పొత్తు ధర్మానికి పవన్ తూట్లు?

Publish Date:Sep 27, 2024

Advertisement

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు పట్ల ఒంగోలు తెలుగుదేశం శ్రేణులు రగిలిపోతున్నాయి. జగన్ హయాంలో ఐదేళ్ల పాటు బాలినేని అరాచకాలు, దౌర్జన్యాలను ఎదుర్కొని, ఎదురొడ్డి నిలిచిన తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు అదే బాలినేనిని కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన గూటికి చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవానికి తెలుగుదేశంతో పాటు జనసేన శ్రేణులూ నేతలూ కూడా బాలినేని దాష్టీకాన్ని చవి చూసిన వారు. అయినా  తెలుగుదేశంతో కనీస మాత్ర చర్చ లేకుండా ఏకపక్షంగా బాలినేనికి జనసేన తీర్థం ఇచ్చేయడాన్ని తెలుగుదేశం తప్పుపడుతోంది. జనసేన గూటికి చేరడానికి ముందు బాలినేని తెలుగుదేశం తలుపు తట్టారు. అయితే పార్టీ కేడర్ మనోభావాలను గుర్తించి ందుకు అనుగుణంగా చంద్రబాబు బాలినేని ఎంట్రీకి నో చెప్పారు. 
అయితే బాలినేని ఎంట్రీకి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఆయనకేమీ రెడ్ కార్పెట్ పరచలేదు. జనసేన గూటికి చేరితే బాలినేని స్థానం ఏమిటి?  స్థాయి ఏమిటి అన్నది చేరికకు ముందే చెప్పారు. బాలినేని కోరినట్లు పవన్ కల్యాణ్ ఒంగోలు వెళ్లి భారీ బహిరంగ సభవేదికగా పార్టీ కండువా కప్పలేదు. పోనీ మంగళగిరి భారీ ర్యాలీగా వచ్చి చేరుతానని బాలినేని కోరినా నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఒంటరిగా, ఎలాంటి హంగూ, ఆర్భాటం, హడావుడీ లేకుండా సింపుల్ గా వచ్చి జనసేన కండువా కప్పించుకుని సైలెంట్ అయిపోవాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇ

ది కచ్చితంగా బాలినేనికి మింగుడుపడని అంశమే. ఎందుకంటే.. ఆయన జనసేనలో చేరిక ఖరారు అయిన  క్షణం నుంచీ ప్లెక్సీల విషయంలో  ఆయన వ్యవహరించిన తీరు తెలుగుదేశం  శ్రేణులను రెచ్చగొట్టేదిగానే ఉంది. అదే ఫ్లెక్సీల చించివేతకు కారణమైంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ బాలినేనికి తన స్థానమేంటో చూపారు. అంత వరకూ బానే ఉన్నప్పటికీ, ఒంగోలు నియోజకవర్గంలో తెలుగేదేశం శ్రేణులు అసంతృప్తికి గురి కాకుండా వారిని ఒప్పించి బాలినేనిని చేర్చుకునే ప్రయత్నం చేసి ఉండాల్సిందని పరిశీలకులు అంటున్నారు.

బాలినేని జగన్ తో విభేదించి బయటకు వచ్చినట్లు బయటకు చెబుతున్నా.. పబ్బం గడుపుకుని వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ జగన్ పంచనే చేరుతారని బాలినేని అనుచరులే చెబుతున్నారు. జగన్ బాలినేనికి సమీప బంధువు కావడం, గతంలో ఎన్నిసార్లు జగన్ తో విభేదాలు తలెత్తినా, పార్టీలో కనీస గౌరవం దక్కకపోయినా బాలినేని వైసీపీని వీడే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కూడా ఆయన జగన్ కోవర్ట్ గానే తెలుగుదేశం, జేనసేన శ్రేణుల మధ్య విభేదాలు సృష్టించే వ్యూహంలో భాగంగానే  పార్టీ మారారని జనసేన శ్రేణులే చెబుతున్నాయి. 

అంతే కాకుండా  వరుసగా జనసేన మాజీ ఎమ్మెల్యేలను పవన్ కల్యాణ్ పిలిచి మరీ జనసేన కండువా కప్పడాన్ని కూటమి పార్టీల శ్రేణులు సైతం తప్పుపడుతున్నాయి. చేరికల విషయంలో కూటమిలోని మూడు పార్టీల అధినేతలూ కూర్చుని మాట్లాడుకుని ఒక ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 

By
en-us Political News

  
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.