బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు..పరిస్థితి విషమం..!

Publish Date:Jul 26, 2026

Advertisement

 

బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. హఠాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం హనుమకొండలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఉదయం వేళ హనుమకొండలోని తన నివాసంలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెల్లో తీవ్రమైన నొప్పి రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆసుపత్రికి చేరుకోగానే అత్యవసర విభాగంలో చేర్చుకున్న నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించింది. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా లేదని, పరిస్థితి విషమంగానే ఉనట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటూ ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కాంక్షిస్తున్నారు.

సుదర్శన్ రెడ్డి అస్వస్థత వార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్‌తో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి తానీరు హరీశ్ రావు తదితర ముఖ్య నేతలు వెంటనే వరంగల్‌కు పయనమయ్యారు. వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

నర్సంపేట నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ ప్రతినిధిగా సుదీర్ఘ కాలం సేవలందించిన పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో తీవ్ర చికిత్స కొనసాగుతోంది. అవసరమైతే తదుపరి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయని, త్వరలోనే ఆసుపత్రి యాజమాన్యం ఆయన ఆరోగ్య స్థితిపై అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

 పెద్ది సుదర్శన్ రెడ్డి  ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన..

నిన్న రాత్రి సంబంధిత వ్యక్తికి సీటీ స్కాన్‌తో పాటు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఇంతకుముందు సోషల్ మీడియాలో, ఇతర వేదికల్లో ప్రచారంలోకి వచ్చిన పుకార్లు పూర్తిగా అసత్యం. 

అలాంటి వదంతులను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్యులు నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అధికారిక సమాచారం ఎప్పటికప్పుడు వైద్య బృందం ద్వారా తెలియజేయబడుతుందని డా. ఎన్. సుధాకర్ రెడ్డి రెనా మెడికల్ స్పెషలిస్ట్స్ తెలిపారు.

Peddi Sudarshan Reddy Health, BRS Former MLA Sudarshan Reddy, Heart Attack Hanamkonda, Rohini Hospital Warangal, Telangana, due to heart attack,Warangal, Narsampet, BRS, KCR, KTR 

By
en-us Political News

  
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ప్రాణం పోసిన డాక్టర్ మమత.. ప్రశంసల వెల్లువ..!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి తెలంగాణ ప్రాంత భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో బంగారు బోనాన్ని సమర్పించారు.
ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల నాటి సుదీర్ఘ స్వప్నం ఎట్టకేలకు సాకారమయ్యే దిశగా అత్యంత వేగంగా అడుగులు పడుతున్నాయి.
సినీ పరిశ్రమలో తన సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారు.
కేంద్ర విద్యాశాఖలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ.. !
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి.
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా అడిగి తెలుసుకున్నారు.
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సరిహద్దుల భద్రతను కాపాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఇటీవల హైదరాబాద్‌ నగరంలో సంచలనం సృష్టించిన రిచ్ కిడ్ కేసు మరువకముందే..అలాంటి తరహాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.