జనం పాలకుల మాట వినరు..వారే జనం మాట వినాలి!

Publish Date:Dec 3, 2023

Advertisement

తెలంగాణ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుంది. పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ జెండాలు మళ్లీ రెపరెపలాడుతున్నాయి. ఇన్నాళ్లు బోసిపోయిన గాంధీభవన్ కళకళలాడుతోంది. ఎప్పుడూ బాధతో రగిలిన కార్యకర్తల ముఖాలు ఆనంద దరహాసాలతో వెలిగిపోతున్నాయి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ అధికారంలో కొనసాగింది. తెలంగాణ ఇచ్చిన  పార్టీగా కాంగ్రెస్ మాత్రం కష్టాలను ఎదురీదుతూ వచ్చింది. కాంగ్రెస్ నాయకులు గత పదేళ్లుగా ఒక్క అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను వేడుకోవడం, కేసీఆర్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండడం, రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోంది. అయితే  గతంలో ఎన్నడూ కనిపించని పరిస్థితులు ఈసారి ఎన్నికల ఫలితాలలో కనిపించాయి. 

అసలు ఇప్పటి వరకూ విజయమే దక్కని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయడం, కాకలు తీరిన సీనియర్లను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన యువ నాయకులు మట్టి కల్పించడం వంటివి వెలుగు చూశాయి. చాలా రకాలుగా రికార్డులు సైతం బద్దలయ్యాయి. ఇక, గ్రేటర్ హైదరాబాద్, మెదక్, సికింద్రాబాద్ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం నిరాశ తప్పలేదు. ఇక్కడ ఒక్క స్థానం మినహా మిగతా అన్ని స్థానాలనూ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే, ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి రావడంతో విజయం సాధ్యమైంది. ఏదైతేనేం మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ జెండా పాతేసింది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేసిన ద‌రిమిలా అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా త‌న ఓట‌మిని అంగీక‌రించింది. ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ X వేదికగా కాంగ్రెస్ కు శుభాకాంక్షలు కూడా చెప్పారు.

అయితే, తెలంగాణ ప్రజలలో  కేసీఆర్ పాలనపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఎలా పెరిగింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అనేలా బీఆర్ఎస్ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన వాటిలో సీఎం కేసీఆర్ ప్రజల భావనను పట్టించుకోకపోవడం. ప్రతిపక్షాల మాట వినకపోవడం   మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ప్రశ్నించే ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకోవడం.  ఇక మేధావుల మాటలను కూడా కేసీఆర్ అస్సలు పట్టించుకోలేదు. ఉద్యమం సమయంలో కేసీఆర్ కు అండగా ఉంటూ నడిపించిన వారిని కూడా పక్కకి పెట్టేసి ఏకఛత్రాధిపత్యంగా అధికారం చెలాయించారు. ఎంతటి వారైనా సరే తన మాట వినకపోతే వారిని తెలంగాణ ద్రోహులుగా ముద్రవేసే ప్రయత్నం చేశారు.

ఇక చివరికి ప్రజల మాట కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నియమించిన విలేజ్ డెవలప్మెంట్ కమిటీల ఆగడాలు పెచ్చుమీరాయి. వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్లు పలుచోట్ల గ్రామ బహిష్కరణలు కూడా జరిగాయి. వీడీసీలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు కమిటీలకు మద్దతుగా నిలిచారు. ఇది సీఎం దృష్టికి కూడా వెళ్లగా.. కమిటీలు మీ మంచి కోసమే అంటూ సమర్ధించుకున్నారు. అలాగే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను  వెనక్కు తీసుకోవాలని పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించారు.  కాన , మొండిగా కేసీఆర్ సర్కార్ ముందుకెళ్లాలని చూసింది. ధరణి పోర్టల్ మీద కూడా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ, కేసీఆర్ ధరణిని సర్వరోగ నివారిణి జాలిమ్ లోషన్ లా సర్వ సమస్యల పరిష్కారిణి అంటూ చెప్పుకు వచ్చారు.

భూస్వాములు, వందల ఎకరాల ఆసాములకు కూడా రైతు బంధు ఇచ్చారు. దీనిపై తొలి నుండి కూడా  విమర్శలున్నాయి.   మీడియా ఎన్నోసార్లు కేసీఆర్ ను ఈ విషయంలో ప్రశ్నిస్తే..   మా ప్రభుత్వమిస్తే మీకేంటయ్యా నొప్పి అంటూ చులకన చేశారు.  ఇలా ఒక్కటీ రెండూ అని కాదు..   ప్రజల తరపున గొంతు విప్పే ఎవరికీ ఆయన మర్యాద ఇవ్వలేదు సరికదా ఎగతాళి చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా డీపీఆర్ దశలో ఎందరో చెప్పారు. దాని ఖర్చు , విద్యుత్ బిల్లుల విషయంలో తొలి నుండి నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ  కేసీఆర్ తానే ఓ పెద్ద ఇంజనీర్ అనేలా అందరి నోరు మూయించారు. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలతో పాటు దానికి ప్రతి నెలా వచ్చే కోట్ల విద్యుత్ బిల్లులు భారంగా మారాయి. దానికి తోడు డిజైనింగ్ లోపాలతో ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఒక గుదిబండగా మారింది.  ఇలా కేసీఆర్ తానో మోనార్క లా భావించుకుని ఎవరిమాటా వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు.   అయితే ప్రజలు ఏం చెబుతున్నారో, ఏం కోరుకుంటున్నారో పట్టించుకోని పాలకులను వారు మౌనంగానే అయినా తమ కున్న ఓటు హక్కుతో తిరస్కరిస్తారని మరో సారి ఈ తీర్పుతో నిరూపించారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.