ఆలయాన్ని కూల్చివేయండి లేదా 5 కోట్లు చెల్లించండి: హైకోర్టు

Publish Date:Feb 8, 2020

Advertisement

పార్కును ఆక్రమించి ఆలయం నిర్మించడంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్న మూడు కోట్లమంది దేవతలకు ఇలా పబ్లిక్ స్థలాలను ఆక్రమించి గుడులు కట్టుకుంటూ పోతే పరిస్థితేంటి అని నిలదీసింది. గుడిని కూల్చేస్తారా లేక ఐదుకోట్లు చెల్లిస్తారా అంటూ అమీన్ పూర్ ఆలయ కమిటీని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ గ్రామం మాధవపురి హిల్స్ లోని రాక్ గార్డెన్ లో 9866 చదరపు గజాల స్థలాన్ని కబ్జా చేసి అనుమతి లేకుండా ఆలయాన్ని నిర్మించడాన్ని ప్రశ్నిస్తూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ 2018 లో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హై కోర్టులో మరోసారి విచారణ జరిగింది. గత విచారణ సందర్భంగా ఆలయంలోని దేవుడ్ని ప్రతివాదిగా చేర్చాలని ధర్మాసనం సూచించింది. ఆలయ కమిటీ తరపున వాదించిన న్యాయవాది 2010 లో ప్రభుత్వం ప్రార్థనా మందిరాలకు సంబంధించిన విధాన నిర్ణయం చేస్తూ రెండు జీవోలు జారీ చేసినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం ఆలయం పేరుతో పార్కులను కబ్జా చేసుకోడానికి ప్రభుత్వం అనుమతిస్తూ జీవోలు ఇచ్చిందా అని నిలదీసింది. 

ఈరోజు ఆలయం నిర్మించారు రేపు గురుద్వార్, మసీదు, చర్చిలు నిర్మిస్తామంటే ఖాళీ స్థలాలు ఎక్కడ ఉంటాయని ప్రశ్నించింది. దేవుడి పేరుతో పార్కు స్థలాన్ని ఆక్రమించి, ఆలయ నిర్మాణాలు చేసి చట్టాలు ఉల్లంఘిస్తుంటే అడ్డుకోవలసిన ప్రభుత్వాధికారులు మౌన ప్రేక్షకుల్లా ఉండిపోతున్నారని అసహనం వ్యక్తం చేసింది. పార్క్ ను ఆక్రమించి ఆలయం కట్టడం కూడా భూ కబ్జా కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ కేసులో ఫిబ్రవరి 26 న జరిగే విచారణకు పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్ ఎం డీ ఏ కమిషనర్, జిల్లా పంచాయతీ ఈవో, అమీన్ పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆలయ నిర్మాణానికి తీసుకున్న అనుమతులు చూపాలని కోర్టు అమీన్ పూర్ ఆలయ కమిటీని ఆదేశించింది. 2018 ఆగస్ట్ లో ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. పార్కుల కోసం కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేసింది. ఈ చట్టం ప్రకారం ఏ ఉద్దేశంతో ఆక్రమించినా నేరమే అవుతుందని పేర్కొంది. అక్రమంగా నిర్మించిన ఆలయాన్ని కూల్చివేయటం ఒక్కటే మార్గమని లేదంటే ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని ఆలయ కమిటీకి హైకోర్టు ఆదేశించింది.
 

By
en-us Political News

  
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.