పవనిజం.. వ్యూహాత్మక ‘సనాతన’ ప్రయాణం?

Publish Date:Jun 25, 2025

Advertisement

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ జ‌ర్నీ ఈ ప‌న్నెండేళ్ల‌లో ప‌న్నెండు మ‌లుపులు తిరిగిన మాట నిజం. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌త క‌ట్ట‌ని వారు లేరు. వారిలో క‌మ్యూనిస్టులున్నారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో మాయావ‌తి వంటి  ద‌ళిత నేత‌లున్నారు. ఇక చెగువేరా సంగ‌తి స‌రే స‌రి. ఫైన‌ల్ గా ఆయ‌న సేన‌- బీజేపీ, టీడీపీతో చేస్తోన్న‌ ప్ర‌యాణం గురించి తెలియంది కాదు.

కానీ ప‌వ‌న్ పై ఇప్పుడు చ‌ర్చంతా ఏంటంటే ముస్లిం టోపీ  ధ‌రించి, గొడ్డు మాంసం తిన‌డం  లో త‌ప్పు లేద‌ని.. త‌న తండ్రి దీపం మంట‌లో సిగ‌రెట్ వెలిగించుకునేంత నాస్తికుడ‌ని చెప్పుకుని, ఆపై బైబిల్ ప‌ట్టుకుని త‌న పెళ్లాం పిల్ల‌లు పూర్తి క్రిష్టియ‌న్ల‌ని చెబుతూ.. చివ‌రికి ఆయ‌నిలాంటి నిగూఢ‌మైన వారాహీ దీక్ష‌లు, వాహ‌నాల‌కు ఆ పేరుబెట్ట‌డంతో పాటు య‌జ్ఞ‌యాగాల నిర్వ‌హ‌ణ‌, కుంభ‌మేళాలో    స్నానాలు.. ఇవ‌న్నీ ఏం చెబుతున్నాయ్? ఆయ‌న హిందువా ముస్లిమా క్రిష్టియ‌నా?  లేక కొత్త పేరు ఏదైనా పెట్టాలా?  జ‌నాన్నిలా సందిగ్దంలో ప‌డేయ‌టం ప‌వ‌న్ మార్క్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ. 

ప‌వ‌న్ ప‌య‌న‌మెటు? ఈయ‌న్ని మ‌న‌మెలా అర్దం చేసుకోవాలి? అంటే  ప‌వ‌న్ పెద్ద  స్కెచ్చే వేశారని అంటారు కొంద‌రు ఆధ్యాత్మిక రాజ‌కీయ పండితోత్త‌ములు. వ‌చ్చ‌  రోజుల్లో ఆయ‌న స్టార్ క్యాంపెయిన‌ర్ గా దేశమంతా ఒక ర‌క‌మైన ఫాలోయింగ్ తీసుకురావాలంటే అందుకు త‌గిన మార్గం కోసం వెతుకుతుండ‌గా వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన చందంగా మారిందట ఈ స‌నాత‌నం.

దీని ప‌వ‌ర్ కేవ‌లం ఒక‌టీ రెండు రాష్ట్రాల‌కు సంబంధించింది కాదు. ఇది దేశ వ్యాప్తంగా క‌నిపించే కామ‌న్ పాయింట్. గ‌తంలో ర‌జ‌నీకాంత్ ని వాడాల‌నుకున్నారు మోడీ. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు అదే ప‌నిగా పంచ‌క‌ట్టుకుని వెళ్ల‌డం చూసే ఉంటాం. ఆయ‌న కూడా అందుకు త‌గిన విధంగానే రియాక్ట్ అయ్యారు కూడా. తాను చేస్తే గీస్తే ఆధ్యాత్మిక రాజ‌కీయాల‌నే చేస్తాన‌న్నారు. కాకుంటే ఈ సూప‌ర్ స్టారుడికి కాలం ధ‌ర్మం పెద్ద‌గా క‌ల‌సి రాలేదు. దీంతో ర‌జ‌నీ ఛాన్స్ మిస్ చేసుకుంది క‌మ‌లం దండు.

స‌రిగ్గా ఈ టైంలో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీకి ఇక ఆశాకిరణంగా కనిపించారు. అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని మోడీ  ఎప్పుడైనా  ఎక్క‌డైనా మొద‌టి ప్ర‌యారిటీ కింద గుర్తిస్తారు.   అంతెందుకు ప్ర‌మాణ  స్వీకార స‌మ‌యంలో   మోడీ ప‌వ‌న్, చిరంజీవిల చేతులు పైకి లేపి.. ఇచ్చిన సంకేతం ఏమిటి?

అందుకే ప‌వ‌న్ ఈ  దిశ‌గా త‌న అడుగులు వేస్తూ బీజేపీ  పాలిట ఒక స్టార్ క్యాంపెయిన‌ర్ గా త‌న ప‌రిధిని పెంచుకుంటూ పోతున్నారు. అందుకే త‌మిళ‌నాడు బీజేపీ  సైతం మురుగ‌న్ పేరిట ఒక ఆధ్యాత్మిక స‌భ‌ను ఏర్పాటు చేసింది. కార‌ణం ఇక్క‌డ మురుగ‌న్ అన్న‌దొక ప్ర‌త్యేక మ‌తం. ఈ దేవుడి పేరు చెబితేనే మొత్తం ఊగిపోతారు. త‌ద్వారా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి పెద్ద పీట వేసి.. ఇక్క‌డి తెలుగు ఓట‌ర్ల‌ను విశేషంగా ఆక‌ర్షించి.. ఆపై.. త‌మిళ‌నాట త‌న ఓటు బ్యాంకును మ‌రింత మెరుగు ప‌రుచుకోవాల‌ని క‌మ‌ల‌ద‌ళం చూస్తున్న‌దని పరిశీలకుల విశ్లేషణ.

అది మోడీ ఆదేశాను సార‌మో మ‌రొక‌టో తెలీదు కానీ..  ఈ దిశ‌గా ప‌వ‌న్ కి కూట‌మి ప్ర‌భుత్వంలోనూ భారీ ఎత్తున ప్ర‌యారిటీ ద‌క్కుతోంది. మొన్న క‌ర్ణాట‌క‌ ఏనుగుల వ్య‌వ‌హారంలోనూ ఆయ‌న ద‌గ్గ‌రుండి వాటిని తీసుకోవ‌డం.. ఇలా ప‌వ‌న్ ని రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచేందుకు   బీజేపీ ఒక ప‌థ‌కం ప్ర‌కారం వెళ్తున్న‌ట్టుగా స‌మాచారం. 

మ‌న‌మంతా ఏమ‌నుకుంటున్నాం,, ఇదేంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలా చేస్తున్నారు? ఆయ‌న‌కు ముస్లిం- క్రిష్టియ‌న్- మైనార్టీ ఓట్లు వ‌ద్దా? అని తీసిక‌ట్టిన‌ట్టు మాట్లాడుకుంటాంగానీ.. ఈ మొత్తం జ‌ర్నీలో ఆయ‌న్ని స‌నాత‌న ధ‌ర్మ వార‌ధిగా భారీ  క‌మ‌ల వ్యూహ‌మే ర‌చిస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ఇదంతా అంటున్నారు. 

ఆయ‌న కూడా వెళ్లిన ప్ర‌తి ప్రాంతాన్నీ.. ఇక్క‌డే  నేను పుట్టా. ఇక్క‌డే  నేను పెరిగా ఇక్క‌డే నా సినిమాలు ఎక్కువ ఆడేవి అంటూ ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తూ అక్క‌డి వారిని ఆక‌ట్టుకునే య‌త్నం చేస్తుంటారు. ఇదంతా ఒక విస్తృత రాజ‌కీయాల్లో భాగంగానే చూడాలంటారు కొంద‌రు ఎన‌లిస్టులు. 

ఎందుకంటే తాను కేవ‌లం ఒక కాపు నేత‌గా మాత్ర‌మే కాకుండా.. స‌ర్వ‌జ‌న..  స‌ర్వ‌కుల నేత‌గా ఎద‌గ‌డం ఒక అనివార్యంగా కావ‌డంతో.. ఇదిగో ఇదీ పరిస్థితి. ప‌వ‌న్ అలవోకగా చెప్పే  డైలాగ్ లోనూ ఒక వ్యూహం ఉంటుంద‌ని అంటారు   రాజ‌కీయ విశ్లేష‌కులు. అందులో భాగంగానే ఇదంతా జ‌రుగుతున్న‌ట్టుగా ఒక టాక్ న‌డుస్తోంది దక్షిణాది రాజకీయవర్గాల్లో. అందుకే ఇత‌ర రాష్ట్రాల వేదిక‌ల‌పై ప‌వ‌న్ కి ఇంత ఎలివేష‌న్ అంటున్నారు విశ్లేష‌కులు.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.