అమెరికా, ఇరాన్ చర్చలు.. అమెరికా ఉపాధ్యక్షుడికి అవమానం?

Publish Date:Jun 22, 2026

Advertisement

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న సుదీర్ఘ అశాంతికి స్వస్తి పలికి, శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం (జూన్ 21) స్విట్జర్లాండ్‌  చర్చా వేదికగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నత స్థాయి దౌత్య ప్రతినిధులు ఒకే టేబుల్ పైకి వచ్చి చర్చలు జరపడం అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి కూడా వ్యక్తమైంది.  అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ శాంతి చర్చల వేదిక ఒక్కసారిగా  రచ్చరచ్చగా మారిపోయింది. అనూహ్య  దౌత్య  వివాదాలకు, తీవ్ర ఉద్రిక్తతలకు నెలవుగా మారింది. చర్చలు ప్రారంభం కావడానికి ముందే  అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

 ఒక కీలకమైన ప్రోటోకాల్ ఉల్లంఘన కారణంగా అమెరికా ఉపాధ్యక్షుడికి తీవ్ర అవమానం జరిగింది. దౌత్యపరమైన నిబంధనల ప్రకారం లభించాల్సిన గౌరవం,  భద్రత విషయంలో లోపాలు తలెత్తాయి. దీనిపై అమెరికా ప్రతినిధి బృందం తీవ్ర అసంతృప్తి  వ్యక్తం చేసింది. ఈ  కారణంగా చర్చల ప్రాంగణంలో కొద్ది సేపు తీవ్ర గందరగోళం నెలకొంది.  ఇరాన్ ప్రతినిధులు కూడా తమ పాత వైఖరిని ప్రదర్శిస్తూ అమెరికా విధించిన ఆంక్షలపై కఠినమైన వ్యాఖ్యలు చేయడంతో వాతావరణం వేడెక్కింది.

ఈ శాంతి చర్చలపై ప్రపంచవ్యాప్తంగా   ఎన్నో ఆశలు ఉన్నాయి.  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ఇంధన ధరలు, సరఫరా వ్యవస్థలు   మెరుగుపడతాయన్న అంచనాలు ఉన్నాయి. అయితే చర్చల ఆరంభంలోనే  అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం, నమ్మకం లేవు అన్న విషయం తేటతెల్లం కావడం అందరినీ నిరాశకు గురి చేసింది.  

అది పక్కన పెడితే..  అమెరికా ఉపాధ్యక్షుడికి జరిగిన ఈ ప్రోటోకాల్ అవమానంపై వైట్ హౌస్ ఇప్పటికే అంతర్గతంగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ఇరాన్ కూడా ఈ చర్చల్లో తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చర్చల నుండి పూర్తిగా తప్పుకుంటామని హెచ్చరించింది. అయితే మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్, ఖతార్ ల పుణ్యమా అని ఈ వివాదం టీకప్పులో తుపానుగా మారి.. చర్చలు సానుకూలంగా సాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

By
en-us Political News

  
హైదరాబాద్‌ మహానగరంలో వైద్య సేవల రంగంలో తనదైన ముద్ర వేసిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
కూతురి ప్రాణాల కోసం తండ్రి మృత్యువుతో పోరాటం..
పేదలకు అండగా బసవతారకం ఆసుపత్రి సేవలు..
నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా దిల్లీ వేదికగా కీలక అడుగులు పడ్డాయి.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు
రెండేళ్ల చిన్నారి హత్య కేసు ఛేదన.. తల్లి, ప్రియుడి కుట్ర బట్టబయలు...
ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
మా ఆయనే దొరికాడా..ఆయను ఏమైనా అయితే చూస్తూ ఉరుకోము...
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం సాయంత్రం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించి
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పారుపూడి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.