Publish Date:Jul 23, 2025
చాలా మంది ఇతడొక అమరావతి ఉద్దారకుడని, టీడీపీ అనుంగు మిత్రుడనీ ఫీలవుతుంటారుగానీ.. అందులో ఎంత మాత్రం నిజం లేదా? ఆ మాటకొస్తే ఇతడు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డిని చెప్పుతో కొట్టిందే టీడీపీకి కొమ్ముకాస్తున్నావన్న మాటకు. కానీ ఇతడ్ని తప్పుగా అర్ధం చేసుకుని.. టికెట్ ఇచ్చి ఆదరించింది టీడీపీ. ఇప్పుడు చూస్తే ఇతడు తిరువూరులో పార్టీ, కేడర్ ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు.
కొలికిపూడి గెలిచింది ఎమ్మెల్యేగా తొలిసారి. కానీ ఇతడి కేంద్రంగా వరుస వివాదాలు. ఒక పార్టీ లైన్ కి ఎలా కట్టుబడి ఉండాలి? ఆ మాటకొస్తే ఒక ఎమ్మెల్యేగా ఎలా బిహేవ్ చేయాలి? కేడర్ ఎందుకంత కీలకం? ఇవేవీ ఇతడికి తెలిసినట్టూ లేవు. తనకవి వర్తించనే వర్తించవన్న కోణంలోనూ బిహేవ్ చేస్తుంటాడు.
తనకు నోరుంది, ఆపై సోషల్ మీడియా ఉందన్న చందంగా వైసీపీ ప్రోకామెంట్లు చేస్తుంటాడు. మొన్నటికి మొన్న ఒక రోడ్డు విషయంలో ఒక ఎస్టీ మహిళపై దాడి వ్యవహారం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేదే. ఆపై వైన్ షాపుల విషయంలో గతానికి ప్రస్తుతానికి తేడా చెప్పి.. పార్టీని ఇరుకున పెట్టడం. ఆపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో హంగామా. క్రమశిక్షణా కమిటీ ముందుకు రావడంలోనూ బిల్డప్పు. ఇలా ఇతడి గురించి చెబుతూ పోతే మెరిట్స్ కన్నా, డీ మెరిట్స్ ఎక్కువ. అప్పటికీ చంద్రబాబు ఇవ్వాల్సిన వార్నింగులన్నీ ఇచ్చారు. కానీ ఎంత మాత్రం మార్పు వచ్చినట్టే కనిపించదు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం ఎన్నో సూచనలు చేశారు. అయినా సరే అదే వితండ వాదన. ఆపై వర్ల రామయ్యతోనూ చెప్పించి చూశారు. ప్రయోజనం శూన్యం.
బేసిగ్గా తిరువూరు ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ వైసీపీకి పట్టు ఎక్కువ. దీంతో తాను టీడీపీలో ఉండటం కన్నా వైసీపీలోకి వెళ్లడం వల్లే ఎక్కువ లాభం అని అప్పుడే పెద్ద ఆరిందా లాగా లెక్కలేసుకుని.. ఇదిగో ఇవాళ పెద్దిరెడ్డిని వెళ్లి కలిశాడు. అటు టీడీపీలో అయితే ఇతడి తాకిడి తట్టుకోలేక స్థానిక టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేలా కనిపిస్తున్నాడు. అంటే అక్కడి వైసీపీ కేడర్ కూడా అష్టకష్టాలు పడ్డానికి ముందుగానే సిద్ధపడాలన్న మాట వినిపిస్తోంది. మరద్దే.. కొలికిపూడి మార్క్ కెలుకుడంటే అని మాట్లాడుకుటున్నారు ఇరు పార్టీ నేతలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/peddireddy-ramachandra-reddy-39-202591.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.