ప్రజలే ప్రభువులు- చందాలతో పనులు
Publish Date:Jul 9, 2025
Advertisement
ఎవరో వస్తారని,ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న ఓ కవి మాటను ఆదర్శంగా తీసుకున్న ఆ గ్రామాల ప్రజలు తమ సొంత వ్యయంతో సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ప్రజలే ప్రుభువులు.. చంద్రాలతో పనులు అంటూ గ్రామాల అభివృద్ధికి నడుంబిగిస్తున్నారు. మొన్నటికి మొన్న ములుగు జిల్లాలోనీ వెంకటాపురం మండలం ముత్తారం గ్రామస్తులు ఓ మోస్తారు వర్షానికి ఉప్పొంగి రవాణాకు ఆటంకంగా ఉన్న వాగుపై కల్వర్టు నిర్మించుకున్నారు. ముత్తారం గ్రామ గిరిజనులు చందాల రూపంలో రెండు లక్షల 50 వేలు సేకరించి ఆరు సిమెంట్ పైపులు కొనుగోలు చేసి అందరు కలిసి రెండు రోజుల్లో కల్వర్ట్ నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నేడు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు కోటగడ్డ గ్రామ ప్రజలు.. డ్రైనేజీ కాల్వ కోసం అధికారులకు వినతులు ఇచ్చి ఇచ్చి విసుగెత్తి.. ప్రతి ఇంటికీ నాలుగు వేల రూపాయల చొప్పున వసూలు చేసి దాదాపు 630 ఫీట్ల మేర డ్రైనేజీ నిర్మించుకున్నారు. కాలనీలో ఉన్న దాదాపు 20 కుటుంబాలు ఇంటికి 4000 చొప్పున జమ చేసుకొని డ్రైనేజీ పైపులైన్లు వేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా కాలనీలో సిసి రోడ్డు, డ్రైనేజీ కాలువలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రోడ్డుపై మురుగునీరు నిలిచి దోమలు, పందులకు ఆవాసంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తామే తలా కొంత డబ్బులు వేసుకొని డ్రైనేజీ నిర్మించుకొన్నారు.
డ్రైనేజీ నిర్మించండని అధికారులకు చెప్పి చెప్పి విసుగేసి కాలనీ వాసులే సొంత నిధులతో డ్రైనేజీ పనులు చేయించుకుంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిం చుకోవడానికి నడుం బిగించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కోటగడ్డ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు విన్నవించిన పనులు జరగలేదు.దీంతో ఇక అధికారుల చుట్టూ తిరిగితే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చి సొంత నిధులతో డ్రైనేజీ పనులు చేపట్టి మొత్తం 630 ఫీట్ల మేర డ్రైనేజీని నిర్మించుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/people-are-rulers-25-201553.html





