నిజంగానే పెమ్మ‌సాని..ఈవీఎం ట్యాంప‌ర్ చేయించారా?

Publish Date:Aug 10, 2025

Advertisement

 

ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్ కామెంట్లు ను బ‌ట్టీ చూస్తే... ఏపీ పైనా కొంద‌రు గురి పెట్టి.. ఇక్క‌డ ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేశారు. అందుకు ప్ర‌ధాన కార‌కుడు గుంటూరు ఎంపీ పెమ్మ‌సాని అంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. గుంటూరు ప్ర‌జ‌ల‌కు క‌నీసం తెలియ‌ని ఇత‌డికి మూడున్న‌ర ల‌క్ష‌ల పై చిలుకు మెజార్టీ ఎలా వ‌చ్చింద‌ని గ‌ట్టిగానే ట్రోల్ చేస్తున్నారు.

అస‌లు పోలింగ్ కౌంటింగ్ ప్ర‌క్రియ ఎలా జ‌రుగుతుంది? దాని పూర్వాప‌రాలు ఏంట‌ని ఒక సారి చూస్తే..   పోలింగ్ క్లర్కు, పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్, అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్.. వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్, మ్యాన్ పవర్ మ్యానేజ్‌మెంట్, ట్రైనింగ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, లైసనింగ్ ఆఫీసర్ ఫర్ అబ్జర్వర్స్, ర్యాండమైజేషన్, కౌంటింగ్ రూమ్ ఇలా పోలింగ్ క‌మ్ కౌంటింగ్ లోని వివిధ స్థాయిల‌లో ఉంటారు అధికారులు. 

ఆ ప్ర‌క్రియ‌లు కూడా అంతే స‌మానంగా పెద్ద ఎత్తున ఉంటాయి.  గ్రామపంచాయతీ సర్పంచ్-  డైరెక్ట్/ ఇండైరెక్ట్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, మండల ప్రెసిడెంట్-  డైరెక్ట్ /ఇండైరెక్ట్, జెడ్పీటీసీ, ఎంఎల్ఏ, ఎంఎల్సీ, ఎంపీ ఎన్నికల్లో పనిచేసిన వారు చెప్పేదాన్నిబ‌ట్టీ చూస్తే.. ఇది అత్యంత క్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌. విప‌రీత‌మైన క్రాస్ చెక్ చేస్తుంటారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తేడా జ‌ర‌క్కుండా జాగ్ర‌త్త వ‌హిస్తుంటారు.

ఈవీయం లు అంటే,  కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్  లు.. ఇవి అంత తేలిగ్గా హ్యాకింగ్ కు గురికావు. వాటికి సిగ్నల్ రిసీవింగ్, ట్రాన్స్మిషన్ చేసే పరికరాలు, నెట్ కనెక్టివిటీ లాంటివి ఏమీ ఉండవు. ఇవ‌న్నీ క‌ల్పిత గాథ‌లు. ఎలక్షన్ కమిషన్ నియమించిన అబ్జర్వర్స్ సమక్షంలో మూడు స్థాయిల్లో జరిగే ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ అధికారులు / ఉద్యోగులు, ఈవీయం వివిధ ప్రత్యేక నంబర్లను కలిగి ఉన్న ఈ మూడు పరికరాలు  లు అనగా ఏ కంట్రోల్ యూనిట్, ఏ బ్యాలెట్ యూనిట్, ఏ వీవీ ప్యాట్ లు ఏ ప్యాటర్న్ లో, ఏ పోలింగ్ స్టేషన్ కు వెళతారో / యో అలాట్ చేసిన వారికే తెలియదు. 

అక్కడ, ఆ పోలింగ్ స్టేషన్ లో ఎందరు ఓటర్లు ఉంటారో కూడా ఈవీయం కు సంబంధించిన డేటాలో ఉండదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఉండే సమాచారం మాత్రమే మొత్తం ఓటర్ల సంఖ్య చెబుతుంది. పోలైన ఓట్ల సంఖ్య తెలియజేస్తుంది. ఆ సంఖ్యకు అనుగుణంగా పార్టీలు / అభ్యర్థుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో కౌంటింగ్ సమయంలో తెలుస్తుంది.

పోలింగ్ పూర్తి కాగానే పోలింగ్ ఏజెంట్ల, అబ్జర్వర్ లు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు .. సమక్షంలో బ్యాటరీని ఆఫ్ చేసి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ లను సీల్ చేసి రిసెప్షన్ సెంటర్ కు పోలీసు బందోబస్తు మధ్యన తీసుకొస్తారు. అక్కడినుంచి అదేబ‌రోజు రాత్రి స్ట్రాంగ్ రూమ్ కు తరలించి పోలింగ్ స్టేషన్ సంఖ్య ఆధారంగా గళ్ళు వేసి ఉంచిన స్ట్రాంగ్ రూం లో తాళం వేసి, సీలు వేసి భద్రపరుస్తారు. ఆ స్ట్రాంగ్ రూంకు సీలువేసే సమయంలో కూడా పోటీ చేసిన అభ్యర్థులు / ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. వీడియోగ్రఫీ చేస్తారు.

ఒకే తలుపు ఉండి, అన్ని కిటికీలను మూసేసి  ప్లైవుడ్ లేదా ఇటుకలతో కట్టిన నిర్మాణం చేసి సీల్ చేస్తారు, లైట్లు ఆఫ్ చేసి- షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ రూం కు ఇరవైనాలుగు గంటలూ పోలీసు పహారా ఏర్పాటు చేస్తారు. ఆ తలుపు ఉండే ప్రాంతాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలా సీలు వేసిన స్ట్రాంగ్ రూమ్ ను తిరిగి కౌంటింగ్ రోజున మాత్రమే అందరి సమక్షంలో తెరుస్తారు. మూసివేసే సమయంలోనూ, తిరిగి తెరిచే సమయంలోనూ వీడియోగ్రఫీ చేస్తారు. బ్యాటరీ ఆఫ్ చేయకపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు. కంట్రోలు యూనిట్ వాడుకునే కరెంట్ అతి తక్కువ. 

కంట్రోలు యూనిట్ లో ఓటును అలాట్ చెయ్యగలం అంతే. బ్యాలెట్ యూనిట్ లో ఓటు వినియోగం తరువాతే మరోసారి కంట్రోలు యూనిట్ పని చేసేందుకు సిద్ధం అవుతుంది. ఎప్పుడైతే కంట్రోలు యూనిట్, బ్యాలెట్ యూనిట్ ల మధ్య ఉన్న కేబుల్స్ తొలగించగానే రెండు కూడా ఏ రకమైన చర్యలు చేయడానికి వీలులేకుండా ఉండిపోతాయి. అందువల్ల‌  ఒక్క ఓటు కూడా పోలింగ్ స్టేషన్ బయట వేసేందుకు వీలులేదు.ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఎన్ని ఓట్లు పోలైనాయో ఉంటుంది. ఏజెంట్లు అక్కడ సంతకం చేస్తారు. ఆ ఓట్ల సంఖ్య ఫైనల్. ఆ పైన అదనంగా ఓట్లు క‌నిపించవు. అది అసాధ్యం.

ఈవీయంలను మ్యానేజ్ చేసే విధానమే ఉంటే అధికారంలో ఉన్న పార్టీ పోటీదారులు వందశాతం గెలవాలి. అన్ని పోలింగ్ స్టేషన్లలో మెజారిటీ ఆ అధికార పార్టీకే రావాలి కదా... మరి అలా జరగటం లేదు కదా. ఫలితాలు తలకిందులై అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయి వేరే పార్టీలు యంయల్ఏ, యంపీ ఎలక్షన్ల ద్వారా రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి వస్తున్నాయి అంటే ఈవీయంలు చక్కగా పని చేస్తున్నాయనే క‌దా అర్ధం.

ఇక్క‌డ మ‌రో లాజిక్ కూడా చాలా మందికి పీకుతూనే ఉంది. ఒక వేళ బీజేపీ నాయ‌క‌త్వంలోని ఎన్డీయే కూట‌మి నిజంగానే ఈవీఎంల‌ను టాంప‌ర్ చేసి గెలిచి ఉంటే.. మ‌రి కేంద్రంలో బీజేపీ కూడా అఖండ మెజార్టీతో విజ‌యం సాధించాలిగానీ.. 420 సీట్లు టార్గెట్  పెట్టుకుంటే 240కి ప‌రిమితం కావ‌డ‌మేంట‌న్న‌ది మ‌రి కొందరి ప్ర‌శ్న‌.

మ‌రో మాట కూడా ఇదే విష‌యంలో రాసుకోవ‌చ్చు. గ‌తంలో ఏపీలో జ‌గ‌న్ మోహ‌న రెడ్డి సైతం 151 సీట్ల అఖండ మెజార్టీతో గెలిచిన‌పుడు బాబు ఇలాగే అన్నారు. ఇప్పుడు జ‌గ‌న్ పార్టీ ఆ వాయిస్ అందుకుంది. మ‌రి 151 సీట్లు వ‌చ్చిన‌పుడు రాని ఈవీఎం డౌట్ ఇప్పుడే రావ‌డంలో అర్ద‌మేంటి.

పెమ్మ‌సాని వంటి వారి ముక్కూ మొహం ఓట‌ర్ల‌కు తెలీదంటున్న‌పుడు జ‌గ‌న్ హ‌యాంలో గెలిచిన వారి ముక్కూ మొహం మాత్రం ఎవ‌రికి తెలుసు? పెమ్మ‌సాని అన్నా ఇంట‌ర్నేష‌న‌ల్ లెవల్లో బ‌యో టెక్ బిజినెస్ చేసిన బిజినెస్ మెన్. మ‌రి నందిగం సురేష్ వంటి వారు ఎంపీ అయిన‌పుడు ఇదే ప్ర‌శ్న వీరంద‌రికీ ఎందుకు రాలేదు? ఇలా లాజిక్కులు లాక్కుంటూ పోతే.. తెగేది లేదు తెల్ల‌వారేది లేద‌న్న‌ది ఒక విశ్లేష‌ణ‌గా తెలుస్తోంది. మ‌రి మీరేమంటారు???


 
 

By
en-us Political News

  
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.