Publish Date:Jun 24, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. విచారణ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతు ఫోన్ ట్యాపింగ్ విచారణ ఇంకా ఎంతకాలం చేస్తారని ఎంపీ ప్రశ్నించారు. హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో తన ఫోన్ అనేక సార్లు ట్యాప్ చేశారని అన్నారు. నేను, నా భార్య మాట్లాడుకునే సంభాషణలు కూడా విన్నారని నాయకుల ఫోన్లను మాత్రమే కాకుండా వారి గన్ మెన్‌ల ఫోన్‌లను కూడా ట్యాప్ చేశారన్నారు. 2018లో తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడే తనను ఓడించే ప్రయత్నం జరిగిందన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ తనకు అనుకులంగా పనిచేసే వారిని ఉన్నత స్థాయిలో నియమించుకున్నారని తెలిపారు.
ట్యాపింగ్ కేసులో ఎవరు ఉన్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు. 2023లో గజ్వెల్‌లో, హుజురాబాద్‌లో పోటీ చేసినప్పుడు తమ ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకం అక్రమం అని చెప్పారు. గత బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై కమిటీలు వేస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఎందుకు నివేధికలను బయటపెట్టడంలేదని అడిగారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును ఆటంకం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. సంఘవిద్రోహ శక్తులు కాకుండా నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేయడం దారుణమని చెప్పారు. ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంలో విచారణ కమిటీ వేశారు కానీ దర్యాప్తు వేగంగా జరగడం లేదని ఎంపీ ఈటల పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-39-200569.html
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక జర్నలిస్టు బలవన్మరణానికి పాల్పడ్డారు.
గత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్‌కు కుక్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.
గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి.
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం గల గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. యూరియా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు చెప్పింది. బుధవారం (జులై 9) వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి అడుగుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను వినూత్నంగా అభివృద్ధి చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ బుధవారం అన్నా క్యాంటీన్‌లో భోజనం చేశారు. భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలతో పాటు నిలుచుని, జేబులో నుండి ఐదు రూపాయలు చెల్లించి క్యాంటీన్‌లో భోజనం అందుకున్నారు.
ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టులో పది రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సభాపతి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
మొన్నటి విశ్వవసు నామ సంవత్సర ఉగాది పంచాంగం చదువుతుండగా ఆ పండితుడు చెప్పిందేంటంటే జగన్ కి స్త్రీ మూలక సమస్యలు ఎక్కువగా వస్తాయని. ఆ సరికే ఆయన తన తల్లి చెల్లితో పీక లోతు పోరాటం చేస్తున్నారు. కేసులు గట్రా వ్యవహారాలు నడుస్తున్నాయ్.