ఆదోనిలో బాబుకు బ్రహ్మరథం.. జన సంద్రంగా మారిన పట్టణం

Publish Date:Nov 17, 2022

Advertisement

చంద్రబాబు కర్నూలు పర్యటనకు జనం బ్రహ్మరథం పట్టారు. మూడు రోజుల పర్యటలో చంద్రబాబు మాటల పదును పెరిగింది. సుత్తి లేకుండా సూటిగా విషయాన్ని జనం హృదయాలకు హత్తుకునేలా చెప్పారు. జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే.. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్నది స్పష్టంగా చెబుతూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు.

గతంలోలో జగన్ సర్కార్ పై విమర్శలకే పరిమితం కాకుండా...జగన్ పాలన వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. జగన్ పాలనా వైఫల్యాలతో రాష్ట్రానికి జరిగిన నష్టాలను చంద్రబాబు ఏకరవు పెడుతుంటే జనంలో మంచి స్పందన కనిపించింది. చంద్రబాబు పర్యటనకు జనం నుంచి వచ్చిన స్పందన తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ నింపింది. జగన్ ను సాగనంపితే తప్ప రాష్ట్రానికి మోక్షం లేదు. ప్రజలకు సంతోషం లేదు అంటూ నిప్పులు చెరిగారు. గడపగడపకూ వస్తున్న వైసీపీ దొంగల్ని ఎక్కడికక్కడ నిలదీయండి అంటూ పిలుపు నిచ్చారు. నాలుగు సార్లు తిరిగితే అన్ని మర్చిపోయి ఓట్లేస్తారన్నది వారి ఆశ.. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మనం మరచిపోతామా? లక్షల రేషన్ కార్డులు తొలగించారు, పేదల పొట్టగొట్టిన ఘనడు జగన్.. పేదల ఆకలి మంటలే శాపంగా మారతాయి అవునా కాదా అంటూ జనాలను ప్రశ్నించి వారిలో ఆవేశాన్ని రగిలించారు.

తెలుగుదేశం అధికారంలోకివ వస్తే సంక్షేమం ఉండదంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నదుష్ప్రచారాన్ని ఖండించారు. గతంలోనే తెలుగుదేశం సంక్షేమానికి పెద్ద పీట వేసిందని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పటి కంటే మెరుగైన సంక్షేమంఅందించి చూపుతానని వాగ్దానం చేశారు. సంక్షేమ పథకాలు ప్రజలకు ఆర్థిక దన్నుగా నిలిచి వారు ధనవంతులు కావడానికి ఉపయోగపడాలన్నారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంగా జగన్ వంటి అసమర్ధ సీఎంను చూడలేదన్నారు. జగన్ రాయలసీమ ద్రోహిగా అభివర్ణించిన చంద్రబాబు.. సీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశమే అని ఉద్ఘాటించారు.  

కడపలో స్టీల్ ప్లాంటు నిర్మించలేని ఈ పెద్ద మనిషి మూడు రాజధానులు నిర్మిస్తారంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టుకు నేను అడ్డుపడుతున్నానని ప్రచారం చేస్తున్నారు. నేను అడ్డుపడడం లేదు. మీకు 151 సీట్లు ఇచ్చారు. ఎంపీలను ఇచ్చారు.  నువ్వు చేసిందేమిటి?అని ప్రశ్నించారు. తన వయస్సుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కూడా చంద్రబాబు దీటుగా సమాధానం చెప్పారు. తనదీ ప్రధాని మోడీదీ ఒకటే వయస్సని గుర్తు చేశారు.   70 ఏళ్లకు బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. నేను శారీరకంగా చాలా ఫిట్ గా ఉన్నా. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్లకుఅప్పగిస్తాను తప్ప..   మీ పేటీఎం బ్యాచ్ కు వదిలిపెట్టనని స్పష్టంగా చెప్పారు. రాష్ట్రం భవిష్యత్ కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం ప్రజలారా నన్ను ఆశీర్వదించండి అని చంద్రబాబు విజ్ణప్తి చేశారు.

గతంలో వ్యవసాయ కూలీల పిలలు తాను అమలు చేసిన విద్యావిధానం వల్ల  ఐటీ ఉద్యోగాలు సాధించారుచ అదే జగన్‌రెడ్డి అధ్వాన విధానాల కారణంగా  మటన్ కొట్టులో ఉద్యోగాలకు పరిమితమై పోయారని విమర్శించారు.  రాష్ట్ర సంపద పెంచే మార్గం నాకు తెలుసు.. ఆస్తులు తాకట్టు పెట్టడం మాత్రమే జగన్ కు తెలుసు అంటూ విమర్శలు గుప్పించారు.   జగన్ ఓ పిల్ల కుంక. తెలివిగా ఆలోచిస్తే ప్రపంచాన్ని జయించవచ్చు. పేదవాడు పేదవాడుగా ఉండటానికి వీల్లేదు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ సిద్ధం. నిండు మనసుతో ఆశీర్వాదించి అసెంబ్లీకి పంపండి. మీ రుణం తీర్చుకుంటాను’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆదోని పట్టణం పసుపువనంగా మారిపోయింది. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనసందోహాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వశం కాలేదు. ఆదోని పట్టణంలో చంద్రబాబు రోడ్ షోకు జనం పోటెత్తారు. రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. రోడ్డుకిరువైపులా జనం నిలబడి చంద్రబాబుకు అభివాదం చేశారు. భవనాలపై నుంచి పూలవర్షం కురిపించారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రోడ్ షో చాలా నెమ్మదిగా సాగింది. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదలడమే కష్టంగా మారిన పరిస్థితి కనిపించింది. జనం స్పందనతో చంద్రబాబులో కూడా ఉత్సాహం కనిపించింది. జగన్ పాలనపై జనం ఎంతగా విసుగెత్తి ఉన్నారో చెప్పడానికి ఈ జనసందోహమే నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.