బీజేపీ, జనసేన కటీఫేనా..? మోడీ సభకు పవన్ దూరం అందుకేనా?

Publish Date:Jul 4, 2022

Advertisement

బీజేపీ. జనసేనల మధ్య దూరం పెరిగిందా? ప్రధాని మోడీ భీమవరం పర్యటనకు, ఆయన పాల్గొనే భారీ బహిరంగ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ కు అందుకే ఆహ్వానం అందలేదా? అన్న ప్రశ్నలకు రాజకీయ పండితులు ఔననే సమాధానం ఇస్తున్నారు.

ఇప్పటి కిప్పుడు ఆ రెండు పార్టీలూ కూడా తమ మధ్య మైత్రి చెడిందని బహిరంగంగా ప్రకటించకపోయినా.. జనసేన, బీజేపీల మధ్య సంబంధాలు బెడిసాయనడంలో ఎటువంటి సందేహం లేదని వారు నొక్కి వక్కాణిస్తున్నారు. ప్రధాని మోడీ ఏపీలో పర్యటిస్తున్నా..జనసేనాని పవన్ కల్యాణ్ ఆ ఛాయలకు కూడా వెళ్లకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా వారు చూపుతున్నారు. తాను భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లలేకపోవడానికి బిజీ షెడ్యూల్ కారణమని పవన్ కల్యాణ్ చెబుతున్నా.. ఇరు పార్టీల మధ్యా సఖ్యత ఉండి ఉంటే షెడ్యూల్ మార్చుకునైనా పవన్ కల్యాణ్ హాజరై ఉండేవారని వారు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అల్లూరి విగ్రహావిష్కరణకు పవన్ హాజరౌతారనీ, మోడీతో వేదిక పంచుకుంటారనీ మొదటి నుంచీ జనసేన వర్గాలు చెబుతూ వస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బీజేపీ, జనసేనల మధ్య జరిగిన మాటల యుద్ధంతో ఇరు పార్టీల మధ్యా సఖ్యత చెడింది.

ఆ తరువాతే పవన్ కల్యాణ్ వరుస కార్యక్రమాలతో బిజీ అయ్యారు. పొత్తుల సంగతి ఎత్తకుండా తన పని తాను సుకుపోతున్నారు. మళ్లీ గతంలోలా ఓట్ల కోసం పుట్టిన పార్టీ జనసేన కాదనే పల్లవి అందుకున్నారు. ఇక మోడీతో వేదిక పంచుకోలేకపోవడానికి కారణాలు చెబుతన్నా.. ఆజాదీ కా అమృతోత్సవల్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ గొప్ప కార్యక్రమం అంటూ వీడియో విడుదల చేసినా.. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం కచ్చితంగా బీజేపీ జనసేనల మధ్య చెడిన సంబంధాలనే ఎత్తి చూపుతున్నాయని సామాన్య ప్రజలు సైతం భావిస్తున్నారు. అయితే రాజకీయంగా అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే.. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికీ, ఆ తరువాత జరిగే మోడీ బహిరంగ సభకూ తెలుగుదేశం పార్టీ తరఫున  ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయడు, మంతెన శివరామరాజు మాజరు కానున్నారు.  

ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారిక షెడ్యూల్ లో వీరిరువురి పేర్లూ ఉన్నాయి. అయితే జనసేన నేతల ప్రస్తావనే లేదు.  మరో వైపు ఇటీవల సినిమా టికెట్ల వ్యవహారంలో జగన్ తో భేటీ అయిన మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హాజరౌతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని ఆహ్వానించి... రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఇంకా చెప్పాలంటే.. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ కు ఆహ్మానం పంపకపోవడాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎత్తి చూపుతున్నారు.  

ఇక కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నా.. అంతా రాష్ట్ర ప్రభుత్వ ఇష్టారాజ్యంగానే ఆహ్వినితుల జాబితాను రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రొటోకాల్ ప్రకారం తన సొంత నియోజకవర్గానికి వస్తున్న మోడీకి ఆహ్వానం పలకాల్సి ఉంటుంది. కానీ ప్రధాని పర్యటనకు హాజరయ్యే వారి జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు. ఆయన పేరు జాబితాలో లేకపోవడానికి ఆయన రాక రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం జగన్ కు ఇష్టం లేకపోవడమే కారణమన్నది జగద్వితితమే. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబితే అది మాత్రమే చేసిందనడానికి ప్రొటోకాల్ ను సైతం పక్కన పెట్టేయడమే నిదర్శనమని విమర్శలు వినవస్తున్నాయి.

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.