రైతులకు అండగా జనసేనాని

Publish Date:Dec 31, 2019

Advertisement

అమరావతి రైతులకు అన్యాయం చేసి ఒక్క అడుగు ముందుకేసినా చూస్తూ ఊరుకునేదిలేదని  మండిమడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలకు భరోసా కల్పించకుండా.. అమరావతి రైతులకు భరోసా కల్పించకుండా.. వారికి అండగా నిలబడకుండా.. మీకు మీరే చర్యలు తీసుకుని  ముందుకెళ్తే పరిణామాలు చాలా బాధ కలిగించే స్థితికి దారి తీస్తాయని పవన్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి కదిలిస్తున్న విషయం మొత్తం రాష్ట్రాన్నే కుదిపేసే అంశంగా మారిందన్నారు. మనల్ని మభ్య పెట్టి, భయపెట్టి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే ఈ ప్లాన్ తప్ప మరొకటికాదని ఆయన తెలియజేశారు. హైకోర్ట్ అమరావతి నుంచి కదిలించాలంటే సుప్రీం కోర్టు చెప్పాలి.. కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి.. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని ఆయన వెల్లడించారు. ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రజలను మోసం చేస్తొందని ఆయన మండిపడ్డారు. జీఎన్ రావు కమిటీ వాళ్లు చెప్పింది లిజిస్లేటివ్ అసెంబ్లీ విజయనగరంలో పెట్టాలని అన్నారు కానీ భీమిలిలో పెట్టాలని చెప్పలేదన్నారు. ఈ విషయం పై కూడా ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని జనసేన అధినేత తెలియజేశారు.

రైతుల భూములు కోసం 40 సంవత్సరాలుగా గుమ్మం లోపలి నుంచి బయటికి రాని ఆడపడుచులు ఈ రోజు రోడ్ల మీద వస్తున్నారంటే అన్యాయాన్ని తట్టుకోలేక తప్పక మరే రాజకీయం చెయ్యడానికి కాదన్నారు. రోడ్లపైకి వచ్చిన ఇలాంటి ఆడపడుచులను..వారి కష్టాలను వైసీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులు అనే పదజాలంతో మాట్లాడటం క్షమించలేనిదని అన్నారు. మనుషుల్ని పశువులుగా వర్ణిస్తున్న తీరు తనకెంతో బాధనిచ్చిందన్నారు. స్పష్టత లేకుండా గనుక వైసిపి ఇలాగే ముందుకెళ్తే చాలా ప్రమాదముందన్నారు. రాజధాని ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందని..రైతులు తమ సాగు భూములను ప్రజలు గురించి..రాష్ట్ర భవిష్యత్తు గురుంచి ఆలోచించి భూములను త్యాగం చేశారని గుర్తు చేశారు. కావున అమరావతి ప్రజల భవిష్యత్తును కాపాడటం జనసేన ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. రైతులకు అండగా నిలబడతామని అక్కడి ప్రజలకు మాటిచ్చారు జనసేనా అధినేత.  ప్రజలు భూములిచ్చింది ప్రభుత్వానికి కనుక వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎల్లప్పుడు ఉంటుందన్నారు. ప్రభుత్వం మోసం చేస్తే నిలదీసే హక్కు.. ధర్నాలు చేసే హక్కు కూడా ప్రజలకు ఉందని అడ్డుకోకుండా మానవత దృష్టిగల చూడండి అంటూ పోలీస్ శాఖకు విన్నవించారు. ప్రజలపై, రైతులపై, రైతుకూలీలపై దయచేసి క్రిమినల్ కేసులు పెట్టవద్దని ఆయన విన్నవించారు. ఎప్పటికి 151 సీట్లు శాశ్వతం కాదని..అవి ఏ రోజైనా కూలిపోవచ్చని రైతు కన్నీరు పెట్టిన.. వారిని కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలు ఇంత వరకు నిలబడ్డ దాఖలాలు లేవని ఆయన తెలియజేస్తూ ఎల్లప్పుడు జనసేన రైతులకు తోడుగా ఉంటుందని తెలియజేశారు.

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.