జగన్ రెడ్డి పుంగనూరు పర్యటన రద్దైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శల జడివాన కురిపించడానికి ఏ అవకాశాన్ని వదులుకోకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్.. ఏడేళ్ల పసిపాప హత్య ఉదంతాన్ని కూడా కూటమి సర్కార్ పై విమర్శలు గుప్పించడానికి వాడుకోవడానికి రెడీ అయిపోయారు. ఇందు కోసం ఆయన బెంగళూరు ప్యాలెస్ వీడి పుంగనూరు పర్యటనకు రెడీ అయిపోయారు. అయితే మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి జగన్ పుంగనూరు పర్యటనను రద్దు చేసుకునేలా చేశారని వైసీపీ వర్గాలే అంటున్నాయి.
ఏడేళ్ల చిన్నారి అస్పియా గత నెల 29న అదృశ్యమైంది. ఆ తరువాత ఆమె మృతదేహం ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో లభ్యమైంది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే వైసీపీ మాత్రం తెలుగుదేశం పాలనలో శాంతి భద్రతల పరిస్థితి అద్వానంగా తయారైందంటూ గగ్గోలు పెట్టింది. అయితే ఈ సంఘటనపై వేగంగా స్పందించిన పోలీసు యంత్రాంగం ఇద్దరు అనుమా నితులను అరెస్టు చేసింది. ప్రభుత్వం కూడా బాలిక తల్లిదండ్రులకు అన్ని విధాలుగా ధైర్యం చెబుతూ అండగా ఉంటామని హామీ ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా బాలిక హత్య వెనుక ఆర్థిక కారణాలున్నాయని తేలింది. బాలిక తండ్రి వడ్డీ వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపార లావాదేవీలలో ఉన్న గొడవల కారణంగా ఆయనపై కక్ష పెంచుకున్న వారు బాలికను హత్య చేశారని వెల్లడైంది.
ఈ లోగానే మాజీ మంత్రి ఆర్కే రోజా, వైసీపీ అధికార ప్రతినిథి శ్యామలారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శల వర్షం కురిపించేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందంటూ దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు బాలిక పేరు, వివరాలు వెల్లడించారు. సున్నితమైన ఇటువంటి విషయాలలో బాధితురాలి పేరు వివరాలను గోప్యంగా ఉంచాలన్న నిబంధనను ఉల్లంఘించారు. రాజకీయ విమర్శలను పట్టించుకోకుండా పోలీసులు మాత్రం బాలిక హత్య కేసు ఛేదించే విషయంలో ముందుకు సాగారు. అయితే వీటిని వేటినీ పట్టించుకోకుండా ఒక శవం దొరికింది.. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని చెండాడేయవచ్చు అన్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పుంగనూరు పర్యటనకు సిద్ధమైపోయారు. బుధవారం (అక్టోబర్ 9) న ఆయన పుంగనూరులో పర్యటించాల్సి ఉంది.
అయితే ఈ లోగానే చిన్నారి హత్య కేసులో రాజకీయ లబ్ధి సాధ్యంకాదన్న విషయం తేలిపోయింది. పైపెచ్చు ఈ సమయంలో జగన్ పుంగనూరులో పర్యటిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం తధ్యమని భావించిన పెద్దిరెడ్డి జగన్ ను పర్యటన రద్దు చేసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చారు. ఇప్పటికే పుంగనూరులో పెద్దరెడ్డి ఆయన కుమారుడి పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. బాలిక హత్య కేసును పోలీసులు సక్సెస్ ఫుల్ గా ఛేదించడం, ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి స్పష్టమైన భరోసా లభించడంతో జగన్ పర్యటన వల్ల ప్రయోజనం ఉండదని నిర్దారించుకున్నా పెద్దిరెడ్డి జగన్ పర్యటనకు రాకుండా అడ్డుకున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/peddireddy-behind-jaghan-punganur-tour-cancel-25-186441.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.