చంద్రబాబుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు!!
Publish Date:Jun 14, 2019
Advertisement
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు అయింది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయనపై రిపబ్లిక్ పార్టీ అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ప్రభుత్వ సొమ్మును వాడుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ పథకాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. చంద్రబాబు సొంత ఖర్చు కింద ఆ నిధులను జమ చేయాలంటూ అనిల్ కుమార్ కోరారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/petition-filed-in-ap-high-court-against-chandrababu-39-87377.html
http://www.teluguone.com/news/content/petition-filed-in-ap-high-court-against-chandrababu-39-87377.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026





