ఈ డెవడండీ బాబూ! జగన్ సర్కార్ తీరుపై జనం సెటైర్లు

Publish Date:Jun 11, 2022

Advertisement

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలి.. అమ్మ పెట్టా పెట్టదు  అడుక్కు తినా నివ్వదు అన్న చందంగా.. ఉందని విమర్శలు   వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మంగళగిరిలో అన్నా క్యాంటిన్‌ను పోలీసుల సమక్షంలోనే మున్సిపల్ అధికారులు ధ్వంసం చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రతిది రాజకీయ కోణంలోనే చూడడం..   జగన్ ప్రభుత్వ   స్పెషాలిటి అని మంగళగిరి జనం  సెటైర్లు వేస్తున్నారు.

 జగన్ అధికారం కూల్చి వేతలతో ఆరంభమై.. కూల్చివేతలతోనే కొనసాగుతోందని విమర్శిస్తున్నారు.  తొలుత అమరావతి కాదని..మూడు రాజధానులు అన్నారు.... అలాగే గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయిల ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను సైతం   కూల్చివేసిందని.. అదే తరహాలో తాజాగా మంగళగిరిలో అన్న క్యాంటిన్ ధ్వంస రచన జరిగిందని అంటున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ  గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన మళ్లీ పోటీ చేయనున్నారు. విజయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఆ నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలాగే  నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా.. అక్కడ ఆయన వాలిపోతున్నారు. అలా   ఆ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై దూసుకుపోతున్నారు.  మరోవైపు 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని క్లియర్ కట్‌గా చేప్పేశారు.

ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో మరోసారి జెండా ఎగరేయాలని వైసీపీ భావిస్తోంది. దాంతో  మంగళగిరిలో బలమైన అభ్యర్థి కోసం జగన్ భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. మంగళగిరి మాజీ ఎమ్మెల్యను సైతం ఎమ్మెల్సీని చేసి.. పెద్దల సభలో సభ్యుడిగా చేశారన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇలా వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్ విజయాన్ని అడ్డుకునేందుకు ఏం చేయాలి.. ఎలా ముందుకు కదలాలి.. అనే కోణంలో..  జగన్ యోచిస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ పేరిట అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసింది. ఈ క్యాంటిన్ల ద్వారా చాలా తక్కువ ధరకు పేదవారికి కడుపు నిండా బోజనం పెట్టేవారు. అయితే   జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ   క్యాంటిన్లు మూసి వేసింది. అయితే కరోనా సమయంలో పేదలు, సామాన్యలు భోజనం కోసం తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అన్న క్యాంటిన్లు తెరిచి ఉంటే.. ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగే ఉండేదనే ఓ చర్చ అప్పట్లో గట్టిగానే నడిచింది.

ఈ నేపథ్యంలో మంగళగిరితోపాటు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురంలో అన్న క్యాంటిన్లు పున: ప్రారంభించారు. అయితే మంగళగిరిలోని అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడం   జగన్ ప్రభుత్వంపై ప్రజల్లోకి ఓ విధమైన తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందని అధికార పార్టీలోని కీలక నేతలే పేర్కొనడం గమనార్హం

.

Watch video https://www.youtube.com/watch?v=cT58KQ9rS_M

By
en-us Political News

  
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.