లిక్కర్ తరహాలోనే పెట్రోల్ స్మగ్లింగ్! జగనన్న పాలన స్పెషల్.. 

Publish Date:Nov 9, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అంతా స్పెషలే. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏపీలో అంతా రివర్స్ పాలన సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. దేశంలోని మిగితా రాష్ట్రాల్లో ఒకలా ఉంటే.. ఏపీలో మరోలా ఉంటోంది. సాగునీటి ప్రాజెక్టులు సహా అన్ని అంశాల్లోనూ అంతే. జగన్ సర్కార్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీపై జనాలు భగ్గుమంటున్నారు. జనాలకు ఇష్టమైన బ్రాండ్లను పక్కనపెట్టి.. నాసిరకమైన కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. ధరలు కూడా భారీగా పెంచేశారు. దీంతో ఏపీకి పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా సరఫరా అవుతోంది. 

ఏపీలో ధరలు ఎక్కువగా ఉండడం.. ప్రజలకు అలవాటైన సంప్రదాయ బ్రాండ్లు లేకపోవడంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని రవాణా చేసుకుని..ఏపీలో విక్రయించే ముఠాలు ఏర్పడ్డాయి. ఏపీతో పోలిస్తే..  తెలంగాణలో మద్యం ధరలు చాలా చౌక. దీంతో ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు చెందిన మద్యం అలవాటు ఉన్న ప్రజలు.. తెలంగాణలోకి వెళ్లి మద్యం తాగి వస్తున్నారు.  కొందరు కొన్ని బాటిళ్లను కొనుగోలు చేసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం తొలుత మూడు బాటిళ్లను తెచ్చుకునేందుకు అవకాశం కల్పించింది. అవి ఏసైజు బాటిళ్లయినా.. అనుమతించింది. గత ఏడాది చివరిలో ఈ మూడు బాటిళ్లను కూడా బ్యాన్ చేసింది. అయినా వివిధ మార్గాల్లో ఏపీకి అక్రం మద్యం బాటిళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. 

లిక్కర్ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు కష్టాలు పడుతుండగా.. తాజాగా జగన్ ప్రభుత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. పెట్రోల్ డీజిల్ ధరలు ఏపీలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీపావళి సందర్భంగా కేంద్రం పెట్రోల్ పై రూ. 5 డీజిల్ పై రూ.10 వరకు తగ్గింపు ప్రకటించింది. దీంతో పలు రాష్ట్రాలు కేంద్రం బాటలోనే వ్యాట్ తగ్గించుకున్నాయి. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆ రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.12.  డీజిల్ ధర రూ.17 వరకు తగ్గింది.  కానీ ఏపీ సర్కార్ మాత్రం తగ్గించలేదు. దీంతో కర్ణాటకతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ ధర 12 రూపాయలు, డీజిల్ ధర 17 రూపాయలు ఎక్కువగా ఉంది. దీంతో కర్ణాటక సరహద్దులో ఉన్న బంకులకు ఏపీ జనాలు వెళుతున్నారు. 

ఏపీ సరిహద్దుల్లోని రాళ్లబుడుగూరు ప్రాంతంలో కర్ణాటకకు చెందిన కెంపేపుర సరిహద్దు ఉంది. ఇక్కడి బంకు యజమానులు.. ఏపీలోను తమ వద్ధ ఉన్న ధరలను పోలుస్తూ..కరపత్రాలను ముద్రించారు. వీటిని తెలుగులో నే ముద్రించి.. ఏపీలో కంటే తమదగ్గరే పెట్రోల్ ధరలు తక్కువని..తమ వద్ద పెట్రోల్ కొనుగోలు చేయాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ పెట్రో బిజినెస్ జోరుగా సాగుతోంది. గతంలో రోజుకు 3000-5000 లీటర్లు అమ్మే ఈ బంకులు.. ఇప్పుడు రోజుకు 15000 నుంచి 18000 లీటర్ల చొప్పున విక్రయిస్తున్నారు. అదే సమయంలో ఏపీ సరిహద్దు ప్రాంతంలో  మొబైల్ విక్రయదారులు కూడా పెరిగిపోయారు. కర్ణాటక నుంచి తెస్తున్న పెట్రోల్ , డీజిల్ ను వారు ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇది ఏపీ ఖజానాకు గండంగా మారింది. 

కర్ణాటకలో ధరలు తగ్గించి.. కొంత మేరకు నష్టపోతున్నా.. ఎక్కువ మొత్తంలో పెట్రోల్ డీజిల్ను విక్రయిస్తూ.. ఆ నష్టాన్ని లాభాల రూపంలో మలుచుకుంటోంది.  జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. కర్ణాటక బంకు యజమానులకు వరంగా మారిందని కొందరు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. మద్యంపై నిఘా పెట్టినట్టే.. సరిహద్దుల్లో జగన్ ప్రభుత్వం పెట్రోల్ ట్యాంకులపైనా నిఘా పెడుతుందా?  పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొనేవారిపై చర్యలు తీసుకుంటుందా?అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కర్ణాటక నుంచి ఏపీలోకి వచ్చే వాహనాలు.. కేవలం 10 లీటర్లకు మించి పెట్రోల్ లేదా డీజిల్ తో రాకూడదని.. జగన్ సర్కారు ఏమైనా నిబంధనలు పెడుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.