అడ్డంగా దొరికిపోయిన పేర్ని నాని.. ఇక శ్రీకృష్ణజన్మస్థానమే!

Publish Date:Jan 2, 2025

Advertisement

రేష‌న్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్నినాని మెడ‌కు ఉచ్చు బిగుస్తోంది. భారీ మొత్తంలో బియ్యం మాయం వెనుక పేర్ని నాని హ‌స్తం ఉన్న‌ట్లు పోలీసులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. తెర‌వెనుక ఉండి ఆయ‌నే రేష‌న్ బియ్యాన్ని మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా కాకినాడ పోర్టుకు త‌ర‌లించిన‌ట్లు ఆధారాల‌తోస‌హా పోలీసులు గుర్తించారు. దీనికితోడు జ‌య‌సుధ‌ను విచారించిన స‌మ‌యంలోనూ, కేసులో ఉన్న మ‌రో నలుగురిని విచారించిన స‌మ‌యంలోనూ పేర్ని నాని పేరును ప్ర‌ముఖంగా వారు ప్ర‌స్తావించార‌ట‌. దీంతో పేర్ని నానిని అరెస్టుచేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేందుకు పోలీసులు ప‌క్కా ఆధారాల‌తో రంగం సిద్ధంచేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ6 ముద్దాయిగా ఉన్న పేర్ని నాని.. అరెస్టు చేయొద్దంటూ కోర్టు నుంచి ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే, వ‌చ్చే సోమ‌వారం బెయిల్ పిటిష‌న్‌పై మ‌రోసారి కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఆ త‌రువాత పేర్ని నాని అరెస్టు ఖాయ‌మ‌ని వైసీపీ వ‌ర్గాల్లోనే పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలాఉంటే పేర్ని నాని గోదాములో బియ్యం మాయం కేసు గురించి విచారిస్తున్న క్ర‌మంలో పోలీసులు మ‌రికొన్ని వివ‌రాల‌ను సేక‌రించారు. ఇత‌ర జిల్లాల్లోనూ కొంద‌రు వైసీపీ నేత‌లు గోదాముల్లో రేష‌న్ బియ్యాన్ని అక్ర‌మంగా కాకినాడ పోర్టుకు త‌ర‌లించిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌డితే మ‌రికొంద‌రు వైసీపీ నేత‌లు సైతం జైలు ఊచలు లెక్కించ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది.    

వైసీపీ హ‌యాంలో త‌న స‌తీమ‌ణి జ‌య‌సుధ పేరిట పేర్ని నాని గోదాముల‌ను నిర్మించారు. ఆ గోదాముల‌ను పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు అద్దెకు ఇచ్చారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత గోదాములో అధికారులు త‌నిఖీలు నిర్వహించగా.. పెద్ద ఎత్తున బియ్యం నిల్వ‌ల్లో తేడాలు ఉన్న‌ట్లు గుర్తించారు. భారీ మొత్తంలో బియ్యం మాయ‌మైన‌ట్లు నిర్దార‌ణ‌కు వ‌చ్చిన‌ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గోదాము యాజ‌మాని పేర్ని జ‌య‌సుధ‌, గోదాము మేనేజ‌ర్ మ‌న‌స తేజ్‌, పౌర‌స‌ర‌ఫ‌రాల అధికారి కోటిరెడ్డితో పాటు మ‌రో ఇద్ద‌రిపై పోలీసులు క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేశారు. మాన‌స‌త్ తేజ్‌, కోటిరెడ్డితోపాటు మ‌రో ఇద్ద‌రి మ‌ధ్య దాదాపు 25ల‌క్ష‌ల నుంచి 30 ల‌క్ష‌ల మేర లావాదేవీలు జ‌రిగిన‌ట్లు, పేర్ని నాని కుటుంబ స‌భ్యుల బ్యాంకు ఖాతాల‌కు కూడా మాన‌స్ తేజ్ బ్యాంకు ఖాతా నుంచి ల‌క్ష‌ల్లో లావాదేవీలు జ‌రిగిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అయితే, తేడా వ‌చ్చిన రేష‌న్ బియ్యం మొత్తానికి డ‌బ్బులు చెల్లిస్తామ‌ని పేర్ని నాని కుటుంబం అధికారుల‌కు లేఖ రాసింది. రూ.3.37 కోట్ల‌కుపైగా విలువైన బియ్యం మాయ‌మైంద‌ని అధికారులు అంచ‌నాకు వ‌చ్చారు. తొలుత రూ.1.70కోట్లు చెల్లించాల‌ని సూచించ‌గా.. పేర్నినాని కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించింది. మూడు రోజుల కిందట మరో రూ.1.67 కోట్లు చెల్లించాల‌ని అధికారులు పేర్ని నాని కుటుంబానికి నోటీసులు ఇచ్చారు.

ఈ కేసులో ఏ1గా ఉన్న జ‌య‌సుధ కోర్టు ద్వారా ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే, పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. మ‌రోవైపు ఈ కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5లుగా ఉన్న మాన‌స్ తేజ్‌, కోటిరెడ్డి, లారీ డ్రైవ‌ర్ మంగారావు, రైస్ మిల్ల‌ర్ ఆంజ‌నేయులును పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అనంత‌రం సోమ‌వారం రాత్రి కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా.. కోర్టు వారికి 14రోజులు రిమాండ్ విధించింది. దీంతో వారిని  మ‌చిలీప‌ట్నం స‌బ్ జైలుకు త‌ర‌లించారు.   విచారణలో వీరు  గోదాములో బియ్యం మాయం వెనుక పేర్ని నాని ప్ర‌మేయం ఉంద‌ని  స్ప‌ష్టం చేశారు. దీంతో పోలీసులు పేర్ని నానిని ఈ కేసులో ఏ6గా చేర్చారు. ఎఫ్ఆర్ఐ న‌మోదు చేయ‌గా.. నాని అరెస్టు అవుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఆయ‌న ముంద‌స్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు. వ‌చ్చే సోమ‌వారం వ‌ర‌కు నానిని అరెస్టు చేయొద్ద‌ని కోర్టు పోలీసుల‌కు అదేశాలు జారీ చేసింది. అదే స‌మ‌యంలో సోమ‌వారం కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని పోలీసుల‌కు సూచించింది. 

అంతే కాకుండా బియ్యం మాయం కేసులో ఏ1గా ఉన్న పేర్ని జ‌య‌సుధకు పోలీసులు మ‌రోసారి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం పోలీస్ స్టేషన్ లో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సూచించారు. దీంతో ఆమె బుధ‌వారం మ‌ధ్యాహ్నం  విచారణ నిమిత్తం ఆర్ పేట పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చారు. రెండు గంట‌ల‌కుపైగా పోలీసులు ఆమెను విచారించారు. ఇదిలా ఉంటే.. న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చే క్రమంలో పేర్ని జయసుధ మచిలీపట్నం మేయర్ కారులో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది.  మరోవైపు జయసుధ వెంట వచ్చిన న్యాయవాదులను స్టేషన్‌లోకి పోలీసులు అనుమతించలేదు. స్టేషన్ బయటే ఆపివేశారు. అయితే, స్టేష‌న్ బ‌య‌ట వైసీపీ శ్రేణులు పెద్ద హంగామానే చేశారు. మా మేడమ్ ను ఇంత‌సేపు విచారిస్తారా అంటూ పోలీసుల‌పై నోరుపారేసుకున్నారు. రెండు గంట‌ల‌కుపైగా జ‌యసుధ‌ను విచారించిన పోలీసులు కీల‌క విష‌యాల‌ను రాబ‌ట్టారు.

పేర్ని జ‌య‌సుధ‌ను విచారించిన త‌రువాత‌.. గోదాములో రేష‌న్‌ బియ్యం మాయం వ్య‌వ‌హారం వెనుక క‌థ న‌డిపింది పేర్ని నాని అని పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. రేష‌న్ బియ్యాన్ని మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా కాకినాడ‌కు త‌ర‌లించార‌ని పోలీసులు గుర్తించారు. దీంతో తీగ‌ లాగితే డొంక క‌దిలిన‌ట్లు కాకినాడ పోర్టులో రేష‌న్ బియ్యం దందా సైతం క్ర‌మంగా వెలుగులోకి వ‌స్తుంది. దీంతో వైసీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. మ‌రోవైపు ఈ కేసులో పేర్ని నానిని అరెస్టు చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. వారం రోజుల్లో పేర్ని నానిని అరెస్టు చేసి జైలు పంపించ‌డం ఖాయ‌మ‌ని, పోలీసుల‌కు నాని అడ్డంగా దొరికిపోయారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. మొత్తానికి రేష‌న్‌ బియ్యం మాయం కేసులో పేర్ని నాని మెడ‌కు ఉచ్చు బ‌లంగా బిగుసుకుందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.   

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.