Publish Date:Jul 25, 2021
ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే.. పాలకులకు అంతగా టెన్షన్. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎంత దూకుడుగా ఉంటే ముఖ్యమంత్రికి అంతగా ముచ్చెమటలు తప్పవు. అధికారంలో ఉన్నామనే ఆనందంకంటే.. ఎందుకు సీఎం సీట్లో ఉన్నామా అనే ఆందోళనే ఎక్కువగా ఉంటుంది. దినదినగండం.. ఐదేళ్ల పాలనగా సాగుతుంటుంది. తెలంగాణలో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎంట్రీతో అలాంటి పరిస్థితే ఉందంటున్నారు. తెలంగాణ మాదిరే.. కర్ణాటకలోనూ ప్రతిపక్షానికి బలమైన నాయకుడు ఉన్నారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మహా పవర్‌ఫుల్. అందుకే, అధికార బీజేపీకి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా, కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు వార్తల నేపథ్యంలో ఎన్నికలకు వెళ్దామా అంటూ డీకే సవాల్ విసరడం సంచలనంగా మారింది.
కర్ణాటక ప్రభుత్వంలో మార్పులు జరగబోతున్నాయంటూ వస్తున్న వార్తలతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. మార్పులు పార్టీ వ్యక్తులు కాకుండా ప్రజలు చేయాలని, దమ్ముంటే ఎన్నికలకు వెళ్దామని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీకి పాలన చేసే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదని మండిపడ్డారు. ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు.
‘‘ప్రజలను ఎలా కాపాడాలో భారతీయ జనతా పార్టీకి తెలియదు. వారికి పాలించే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదు. ఓ వైపు ప్రజలు చనిపోతుంటే వీళ్లకు రాజకీయాలు మాత్రమే కావాలి. యడియూరప్ప ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల ముందుకు వెళ్దాం. ప్రజలనే తీర్పు ఇస్తారు. ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ సిద్ధమేనా?’’ అని డీకే సవాల్ విసిరారు.
రాష్ట్రంలో వరదలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని డీకే ప్రశ్నించారు. కర్ణాటకకు ప్రధాని ఎందుకు రాలేదని నిలదీశారు. రాష్ట్రం నుంచి 25 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని, రాష్ట్ర పరిస్థితిని బాగు పర్చడానికి ఒక్క ఎంపీకి సామర్థ్యం లేదని డీకే విమర్శించారు.
డీకే పీసీసీ చీఫ్ అయ్యాక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కాంగ్రెస్‌దే గెలుపనే ప్రచారం జరుగుతోంది. అందుకే, ఎలక్షన్స్‌కి వెళ్దామా అంటూ డీకే సవాల్ విసిరారు. సేమ్ టూ సేమ్ తెలంగాణలోనూ అలాంటి పరిస్థితే ఉందంటున్నారు. డీకే లానే రేవంత్‌రెడ్డి సైతం డైనమిక్ లీడర్. రేవంత్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాక కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కదనోత్సాహంతో ఎన్నికలకు సిద్దమవుతోంది కాంగ్రెస్ పార్టీ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pcc-chief-challenge-to-cm-on-election-25-120315.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.