రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాటకు ఇదా వేదిక.. అసోం సీఎం తీరును తప్పుపడుతున్న జనం

Publish Date:Sep 10, 2022

Advertisement

తెలంగాణలో సందర్బం ఉన్నా లేకున్నా వివాదం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశం వినా బీజేపీకి మరో లక్ష్యం, ధ్యేయం లేదన్నట్లుగా ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఉన్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. మత సామరస్యానికీ, సామాజిక సామూహికత్వానికి ప్రతీకగా జరిగే ఈ కార్యక్రమంలో అన్నివర్గాల ప్రజలూ మమేకమై రాజకీయాలకు అతీతంగా ప్రజలే స్వచ్ఛందంగా జరుపుకునే ఒక పండుగ. అటువంటి కార్యక్రమంలో కూడా రాజకీయ లబ్ధిని వెతుక్కునే కార్యక్రమానికి పార్టీలు ఉపక్రమించడం పట్ల సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది.

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా సందడి కోల్పోయిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఈ ఏడాది కన్నుల పండువగా సాగింది. భక్త జనం తండోపతండాలుగా ఈ వేడుకను తిలకించేందుకు కదలి వచ్చారు. అత్యంత శోభాయమానంగా జరిగిన ఈ వేడుకలో పాలకుండలో ఉప్పుకణిక పడిన చందంగా మొజాంజాహీ మార్కెట్ వద్ద జరిగిన సంఘటన శోభాయాత్రకు ఓ మచ్చలా పరిణమించింది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందకు వచ్చిన అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ, ఆ పనిని పక్కన పెట్టి రాజకీయ ప్రసంగం చేయడం పట్ల సర్వత్రా నిరసన, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అసోం నుంచి వచ్చిన ఆయన ఇక్కడ రాజకీయ రచ్చకు కారణం అవ్వడాన్ని అంతా ఎత్తి చూపుతున్నారు. గతంలో ఎన్నడూ శోభాయాత్ర సందర్భంగా ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని గుర్తు చేసుకుంటున్నారు.

బీజేపీ కారణంగానే రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన శోభాయాత్రలో అనవసర వివాదం తలెత్తిందని విమర్శిస్తున్నారు.  మొజాంజాహీ మార్కెట్ వద్ద గణనాథులను ఆహ్వానించేందుకు ఏర్పాటు చేసిన వేదిక పై ప్రసంగించిన అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ రాజకీయాలు మాట్లాడడమే వివాదానికి కారణమైంది. తెరాస నేత నందూలాల్ అసోంసీఎం ప్రసంగాన్ని అడ్డుకుని ఆయన చేతిలో మైకు లాక్కోవడానికి ప్రయత్నించారు.   రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమంలో హేమంత్ బిశ్వశర్మ రాజకీయ ప్రస్తావన తీసుకురావడం ఉద్రిక్తతకు కారణమైంది. ఇదే కాకుండా అంతకు ముందు కూడా ఇదే ఎంజీఎం మార్కెట్ దగ్గర ఫ్లెక్సీల విషయంలో కూడా వివాదం నెలకొంది. అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ ఫ్లెక్సీకి పోటీగా మంత్రి తలసాని ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు వచ్చిన తెరాస కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు, గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు.  ఆ తరువాత హేమంత్ బిశ్వశర్మ రాజకీయ ప్రసంగం ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడేందుకు కారణమైంది. కాగా గణేష్ నిమజ్జన శోభాయాత్రలో రాజకీయ ప్రసంగాలేమిటని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ప్రతీ రోజు రాజకీయ విమర్శలతో ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకునే తెరాస, బీజేపీలు ఒక్క రోజు తమ రాజకీయ విమర్శలకు, ప్రసంగాలకూ విరామం ప్రకటించేపాటి నియంత్రణను కూడా కోల్పోయాయా? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ గణేష్ శోభాయాత్రను కూడా రాజకీయ వేదికను చేయడానికి ప్రయత్నించడం పట్ల రాజకీయ వర్గాలలో సైతం విమర్శలు వ్యక్తమౌతున్నాయి.  హైదరాబాద్ లో వినాయక శోభయాత్రను చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానన్న అసోం సీఎం హేమంత్​ బిశ్వ శర్మ అక్కడితో ఆగకుండా.. తెలంగాణ లో కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలి కానీ.. కుటుంబ పక్షాన ఉండకూడదన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలు కేవలం ఒక్క ఫ్యామిలీ మాత్రమే అనుభవిస్తోందని , అలా కాకుండా మిగిలిన అన్ని కుటుంబాలకు మంచి జరిగేలా చూడాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నాననీ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా   తెలంగాణలో టీఆర్ఎస్ పాలన రజాకార్ల పాలనను తలపిస్తోందని, కేసీఆర్ పాలన నుండి తెలంగాణకు విముక్తి కల్పించాలని పిలుపు నిచ్చారు.  

దీంతో ఈ వేదికపై రాజకీయ విమర్శలేమిటని పేర్కొంటూ టీఆర్ఎస్ నేత నందూ బిలాల్  మైకు లాక్కునేందుకు ప్రయత్నించగా ఆయనను గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు వేదికపై నుంచి లాగేశారు.  ఏది ఏమైనా తెరాస కూడా ఒకింత నియంత్రణ పాటించి ఉంటే శోభాయాత్రకు రాజకీయ మరక అంటి ఉండేది కాదని సామాన్యులు సైతం అంటున్నారు. అదే సమయంలో అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ తీరును తప్పుపడుతున్నారు.

By
en-us Political News

  
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.