జనం మరిచిపోతారన్న భయంతోనే పేర్ని ప్రేలాపనలు!

Publish Date:Jun 21, 2022

Advertisement

పేర్ని నాని జగన్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురి కాక ముందు వరకూ ఆయన మీడియా ముందు రాని రోజు ఉండేదంటే అతిశయోక్తి కాదు. నిత్యం విపక్ష తెలుగుదేశంపై విమర్శలు గుప్పించడంలోనూ, పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేయడంలోనే ఆయన అందరి కంటే ముందుండే వారు. మంత్రి పదవి పోయిన తరువాత అలకో, ఉక్రోషమో, నిరాశో, నిర్వేదమో తెలియదు కానీ.. పలుకే బంగారమన్నట్లుగా మారిపోయారు. దానికి తోడు మచిలీపట్నం నియోజకవర్గంలో ఎంపీతో వర్గ పోరు. ఇక పేర్ని పనైపోయిందన్న గుసగుసలూ వైసీపీలో బాగానే వినిపించాయి.

మౌనంగా ఉంటే కనుమరుగైపోతామని భావించారో ఏమో పేర్కొ ఒక్క సారి గొంతు సవరించుకున్నారు. అలా ఇలా కాదు.. మళ్లీ నెనుకటి పేర్ని కనిపించేలా? ఈ సారి కూడా ఆయన తనకు అచ్చొచ్చినట్లుగా పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టారు. పనిలో పనిగా తెలుగుదేశంపైనా కొన్ని విమర్శలు విసిరారు అది వేరే సంగతి. అధినేతకు ఏం మాట్లాడితే నచ్చుతుందో బాగా తెలిసిన వైసీపీ నేతలలో పేర్ని నాని ఒకరు. అందుకే ఆయన చాలా కాలం గ్యాప్ తరువాత మీడియా ముందుకు వచ్చినా ఆయన విమర్శలలో వెనుకటి పదును తగ్గలేదనిపించేలా మాట్లాడారు. ఎంపీ వల్లభనేని బాలశౌరితో విభేదాల కారణంగా పార్టీలో గుర్పింపునకు ముప్పు వచ్చిందన్న అదురో, బెదురో తెలియదు కానీ తాజా ప్రెస్ మీట్ లో ఆయన విపక్షాలపై విమర్శలతో చెలరేగిపోయారు.

బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులంటూ జనసేనాని రాజకీయం చేస్తున్నారన్నారు. రైతుకు జగన్ చేస్తున్న సహాయంతో, మేలుతో పోలిస్తే జనసేనాని చేస్తున్నది ఏ పాటి అంటూ చెరిగి పారేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ అన్నదాతను అదుకునే విషయంలో జగన్ ను ఫాలో అవుతున్నారంటూ గత కొంత కాలంగా ఆయన పూర్తిగా మరచిపోయిన అధినేత భజనను ఈ మీడియా సమావేశంతో మరో సారి మొదలెట్టేశారు. అంతే కాదు ఒంటరి పోరుకు సిద్ధపడాల్సిందిగా జనసేనానిని రెచ్చగొట్టేందుకే తన వాగ్ధాటిని ఉపయోగించారు. పనిలో పనిగా చంద్రబాబు హయాంలో రైతులకు పంటనష్టపరిహారం చెల్లించలేదన్న ఆరోపణలను మళ్లీ తెరపైకి తీసుకువచ్చి ముందు వాటిని ప్రశ్నించమని పవర్ స్టార్ కు సూచించారు.

అంతే కాకుండా రైతుల కోసం జగన్ అండగా నిలబడ్డారని కితాబిచ్చేశారు. రైతుకు అండగా జగన్ నిలబడినట్లు గతంలో చంద్రబాబు ప్రభుత్వం కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కానీ నిలబడ్డాయా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ దృష్టిలో ప్రశ్నించడమంటే జగన్ ను విమర్శించడమేనని నిష్ఠూరమాడారు.   మాట మీద నిలబడటం జనసేన హిస్టరీలోనే లేదన్న పేర్ని నాని 2014లో పార్టీ పెట్టి చంద్రబాబుకు ఓటేయమన్న పవన్ కల్యాణ్, 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలకుంటే జగన్ కు మేలు జరుగుతుంది కనుకనే ఎన్నికల్లో నిలబడుతున్నామని చెప్పుకున్నారు.

ఇప్పుడేమో జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదు కనుక తెలుగుదేశంతో కలుస్తానంటున్నారు. అంటూ ఎద్దేవా చేశారు.  ఎన్ని చేసినా పేర్ని గారికి వైసీపీలో గతంలోలా ప్రాధాన్యత లభిస్తుందా అంటే పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. పూర్తాగా కనుమరుగైపోతానన్న భయంతోనే పేర్ని మీడియా ముందు విపక్షాలపై విరుచుకుపడుతున్నారని, ఆయన ఇప్పుడు కొత్తగా చెప్పిందేమీ లేదనీ పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.