ఒక విపత్తు సంభవించినపుడు, ఒక మహా విషాదం జరిగినప్పుడు జనం స్వచ్ఛందంగా సహాయ హస్తం అందించేందుకు ముందుకు రావడం భారత్ డీఎన్ ఏలోనే ఉంది. దివిసీమ ఉప్పెన, కోనసీమ ఉప్పెన వంటి సంఘటనలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడానికి యావద్దేశం ముందుకు వచ్చింది.
అలాగే ఒడిశా రైలు ప్రమాద ఘటనలో 300 మందికి పైగా మరణించి, వెయ్యి మందికి పైగా గాయపడిన సందర్భంలో క్షతగాత్రులకు రక్త దానం చేయడానికి జనం ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఆస్పత్రులలో చేరిన క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటమే కాకుండా వారికి అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉండటంతో రక్త దానం చేయడానికి బాలాసోర్ ఆస్పత్రికి వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు.
బాధితులకు ఆదుకోవడానికి తమ వంతు సాయంగా రక్తదానం చేయడానికి వాళ్లంతా స్వచ్ఛందంగా వచ్చారు. అలాగే ఘటనా స్థలం వద్ద స్థానికులు యుద్ధ పాత్రిపదికన జరుగుతున్న సహాయ కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
బోగీలలో చిక్కుకున్న వారిని బయటకు తీయడంలోనూ, గాయపడిన వారిని అంబులెన్సులలోకి చేర్చడంలోనూ సహాయక బృందాలకు సహాయం అందిస్తున్నారు. రైలు ప్రమాదం జరిగిన శుక్రవారం రాత్రి నుంచి జనం ఎడతెరిపి లేకుండా వారి వంతు సహాయం వారు అందిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/people-come-forward-with-helping-hand-25-156296.html
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.