కాలం తప్పదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-a1-prabhakararao-reached-hyderabad-25-199583.html
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.