పవన్ బస్సు యాత్ర వాయిదా.. సినిమాల కోసమేనా అని జనసేన శ్రేణుల అనుమానం

Publish Date:Sep 19, 2022

Advertisement

మామూలుగా రాజకీయ నాయకులు ప్రజలకు మతిమరుపు ఎక్కువ అనుకుంటారు.. అందుకే గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి కొత్త కొత్త హామీలతో ప్రజలను ఇట్టే మభ్యపెట్టేయచ్చనుకుంటారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్వయంగా మతి మరుపు ఎక్కువ.. ప్రతి రోజూ పుస్తకాలు చదువుతాను.. పుస్తకాలు ఉంటే నాకింకేం అక్కర్లేదు అనే ఆయన ఏ రోజు చదివింది ఆ రోజే మరచిపోతారేమో అని పించేలా ఉంటుంది ఆయన వ్యవహారం. ఆయనకు తానో రాజకీయ పార్టీ అధినేతను అన్న సంగతి కేవలం వీకెండ్ లోనే గుర్తుకు వస్తుందా అన్న అనుమానం జన బాహుల్యంలో కలిగే విధంగా ఆయన కేవలం ఆదివారాలు (వీకెండ్)లో మాత్రమే మాట్లాడతారు.

అదీ గత వారం ఏ మాట్లాడారో మరచిపోయి అందుకు పూర్తిగా భిన్నంగా తదుపరి వారం మాట్లాడతారు. సరిగ్గా ఈ విషయం మీదే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని జనసేనానిని విమర్శలతో ఓ ఆట ఆడుకున్నారు.  తన అన్న చిరంజీవి పెట్టిన పార్టీ ప్రజారాజ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్.. ఆ తరువాత చాలా కాలం పాటు కేవలం సినిమాలే జీవితం అన్నట్లుగా బతికేసి ఆ తరువాత తీరిగ్గా జనసేనను స్థాపించారు. 2019 ఎన్నికలలో అధికారమే లక్ష్యం అంటూ ఒంటరిగా బరిలోకి దిగి కేవలం ఒక్కటంటే ఒక్క స్థానానికి  పరిమితమయ్యారు. స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం పాలయ్యారు. సరే ఆ తరువాత ఏం జ్ణానోదయం అయ్యిందో ఏమో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్నారు.

మొన్నీ మధ్య తన అన్న చిరంజీవి పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ఉండి ఉంటే ఇప్పటి పరిస్థితుల్లో బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించి ఉండేదని అన్నారు. తన అన్న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఇప్పుడు వైసీపీలో కీలక స్థానాలలో ఉన్న వారే కారణమనీ, వారి తప్పుడు సలహాలతోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారనీ సూత్రీకరించారు. ఆ విషయం మరచిపోయారో ఏమో తాజాగా తన అన్న చిరంజీవి రాజకీయంగా తప్పులు చేశారనీ, కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసి ద్రోహిగా మారారనీ అర్ధం వచ్చేలా మాట్లాడారు. ఈ విషయాన్ని పేర్ని నాని  2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున  తనతోపాటు 18 స్థానాలు గెలిపించుకుకున్న చిరంజీవి..  ఆ తరువాత వాస్తవం అర్ధం చేసుకుని రాజకీయాల నుంచి బయటకు వచ్చేశారనీ, అయితే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ లా రోజుకో పార్టీ, పూటకో సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనీ విమర్శలు గుప్పించారు.

ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి  వరదలు వస్తే బాధితులకు అండగా నిలబడ్డారు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. అయితే ఆ పార్టీ యువ నేతగా పవన్ కల్యాణ్ ఒకటి రెండు సభలలో ప్రసంగాలకే పరిమితమయ్యారని పేర్ని నాని గుర్తు చేశారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీకి కనీసం రాజీనామా కూడా చేయకుండా సినిమాలంటూ రాజకీయ తెర మీద నుంచి అదృశ్యమయ్యారని పవన్ పై విమర్శలు గుప్పించారు. ఆ విషయాలన్నీ విశ్మరించి ఇప్పుడు వైసీపీ ఇన్ని సీట్లకే పరిమితమౌతుందంటూ చిలక జోస్యం చెప్పడమేమిటని విరుచుకుపడ్డారు. అసలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనసేన ఎన్ని స్థానాలలో అభ్యర్థులను నిలబెడుతుందో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.

పేర్ని నాని విమర్శించారని కాదు కానీ, అసలు పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడిగా స్థిరత్వం ప్రదర్శిస్తున్నారా అన్ని జనసేన శ్రేణుల్లోనే సందేహం వ్యక్తమౌతోంది. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని అందరి కంటే ముందు పోత్తు ఊసెత్తిన పవన్ కల్యాణ్ ఇప్పుడా మాట విస్మరించి ఓటు చీల్చే రాజకీయం చేస్తున్నారా అన్న అనుమానాలు ఆ పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి. దసరాకు బస్సు యాత్ర అని ఘనంగా ప్రకటించి ఇప్పుడు వాయిదా వేయడానికి కారణాలే ఎందుకు చెప్పడం లేదని అంతర్గత చర్చల్లో మధన పడుతున్నారు.

ఆయనకు రాజకీయాలు పార్ట్ టైమ్ లా ఉన్నాయనీ, ఫుల్ టైమ్ ప్రొఫెషన్ సినీమాలేనని అంటున్నారు. ఇప్పుుడ బస్సు యాత్ర వాయిదాకు కూడా సినిమా షూటింగులే కారణమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. 

By
en-us Political News

  
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.