గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిర‌గ‌బ‌డుతున్న ప్ర‌జ‌!

Publish Date:Jun 17, 2022

Advertisement

పాల‌న అద్భుతంగా సాగుతుంటే ప్ర‌జ‌లు భుజాన‌కెత్తుకుంటారు. కేవ‌లం ప్ర‌చార ఆర్భాటంతో న‌డుస్తుం టే నొస‌ట‌ విరుపులూ వుంటాయి. ప్ర‌జ‌లు ఓట్లు వేసి గెలిపించారు గ‌నుక వారికి ఆగ్ర‌హించే హ‌క్కూ  వుం టుంది.  ప్ర‌జాసంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాలు నిజంగానే ప్ర‌జ‌ల‌కు అందాలి కేవ‌లం పేరుకి ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వం పూనుకుంటే ఎద‌ర‌య్యేవ‌న్నీ అవ‌మానాలే! ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తారు, కాదు పొమ్మం టారు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  జ‌గ‌న్ పాల‌న ప‌రిస్థితి ఇలానే వుంది. 

వైసిపి గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మం ఉదృతంగా చేప‌ట్ట‌ద‌లిచారు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి త‌మ  సంక్షేమ  కార్య‌క్ర మాల గురించి వైసీపి ఎమ్మ‌ల్యేలు, మంత్రులు ఇంటింటికీ తెగ తిరుగుతున్నారు. త‌మ‌ది గొప్ప సంక్షేమ రాజ్య‌మ‌ని, పింఛ‌న్లు పెద్ద  మొత్తంలో అంద‌స్తున్న ఘ‌న‌త త‌మ‌దేన‌ని  ప్ర‌చారం చేస్తూ  ప్ర‌జ‌ల‌కు  వారి సేవ‌లు ఎంత‌గా న‌చ్చాయో తెలుసుకుందామ‌ని  గ‌డ‌ప గ‌డ‌ప‌కూ తిరుగుతున్నారు. చిత్ర‌మేమంటే పింఛ న్లు  ఇప్పుడే కాదు చాలాకాలం నుంచి వ‌స్తున్నాయి, గ‌త ప్ర‌భుత్వాలు ఇచ్చాయ‌న్న‌ది ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద‌కు వచ్చిన వైసీపీ నేత‌ల‌కు అర్ధ‌మ‌య్యేలా చెబుతున్నారు. ప్ర‌భుత్వం వూరికే ఏమీ ఇవ్వ‌డంలేదు, ప‌న్నులు, ఛార్జీలు వ‌సూలు చేస్తున్నారు. అలాంట‌పుడు ఏదో ధ‌ర్మ సేవ చేస్తున్నట్టుగా గ‌మ్మం వ‌ద్ద‌కు మ‌రీ వ‌చ్చి అడగ‌డంలో అర్ధం లేదు. నిజానికి ప్ర‌జ‌లు ఈ మూడేళ్ల పాల‌న‌తో విసిగెత్తారు. ఏదో మ‌హాద్భుతం చేస్తాడ‌ని గెలిపించినా నిష్ప్ర‌యోజ‌న‌మే అయింద‌ని బాధ‌ప‌డుతున్నారు. అదే సంగ‌తి త‌మ వ‌ద్ద‌కు వ‌స్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌కు కుండ‌బ‌ద్ద‌లుకొట్టిన‌ట్టు చెబుతున్నారు.  వారిని నివారించి త‌మ ప్ర‌భుత్వం, సీఎం త‌మ కోస‌మే ప‌నిచేస్తోంద‌ని, ఇంత‌కంటే గొప్ప‌గా సేవ‌లు ఎవ‌రూ అందించ‌లేర‌న్న జ‌గ‌న్ సంకీర్త‌న చేస్తున్న‌వారిని ఎక్క‌డికక్క‌డ నిల‌దీస్తున్నారు.


పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణం, వృద్ధాప్య పింఛ‌న్లు, వితంతు పింఛ‌న్లు వంటివి చాలాకాలం నుంచే వున్నాయ‌ని, వాటిని త‌మ‌రే ఆరంభించి ఇస్తున్న‌ట్టుగా ప్ర‌చారం చేసుకోవ‌డంలో అర్ధంలేద‌ని ప్ర‌జ‌లు గ‌ట్టిగానే త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌వారికి చెబుతున్నారు. ప్ర‌జ‌లు  అమాయ‌కులు కారు, ప్ర‌చార ఆర్భాటం ఏది, వాస్త‌వంగా జ‌రుగుతున్న‌దేమిట‌నేది వారికి ఎంతో బాగా తెలుసు. అస‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు, ఫ‌లితాలు అందాల్సిందే వారికి క‌నుక అవి ఎంత‌వ‌ర‌కూ సక్ర‌మంగా జ‌ర‌గుతున్న‌దీ లేనిదీ వారికిగాక మ‌రెవ‌రికి తెలు స్తుంది?  గ‌డ‌ప గ‌డ‌ప‌కీ వెళ్లి తెలుసుకునే నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల‌ను త‌మ వేపు ఏ మేరకు ఇంకా వెన్ను ద‌న్నుగా వున్నార‌న్న‌ది తెలుసుకోవ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం అస‌లు ర‌హ‌స్యంగా తెలియ‌క‌పోలేదు. ప్ర‌జ‌లు ఎవ‌రికి ఓటు వేయాలి, ఎవ‌రిని స‌మ‌ర్ధించాల‌న్న‌దానిలో వున్నంత స్ప‌ష్టతను త‌క్కువ అంచ‌నా వేసి వైసీపీ నాయ‌కులు ఈ మ‌హాద్బుత కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టార‌నే అభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. 
గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో ఇళ్ల‌చుట్టూ ప్ర‌ద‌క్షిణం చేస్తున్నవారంద‌రికీ చేదు అనుభ‌వాలే ఎదుర‌వుతు న్నాయి. ప్ర‌జ‌లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌లేక నాయ‌కులు నీళ్లు న‌ములుతున్నారు. దీంతో అస‌లు మా వ‌ద్ద‌కు ఎందుకు వ‌చ్చిన‌ట్టు అని ఎదురుప్ర‌శ్న వేయ‌డం గ‌మ‌నార్హం. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతలు స‌మాధానం చెప్ప‌లేక భ‌య‌ప‌డిపోతున్నారు. బాలినేని శ్రీ‌నివాస రెడ్డి సైతం ఈ వ్య‌తిరేక‌త ఎదుర్కొన్నారు. అలాగే స్థానిక వైసీపీ మ‌హిళా నేత‌లు కూడా ప్ర‌జ‌ల ప‌క్షాన  త‌మ నాయ‌కుల‌ను నిల‌దీశారు. ఇటువంటి వ్య‌తిరేక‌త‌లు త‌లెత్త‌డం వెనుక టీడీపీ నేత జ‌నార్ధ‌న్ హ‌స్తం వుంద‌న్న అనుమానాలు బాలినేని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. న‌ర్సీప‌ట్నంలోనూ ఎమ్మెల్యే పి.ఉమాశంక‌ర్ గ‌ణేష్ ను ప్ర‌శ్నించ‌డాన్ని వైసీపీ నాయ‌కులు జీర్ణించుకోలేక అస‌హ‌నం వ్య‌క్తంచేశారు. అటు అర‌కులో ఎమ్మెల్యే  శెట్టి ఫాల్గుణ పై గిరిజ‌న మ‌హిళ‌లు ఎదురుతిర‌గారు. త‌మ స్థ‌లాన్ని క‌బ్జా చేశారం టూ నిల‌దీశారు. ఆయ‌న వూహించ‌ని ఈ సంఘ‌ట‌న‌కు బెదిరిపోయి కార్య‌క్ర‌మాన్ని వ‌దిలి వెళిపోయారు. పోల‌వ‌రం ఎమ్మెల్యే ఇళ్ల స్థ‌లాలు, పింఛ‌న్ల మాట ఎత్త‌గానే మ‌హిళ‌లు ఎదురుతిరిగారు. 


గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం రాష్ట్రం అంత‌టా విఫ‌ల‌మ‌యింద‌నాలి. కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టా ల‌ని చూసిన వైసీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కులు వూహించ‌ని వ్య‌తిరేక‌తే ఎదుర‌యింది.  ఈ మొత్తం కార్య‌క్ర మాన్ని, వ్య‌తిరేక‌త‌ను త‌ర‌చి చూస్తే రాష్ట్రంలో వైసీపీకి నూక‌లుచెల్లిన‌ట్టే వుంద‌ని రాజ‌కీయ విశ్లేష కులు భావిస్తున్నారు. త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌, ప‌థ‌కాల అమ‌లు గురించి అడ‌గ‌డానికి  పెట్టిన కార్యక్ర‌మంలా  కాకుండా ప్ర‌జలు త‌మ  ప్ర‌భుత్వాన్ని అభిమానిస్తున్నారో తెలుసుకోవ‌డానికి చేప‌ట్టిన‌ట్టు వుంద‌ని అంటు న్నారు. 
 

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.