పిల్లల జీవితాన్ని బలి చేసే పీకాక్ పేరేంటింగ్.. చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇది..!

Publish Date:Sep 15, 2025

Advertisement

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు బాగా రాణించాలని కోరుకుంటారు. మంచి మార్కులు సాధించాలి, మంచి ఉద్యోగం సాధించాలి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందాలి. ఇందుకోసం బాగా డబ్బు కూడా ఖర్చు పెడతారు. పిల్లలను పెద్ద పెద్ద కార్పోరేట్ పాఠశాలలు, కళాశాలలో చేర్పిస్తారు. ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పిస్తారు, కోచింగ్ లు ఇప్పిస్తారు. ఇవన్నీ పిల్లల ఉన్నతికి మంచివే.. కానీ చాలా సార్లు తల్లిదండ్రుల మితిమీరిన అంచనాలు పిల్లలపై ఒత్తిడిగా మారుతాయి. ఇది పిల్లల మానసిక,  భావోద్వేగ పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. తరువాత ఇది ఒక సమస్యగా మారుతుంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే చాలా సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలపై ఈ విధంగా అధిక ఒత్తిడి తెస్తున్నామని కూడా వారికి తెలియదు.

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను  ఇతరుల ముందు పదే పదే.. సందర్భం కాకపోయినా  పొగుడుతూ ఉండటం చూసి ఉంటారు.  తమ పిల్లలు  గెలిచిన ట్రోఫీలు,  పతకాల గురించి చెబుతుంటారు.  పిల్లలకు వచ్చిన ర్యాంకులు, మార్కుల గురించి గొప్పగా చెబుతారు.  మొదట్లో ఇది మంచిగా అనిపిస్తుంది.  తమ తల్లిదండ్రులు తమ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో అని పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు.  కానీ క్రమంగా అది పిల్లలపై ఒత్తిడిని పెంచుతుంది.  తమ చిన్న తప్పు కూడా  తమ తల్లిదండ్రుల ఆశల మీద ప్రబావం చూపిస్తుందని అనుకుంటారు. ఈ రోజుల్లో   పీకాక్ పేరెంటింగ్ అని చాలా ట్రెండ్ లో ఉంది. ఇది పిల్లల మానసిక,  భావోద్వేగ పెరుగుదలకు హాని కలిగించే పద్ధతి. దాని గురించి తెలుసుకుంటే..

పీకాక్ పేరెంటింగ్ అంటే ఏమిటి?

పీకాక్  పేరెంటింగ్ అంటే పిల్లలను తల్లిదండ్రులు తమ  గర్వానికి,  సమాజంలో పేరు సంపాదించడానికి ఒక మార్గంగా మార్చడం. నెమలి తన రంగురంగుల ఈకలను విప్పి అందరి దృష్టిని ఆకర్షించినట్లే, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరుల ముందు తాము  గర్వంగా ఉండటం  కోసం విజయాల  వెంట పరుగులు తీయిస్తారు. మొదట్లో ఇది  బానే ఉంటుంది కానీ క్రమంగా ఈ అలవాటు పిల్లలపై ఒత్తిడి పెంచుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల విజయాల గురించి అందరి ముందు చెప్పుకోవడం గొప్పగా అనిపించవచ్చు. కానీ పోటీ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఒకరే విజేతగా ఉండరు. ఎప్పుడైనా పిల్లలకు నిరాశ కలిగించే ఫలితాలు ఎదురైనప్పుడు తల్లిదండ్రుల ప్రవర్తన మారిపోతుంది. ఇది పిల్లలను కూడా చాలా ఒత్తిడిలోకి నెట్టేస్తుంది.

పీకాక్ పేరెంటింగ్ పిల్లల ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది?

పీకాక్ పేరెంటింగ్ ప్రభావం ఏమిటంటే, పిల్లలు చప్పట్లు కొట్టినప్పుడు లేదా ప్రశంసించినప్పుడు మాత్రమే తాము మంచివాళ్ళమని, గొప్పవాళ్లమని  అనుకుంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా పిల్లలు లోపల నుండి బలహీనంగా మారతారు.  తమను ప్రశంసించనప్పుడు తాము విఫలమయ్యామని  భావిస్తారు.  దీని కారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా వ్యక్తులు ఇష్టపడేది చేస్తారు తప్ప  తమకు నచ్చినది చేయరు. పీకాక్ పేరెంటింగ్ కారణంగా ఎల్లప్పుడూ గెలవాలి  చేయాలనే భయం వారి మనస్సులో ఉంటుంది. ఎప్పుడైతే భయం మనసులో ఉంటుందో అప్పుడు గెలవడం కూడా కష్టమవుతుంది.

దీనిని నివారించడానికి పిల్లల మంచిని,  చెడును   ప్రేమించడం ముఖ్యం. అలాగే వారు గెలిచినా, ఓడినా వారిని ప్రోత్సహించడం ముఖ్యం.  తల్లిదండ్రుల గొప్పకు పిల్లలను ఒక మార్గంగా ఎంచుకోవడం మానేయాలి.  పిల్లలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు ఎప్పుడూ వారిని ప్రేమిస్తారని, వారి వెంట ఉంటారనే విషయం వారికి  అర్థమవ్వాలని. ఇలా ఉన్నప్పుడు పిల్లలు మంచి దారిలోనే వెళ్తారు.

               *రూపశ్రీ.

By
en-us Political News

  
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.