Publish Date:Jul 30, 2024
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి భార్య స్వర్ణలత అసైన్డ్ పట్టా కింద ఐదెకరాల చెరువు భూమి పొందినట్లు ప్రభుత్వ రికార్డులలో వివరాలు సమగ్రంగా వున్నాయి. స్వర్ణలత స్వగ్రామం అన్నమయ్య జిల్లా వీరబల్లి. ఈ రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 2139 కింద ఆమె పేరిట 5 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది. దీనిని భూమి వివరణ కింద చెరువుగా చూపిస్తోంది. ఈ వర్షాధార భూమిని 2023లో ఫ్రీ హోల్డ్ చేసినట్లుగా రికార్డులలో నమోదు చేశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వ భూములను అసైన్డ్ పట్టాల రూపంలో భూమి ఇస్తారు. ఇలాంటి భూమి 20 ఏళ్ల పాటు వారి అధీనంలోనే ఉన్నట్లయితే క్రయవిక్రయాలకు వీలుగా ఫ్రీ హోల్డ్ చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ ఘటన అనంతరం ఫ్రీ హోల్డ్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 20 ఏళ్ల పాటు అధీనంలో లేని భూమిని సైతం ఫ్రీ హోల్డు పెట్టేసినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. దీనిపై విచారణతోపాటు పూర్తి అధ్యయనానికి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో వీరబల్లిలో అసైన్డ్ భూమి వ్యవహారం తెరపైకి వచ్చింది. స్వర్ణలత పేరిట మదనపల్లె మండలం వలసపల్లె, బండమీద కమ్మపల్లెలో పెద్దఎత్తున పొలాలున్నాయి. మదనపల్లెతో ఎలాంటి సంబంధం లేకున్నా అక్కడ భూములు కలిగి ఉండడం, ల్యాండ్ కన్వర్షన్‌కి దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/peddireddy-land-grabbing-39-181785.html
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు