కదిలింది కదిలింది వారాహి!

Publish Date:Jun 14, 2023

Advertisement

వారాహి కదిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి  జిల్లా అన్నవరం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైంది.  ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ తమ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడమే  కాకుండా, ఎన్నికల ప్రచార యాత్రగా కూడా పవన్ వారాహి ద్వారా బహుముఖ దండయాత్రకు ప్లాన్ చేశారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలలో సాగే ఈ యాత్రలో భాగంగా కత్తిపూడి,  ఉప్పాడ బస్టాండ్‌ సెంటర్‌, సర్పవరం మీదుగా సాగుతుంది. పైన చెప్పిన మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో జనసేనాని మాట్లాడతారు. పర్యటన సాగిన ప్రాంతాల్లో ఉదయం పూట సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. ప్రతి రోజు ఉదయం జనవాణి కార్యక్రమం ఉంటుంది.  స్థానికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్యపై నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తారు.  పిఠాపురం, కాకినాడ, నర్సాపురంలో  క్షేత్రస్థాయి సందర్శనలు ఉంటాయి.  

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ యాత్రను గ్రాండ్ సక్సెస్ చేయాలని జనసేన శ్రేణులు కృత నిశ్చయంతో ఉన్నారు.  కాగా విడదల వారీగా  సాగే జనసేనాని వారాహియాత్ర తొలి విడత ఈ నెల24 వరకు యాత్ర సాగనుంది. బుధవారం (జూన్ 13) కత్తిపూడిలో బహిరంగ సభలో పవన్ మాట్లాడతారు. 16న పిఠాపురం, 18న కాకినాడ, 20 ముమ్మిడివరం, 21న అమలాపురం, 22న రాజోలులో  బహిరంగ సభల్లో పవన్ ప్రసంగిస్తారు.

యాత్రలో రోజూ మేధావులు, విద్యావేత్తలు, ఎన్జీవోలు, కార్మికులు, రైతులు, చేతి వృత్తుల వారితో పవన్ మాట్లడబోతున్నారు.  తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్త దాదాపుగా ఖరారైందని భావిస్తున్న నేపథ్యంలో ఈ యాత్ర విజయవంతానికి క్షేత్ర స్థాయిలో జనసేన, తెలుగుదేశం శ్రేణులు  కలిసి పని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.