జగన్ పెద్దిరెడ్డినీ ముంచేశారా?.. స్వర్ణలత సుప్రీంకు ఎందుకు వెళ్లారు?

Publish Date:Mar 25, 2026

Advertisement

జగన్ హయాంలో ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినీ జగన్ వదల కుండా ముంచేశారు.   మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ హయాంలో  పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఓ వెలుగువెలిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

 తాను చక్రం తిప్పిన ప్రభుత్వ హయాంలోనే తన కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ సంస్థకు రావాల్సిన బకాయిల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.  ఆ బకాయిల కోసం ఆయన భార్య ఏకంగా సర్వోన్నత న్యాయస్ధానాన్నే ఆశ్రయించారు. అయితే అక్కడ ఆమెకు చుక్కెదురైంది. జగన్ హయాంలో చేపట్టిన రోడ్డు పనులకు సంబంధించిన బకాయిల చెల్లింపుల కోసం పెద్ది రెడ్డి ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నారు. భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.

చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు.  అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం  ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.  హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది.   దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత తన పిటిషన్ ను ఉప సంహరించుకున్నారు. 

నిజానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పిఎల్ఆర్ కంపెనీ చేపట్టిన పనులను నిలిపివేసింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పనులపై సమీక్షలు చేస్తోంది. అంటే పెద్దిరెడ్డి ఇప్పుడు అడుగుతున్న బకాయిలన్నీ జగన్ హయాంలో చేసిన పనులకు సంబంధించినవే. అంటే జగన్   తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పెద్దిరెడ్డికి కూడా తన హయాంలో బిల్లులు చెల్లించలేదని తేటతెల్లమౌతోంది.  

ఎన్నికల సమయంలో పార్టీ కోసం భారీగా ఖర్చు చేసిన పెద్దిరెడ్డికి   సొంత ప్రభుత్వం నుంచే నిధులు అందలేదన్నమాట. ఇక ప్రస్తుతానికి వస్తే  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో అడ్డగోలుగా కాంట్రాక్టులు దక్కించుకున్న పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. పనులకు సంబంధించి కాంట్రాక్టు నిబంధనల ప్రకారమే ఇచ్చారా? ఆ పనుల నాణ్యత సరిగా ఉందా.. అన్న విషయంలో కచ్చితంగా పరిశీలించి పరిష్కరిస్తోంది. దీంతో బిల్లుల కోసం పెద్దరెడ్డి కుటుంబం అనివార్యంగా కోర్టుకెక్కి గత వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని చెప్పకనే చెబుతున్నారు.  

అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు ఇచ్చే విషయంలో చొరవ తీసుకోని జగన్ ను నిలదీయాల్సింది పోయి.. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్ రెడ్డిని చూసి వైసీపీ వర్గాలే జాలిపడుతున్న పరిస్థితి నెలకొంది.   కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి కంపెనీ చేపట్టిన పనులపై విచారణకు ఆదేశిస్తే ఆయన కుటుంబం మరిన్ని చిక్కులను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివకాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.