పిఠాపురంలో వంగా గీతకు మూసుకుపోయిన గెలుపు దారులు!?

Publish Date:May 2, 2024

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా  కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పిఠాపురంలో వంగా గీతకు గెలుపు దారులు మూసుకుపోయాయంటున్నారు. ఒక వైపు పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మిథున్ రెడ్డి వంటి వారికి బాధ్యతలు అప్పగించినా.. నియోజకవర్గంలో పరిస్థితి రోజురోజుకూ వైసీపీకి ప్రతికేలంగా, జనసేనకు అనుకూలంగా మారుతున్నదని పరిశీలకులు అంటున్నారు.

కూటమి అభ్యర్థిగా జనసేనానికి తెలుగుదేశం అండ కొండంత బలంగా మారిందంటున్నారు. కాపుసామాజిక వర్గ ఓట్లలో చీలిక కోసం కాపు ఉద్యమ నేతగా తనను తాను అభివర్ణించుకుంటున్న ముద్రగడ పద్మనాభంకు వైసీపీ కండువా కప్పి ప్రచారంలోకి దింపినా పెద్దగా ఫలితం కనిపించకపోవడం అటుంచి.. పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ చేసిన సవాల్ బూమరాంగ్ అయ్యిందంటున్నారు. 

ఇక అన్నిటికీ మించి వైసీపీని, ఆ పార్టీ అభ్యర్థి వంగాగీతనూ ఆందోళనకు గురిచేస్తున్న అంశం పిఠాపురంలో పవన్ కు మద్దతుగా సినీనటుల ప్రచారం. ఇప్పటికే హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లు పిఠాపురంలో మకాం వేసి పవన్ కల్యాణ్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  వీరంతా బుల్లితెర ద్వారా ప్రజలలో మంచి గుర్తింపు పొందిన వారే కావడం గమనార్హం. వీరి ప్రచారానికి మంచి స్పందన కూడా లభిస్తోంది. ఇక ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ తన బాబాయ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే తన మేనమామకు మద్దతుగా మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేశారు. రానున్న రోజులలో  రామ్ చరణ్, చిరంజీవి కూడా పవన్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద జనసేన ప్రచారం ముందు వైసీపీ ప్రచారం వెలతెలపోతున్నదంటున్నారు.  

ఓటమి భయంతోనే  పవన్ కల్యాణ్  హైదరాబాద్ లో ఉండే  నటులలో సగం మందిని పిఠాపురంలో దింపారన్న వంగా గీత విమర్శలు ప్రజలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆ విమర్శలు ఆమెలోని ఓటమి భయాన్నే ఎత్తి చూపుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల మూడ్ ను బట్టి చూస్తే పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని తేలిపోయిందంటున్నారు.  వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల జనంలో ఆగ్రహం వ్యక్తం అవుతోందంటున్నారు. 

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-19
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్నటి ఎన్నికల ముందు కూడా రాజశ్యామల యాగం చేశాడు.. ఏమైంది? చెత్తగా పరిపాలించడం వల్ల దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అవబోతోంది.
చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా షిర్డీ సాయిబాబాను సందర్శించుకున్నారు.
సీబీఐ, ఈడీ చాలా పవిత్రమైన, అమోఘమైన తేదీ అయిన జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ, జగన్‌కి తమ సత్తా చూపించడానికి అవసరమనవన్నీ ‘సిద్ధం’ చేసుకుంటున్నాయి.
ఈ-ఆఫీస్‌ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాలు సమాధి అయ్యే ప్రమాదం వుంది.
తెలంగాణలో చాలావరకు వేడి తగ్గింది. వాతావరణం చల్లబడింది. ఈనెల మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల 47 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. వాతావరణం చల్లబడటంతో 40 డిగ్రీలకు పడిపోయింది. ఉపరితల ఆవర్తనమే కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అవర్తనం ఏర్పడమే దీనికి కారణం. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు కురవనున్నాయి.
చంద్రగిరి నుంచి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విశాఖపట్నంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశాడు. అక్రమ మైనింగ్‌తో  అందినంత దండుకున్నాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ సరళిని బట్టి తెలుగుదేశం భారీ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా స్వయంగా నిర్వమించుకున్న పోస్ట్ పోల్ సర్వే ఫలితం కూడా భారీ విజయాన్ని ఖరారు చేసిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఎపిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ మామూలుగా లేదు. ఈ సారి పిఠాపురం లోకసభ స్థానం నుంచి పోటీ  చేస్తున్న పవన్ కళ్యాణ్ టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. ఆయన సెక్యురిటీ గార్డ్ ఇంటిపై దాడి జరగడం చర్చనీయాంశమైంది. 
సాధారణంగా ఓట్ల పండుగ పట్ల అర్బన్ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపరు. ఇన్నేళ్లుగా మనం చూస్తున్న ట్రెండ్ అదే. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి అర్బన్ ఓటింగ్ భారీగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 81.80 శాతం పోలింగ్ నమోదైంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇది రెండు శాతం అధికం.
తెనాలి ప్రస్తుత ఎమ్మెల్యే, ఘోర పరాజయం పాలవబోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కేవలం ఫైట్ మాస్టరే అని ఇప్పటి వరకూ అనుకుంటూ వచ్చాం కదా.. ఆయన కేవలం ఫైట్ మాస్టర్ మాత్రమే కాదు.. కథ, స్క్రీన్ ప్లే, మాటల రచయితగా కూడా మంచి టాలెండెడ్ అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. 
ఎపి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోజరిగిన శాంతిభద్రతల సమస్యలు ఇప్పట్లో సమసే అవకాశం  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వైసీపీ, టీడీపీ నేతలు కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.