ఫోన్ పే రచ్చ రాజకీయులు సరే... స్టార్ల సంగతేంటి?

Publish Date:Jun 25, 2025

Advertisement

 

ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ సరిహద్దులు దాటి పోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరూ, అప్పట్లో అధికారం నిలుపుకునేందుకు ఫోన్ ట్యాపింగ్’నూ ఒక అస్త్రంగా వాడుకున్నారు. అలాగే,స్నేహపూర్వకంగా ‘సమాచారం’ ఇచ్చి పుచ్చుకున్నారని అంటున్నారని, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తాను తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న సమయంలో,తన ఫోన్’తో పాటుగా తమ కుటుంబ సభ్యులు, తమ పార్టీ (టీవైసీపీ) నాయకుల ఫోన్లు కూడా, ట్యాప్  చేసి సమాచారాన్ని, బ్రదర్ జగన్ రెడ్డి’కి అందించారని ఆరోపించారు. నిజానికి, ఒక షర్మిల అనేముంది,అప్పట్లో తెలంగాణలో క్రియాశీలంగా ఉన్న రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులు ఎవరినీ వదిలి పెట్ట కుండా, దొరికిన’ ప్రతి ఒక్కరి ఫోను ట్యాప్ చేశారు.

అదేదో ఎవరో చెప్పిన మాటో,ఇంకెవరో చేసిన ఆరోపణ కాదు, అధికారులేతారీకులతో సహా, ట్యాపింగ్ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. అయితే, ఇది పూర్తిసమాచారం కాదు,చేయగలిగినంత డిస్ట్రాయ్ చేసి, తగల బెట్టగలిగినంత తగల బెట్టగా, మిగిలిన సమాచరం మాత్రమే ఇచ్చారు. ఆ సమాచరం  ప్రకారం చూసిన ఒకే ఒక్క పక్ష రోజుల్లో, ( 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు) 4013 పోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్లుగా ప్రణీత్ రావు ,ఇతర అధికారులు అంగీకరించారు.అందులో 618 మంది రాజకీయ నాయకుల ఫోన్లు ఉన్నట్లుసమాచరం.ఆ 618 మందిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్,పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ ఆయన కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేసినట్లు గుర్తించారు.అలాగే, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనంపల్లి హనుమంత్ రావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం , మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి , మర్రి జనార్ధన్ రెడ్డి, తాటి కొండ రాజయ్యలకు సిట్ నోటీసు ఇవ్వనుంది. ఐఏఎస్‌లు రోనాల్డ్ రాస్, గౌతంల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. మొత్తం 618 మంది స్టేట్‌మెంట్లను కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇప్పటి వరకు 228 మంది స్టేట్‌మెంట్ రికార్డింగ్‌లు పూర్తి అయ్యాయి.

618 మంది ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలను బట్టి ఇప్పటి వరకు 228 మంది స్టేట్‌మెంట్లను రికార్డు చేయగా.. మరికొంత మంది స్టేట్‌మెంట్లను కూడా రికార్డు చేయనుంది సిట్. ఇంతటి సంచలనమైన కేసును సీబీఐకు అప్పగించాలని, సీబీఐ విచారణలోనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టేది లేదని, విచారణలో ఎవరి ప్రమేయం ఉన్నా అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే ఇప్పటి వరకు అధికారుల వరకు మాత్రమే విచారణ, అరెస్ట్‌లు జరుగగా.. అధికారుల వెనక ఉన్న అప్పటి బీఆర్‌ఎస్ నేతలు ఎవరనేది మాత్రం దర్యాప్తులో వెల్లడి కావాలసి వుంది..అదొకటి అయితే, మొత్తం ట్యాపింగ్ చేసిన  4013 చేసియన్ ఫోన్ నెంబర్లలో కేవలం 618 మాత్రమే రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు, మిగిలిన మిగిలిన మూడు వేల పైచిలుకు నెంబర్లు ఎవరివీ ?  ఎన్నికలు జరుగుతున్న సమయం కాబట్టి, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారంటే ఓకే, తప్పయినా ఒప్పయినా అర్థం చేసుకో వచ్చును. 

అదే సమయంలో వేల సంఖ్యలోఇతరుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినట్లు? అసలు ఇంతకీ ఆ ఇతరులు ఎవరు? ఇది కూడా తేల  వలసిందే అంటున్నారు.అలాగే తాజాగా, పీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్‌తో సినీతారల కుటుంబంలో చిచ్చు పెట్టారంటూ చేసిన వ్యాఖ్యలు  తెరపైకి తెచ్చిన కొత్త కోణాన్ని విచారించవలసిందే అంటున్నారు.  అదలా ఉంటే 618 మంది ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలను బట్టి ఇప్పటి వరకు 228 మంది స్టేట్‌మెంట్లను సిట్’ రికార్డు చేసింది. మరికొంత మందికి కూడా సిట్’ ఇపైకే నోటీసులు ఇచ్చింది,నోటీసులు ఇవ్వవలసిన వారు ఇంకా కూడా ఉంటారు. దీనికి మహేష్ కుమార్ గౌడి యాడ్ చేసిన, సినిమా స్టార్స్, ఇతర సెలబ్రిటీలు ఇతరులను కలిపితే, వాగ్మూలం రికార్డ్ద్ చేయవలసిన వారి చిట్టా, కొండవీటి చాంతాడంత’ ఉన్నాఆశ్చర్య పోనవసరం లేదు. ఇలా తవ్విన కొద్దీ తన్నుకొస్తున్న సంచలనాలను దృష్టిలో ఉంచుకుని, కేసును సీబీఐకు అప్పగించాలని, సీబీఐ విచారణలోనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని బీజేపీ బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. నిజానికి కేసు పూర్వాపరాలు తెలిసిన, న్యాయనిపుణులు కూడా అదే అంటున్నారు. ఇంతవరకు అయితే ప్రభుత్వం స్పందించలేదు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నెల్లూరులోని బారా షాహీద్ దర్గాను సందర్శించి ప్ర్తత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అదే విధంగా రొట్టెల పండుగ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుుటుంబానికి చెందిన నలుగురు హైదరాబాదీయులు మృతి చెందారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టీ తలుపులు శాశ్వతంగా మూసుకు పోతున్నాయా? పార్టీకి రాజీనామా చేసి.. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ (బీజేపీ స్టేట్ ఆఫీస్) మెట్లు దిగివచ్చిన రాజాసింగ్ మళ్ళీ ఆ మెట్లు ఎక్కను అంటూ చేసిన ప్రతిజ్ఞను పార్టీ సీరియస్ గా తీసుకుందా?
మంత్రి నారా లోకేష్ సోమవారం (జులై 7) నెల్లూరులో వీఆర్‌ హై స్కూల్‌ను ప్రారంభించారు. ఆ తరువాత స్కూలులోని అన్ని క్లాస్ రూమ్ లను సందర్శించి ప్రతి క్లాసులోనూ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు.
తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. అలిపిరి సమీపంలోని కపిలతీర్ధం రోడ్డులో ఒక సైకో వీరంగం కలకలం సృష్టించింది. చేతిలో కత్తి, కర్రతో ఆ సైకో దారిన వచ్చీపోయేవారిపై ఇష్టారీతిగా దాడులకు పాల్పడింది.
డోనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ సారి ఆయన బిక్స్ దేశాలకు ఈ హెచ్చరిక చేశారు. అమెరికా విధానాలను వ్యతిరేకించే, లేదా అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబించే దేశాలపై పది శాతనం సుంకాలు పెంచుతాని ట్రంప్ హెచ్చరించారు.
మామిడిరైతుల విషయంలో రాజకీయం చేద్దామనుకున్న వైసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డికి చంద్రబాబు చెక్ పెట్టారు. ప్రభుత్వ పరంగా మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం లీగల్ సెల్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు లక్ష్యంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంతి లోకేష్ కు అంతర్గత నోట్ రూపంలో పంపిన ఫిర్యాదు సంచలనం సృష్టిస్తోంది.
ఎట్ట‌కేల‌కు భార‌త్ యువ‌సేన ఇంగ్లండ్ గ‌డ్డ మీద అదీ విజయమన్నదే ఎరుగని ఎడ్జ్ బాస్టెన్ వేదికలో టెస్టు గెలుపు బావుటా ఎగుర‌వేయ‌గ‌లిగింది. కార‌ణం.. ఒక‌టి శుభ్ మ‌న్ గిల్ బ్యాటింగ్, రెండు సిరాజ్- ఆకాష్ దీప్ జోడీ అద్భుత బౌలింగ్.
మ‌స్క్ పెట్టిన పార్టీపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఒక‌రు అధ్య‌క్షులు కావాలంటే.. అందుకు ఫ‌స్ట్ వారు జ‌న్మ‌తహ అమెరికా పౌరులై ఉండాలి. 35 ఏళ్ల‌ పైబ‌డి వ‌య‌సుగ‌ల వారై ఉండాలి. ఆపై 14 ఏళ్ల పాటు అమెరికాలోనే నివాసం ఉండి తీరాలి. వీటిలో ఏవీ మ‌స్క్ కి లేవు. ఆయ‌న ద‌క్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టారు.
తెలంగాణలో మరో రెండున్నర మూడు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి జాతీయ స్థాయిలో పునర్జీవనం పొందేందుకు ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికలను, జాతీయ ధృక్కోణంతో చూస్తోంది. అందుకే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారు.
అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయినా చెల్లినట్లు, అధికారం కోల్పోయిన తరువాత కూడా చెలరేగిపోతామంటే కుదరదన్న విషయం ఇప్పుడు వైసీపీ నాయకులు, క్యాడర్ కు బాగా ఇప్పుడు తెలిసివస్తోంది.
దేశంలో ఏ మూల ఏ స్కాం జరిగినా అందులో వైసీపీ నేతలు కచ్చితంగా ఉంటారు. గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా ఇలా ఏ నేరం జరిగినా.. అందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు తేలుస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.