తాడిపత్రి లోకి ప్రవేశించిన పెద్దారెడ్డి

Publish Date:Sep 6, 2025

Advertisement

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసు రక్షణ మధ్య శనివారం (సెప్టెంబర్ 6) తాడిపత్రికి చేరుకున్నారు. తాడిపత్రిలో తన భద్రతకు అయ్యే వ్యయం తానే భరిస్తానని  పెద్దారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చి మరీ తాడిపత్రి ఎంటీకి అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  మూడు వందల పోలీసులల భద్రతతో ఆయన తాడిపత్రిలో ఎంటర్ అయ్యారు.  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో  తాడిపత్రిలో పెద్దారెడ్డి , ఆయన అనచరులు చేసిన దాడులు, దౌర్జన్యాల కారణంగా తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఆ కారణంగానే ఎన్నికలలో పరాజయం తరువాత ఆయన తాడిపత్రిలోకి అడుగుపెట్టే అవకాశం కూడా లేకపోయింది. ఎన్నికలలో ఓటమి తరువాత ఓ సారి రహస్యంగా తాడిపత్రిలో అడుగుపెట్టినప్పటికీ, వెంటనే పోలీసులు ఆయనను బయటకు తీసుకువెళ్లారు.  ఆ తరువాత ఆయన ఎన్నిసార్లు ప్రయత్నించినా తాడిపత్రిలో మాత్రం అడుగుపెట్టలేకపోయారు. భద్రతా కారణాల దృష్ట్యా పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి హైకోర్టు కూడా అనుమతి నిరాకరించడంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు భద్రతా సమస్యలు అని చెప్పడంతో..  తన భద్రతకు అయ్యే వ్యయం అంతా తానే భరిస్తానని పెద్దారెడ్డి సుప్రీం కోర్టుకు తెలిపారు.  ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి అనుమతి ఇచ్చింది. దీంతో దాదాపు 15 నెలల తరువాత  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టగలిగారు. 

 ఈ 15 నెలలలో జరిగినదేమిటన్నది ఒక్కసారి చూస్తే.. పంతాలు పట్టింపులు ఎంత కష్టనష్టాలు కలిగిస్తాయో తాడిపత్రి ఘటన చూస్తున్నాం.ఇటీవల  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని తాడిపత్రిలోకి రాకుండా మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. ఆ ఇరు కుటుంబాల మధ్య ఉన్న వివాదం ఈ పరిస్థితికి కారణం అయింది… ఏడాది కిందట ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి పాలన ఏర్పడింది. అప్పటి నుంచి సుమారు 15 నెలలుగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుకుంటున్నారు. పోలీసులు కూడా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు. దీంతో పెద్దారెడ్డి చేసేది ఏమీలేక  హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రిలోకి  ప్రవేశించేందుకు అనుమతి పొందారు . ఆ తరువాత పెద్దారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చి తాడిపత్రిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ  స్థానికంగా తెలుగుదేశం కార్యకర్తలు జెసి అభిమానులు, ప్రజలు పెద్దారెడ్డిని తాడిపత్రిలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చే రోజునే జేసీ ప్రభాకరరెడ్డి అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్బంగా తాడిపత్రి కి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. చివరికి పోలీసులే కోర్టును ఆశ్రయించి శాంతిభద్రతల సమస్య ఉందని పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించ వద్ధని కోరారు. దీనికి కోర్టు కూడా సమ్మతి  తెలిపింది. దీంతో చేసేది ఏమీ లేక పెద్దారెడ్డి తాడిపత్రిలో ప్రవేశించకుండా  వెనుతిరిగారు. పెద్దారెడ్డి ఎలాగైనా తాడిపత్రిలోకి ప్రవేశించాలని పట్టుదలతో  సుప్రీంకోర్టును ఆశ్రయించి  అనుమతి పొందారు. కోర్టు కూడా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు అవసరమైన భద్రతను కల్పించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు శనివారం పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించారు.  ఈ సందర్బంగా  ఎటువంటి శాంతి భద్రత సమస్య ఎదురుగా కాకుండా భారీగా  పోలీసులను రంగంలోకి దింపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో పెద్దారెడ్డి సుమారు 15 నెలల తర్వాత తాడిపత్రిలోకి ప్రవేశించారు. ఎడాదిపైగా తాడిపత్రి కి దూరంగా ఉన్న పెద్దారెడ్డి ఎట్టకేలకు తన సొంత ఇంటికి చేరుకున్నారు. పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలోకి అనుమతించలేదని హెచ్చరించిన జేసి ప్రభాకర్ రెడ్డి కూడా పరిస్థితులకు  అనుగుణంగా మౌనం దాల్చారు. 

ఇంకా కొంత కాలం నియోజకవర్గానికి దూరంగా ఉంటే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమౌతుందన్న భయంతోనే పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ కోసం పట్టుపట్టారని చెప్పాల్సి ఉంటుంది.  గత 15 నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటుండటంతో తాడిపత్రిలో వైసీపీ ఇన్ చార్జిగా మరో వ్యక్తిని నియమించాలని జగన్ యోచిస్తున్నట్లు తెలియడంతో పెద్దారెడ్డి తనకు కల్పించే పోలీసు భద్రతకు అయ్యే వ్యయం భరిస్తానని చెప్పి మరీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టడానికి కోర్టు అనుమతి పొందారు. ఇంత కష్టపడి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చినా నియోజకవర్గంలో ఆయన రాజకీయం చేయగలిగే పరిస్థితి ఉంటుందా అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.