రాయలసీమ నుండి పవన్ కళ్యాణ్ పోటీ.. నియోజకవర్గం ఏదో తెలుసా?

Publish Date:Oct 26, 2023

Advertisement

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలలో ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు? అటు జనసైనికులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఎంతో ఆసక్తి రేకెత్తించే ప్రశ్న ఇదే. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలోని గాజువాకతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలలోని భీమవరం నుంచి పోటీ చేశారు. అయితే రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.   ప్రత్యర్ధులు ప్రతిసారి ఇదే విషయంపై ఎద్దేవా చేస్తుంటారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని పవన్ పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈసారి ఎక్కడ నుండి పోటీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ మరోసారి భీమవరం, గాజువాకలలో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఉత్తరాంధ్రలోని విశాఖ ఉత్తర లేదా   ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా  కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి కూడా పవన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, అటు కోస్తా ఆంధ్రా, ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ నుండి కూడా పోటీ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు.  రాయలసీమలోని తిరుపతి, అనంతపురంలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.   అయితే, ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నుండి బరిలో దిగనున్న నేపథ్యంలో తిరుపతి పవన్ కళ్యాణ్ కోసం కేటాయించడం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా.. పవన్ కళ్యాణ్ ఒకే అంటే అనంతపురం నుండి పోటీ చేసేందుకు తెలుగుదేశం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. పవన్ పోటీ చేస్తానంటే తాను తప్పుకుంటానని ఇప్పటికే ఇక్కడ  తెలుగుదేశం  నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న ప్రభాకర్ చౌదరి ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలు ఉండగా ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ కోసం అనంతపురం పేరు వినిపించడం వెనక బలమైన కారణం లేకపోలేదు. ఇక్కడ ఉన్న సామజిక వర్గాల బలాబలాల నేపథ్యంలోనే పవన్ ఇక్కడ పోటీ చేస్తే గెలుపు ఖాయమవడంతో పాటు రాయలసీమలో బలం పెరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది.

అనంతపురం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ కమ్మ, బలిజ సామాజిక వర్గ ప్రజలు అధికంగా ఉంటారు. దాదాపుగా ఇక్కడ 70 వేల ఓటర్ల వరకూ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే ఉంటారని అంచనా. ప్రస్తుతం వీరంతా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతు దారులుగా ఉన్నారు. అయితే, గతంలో ప్రజారాజ్యం వైపు  ఈ సామాజివర్గాల ప్రజలు కొంతమేర ఆ పార్టీ వైపు వెళ్లారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తర్వాత మళ్ళీ వీరంతా తెలుగుదేశం వైపు పోలరైజ్ అయ్యారు. గత ఎన్నికల్లో కొంతమేర జనసేనకు సైతం మద్దతు తెలిపారు. అయితే, ఇప్పుడు పొత్తులో భాగంగా పవన్ అనంతపురం నుంచి బరిలో దిగితే విజయం సునాయాసం అవుతుందని భావిస్తున్నారు. పవన్ ఇక్కడ నిలబడితే రాయలసీమలో సైతం ప్రభావం చూపగలరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అయితే, నిజానికి ఇంతవరకు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే స్థానం ఏంటన్నదానిపై స్పష్టత లేదు. పవన్ నుండి కానీ, జనసేన వర్గాల నుండి కూడా ఎలాంటి ప్రకటనలు లేవు. కానీ  ఇప్పుడు పవన్ రాయలసీమ నుంచి పోటీ చేయనున్నారనే కథనాలు వస్తుండడంతో జనసైనికుల్లో జోష్ నెలకొంది. చంద్రబాబు రాయలసీమ నుండి కుప్పంలో పోటీ చేయనుండగా.. లోకేష్ కోస్తాంధ్ర నుండి మంగళగిరిలో పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో పవన్ ఉత్తరాంధ్ర నుండి పోటీ చేస్తే బావుంటుందన్న భావన కూడా ఉంది. అందుకే సాధ్యమైనంత త్వరగా పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై   ప్రకటన చేయాలని జనసైనికులు కోరుతున్నారు. అంతేకాదు, వైసీపీ అధినేత జగన్ కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గాల మాదిరిగా.. పవన్ సైతం శాశ్వతమైన ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే బావుంటుందని జనసేన శ్రేణులు కోరుతున్నాయి. మరి పవన్ ఈసారి ఎక్కడ నుండి పోటీకి దిగనున్నారో చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.