స్థానిక పోరులో జనసేన వ్యూహం.. కూటమి ఐక్యతకు భంగం లేకుండానే ఎక్కువ స్థానాల్లో పోటీ.!

Publish Date:Aug 21, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఈ ఎన్నికలను   ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 

స్థానిక  పోరుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చిన ఆయన.. కూటమి భాగస్వామ్య పక్షాలతో సీట్ల కేటాయింపు చర్చలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు.  కూటమిలో సీట్ల పంపకాలపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. 80, 15, 5 నిష్పత్తిలో సీట్ల పంపకాల ప్రతిపాదన లేదన్నారు.  2024  ఎన్నికల సమయానికి.. , ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందన్న పవన్ కల్యాణ్..  అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి ఐక్యత, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా  త్యాగాలకు సిద్ధపడ్డామన్న ఆయన.. క్షేత్రస్థాయిలో   శ్రమించిన పార్టీ శ్రేణులకు, నాయకులకు ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పిస్తానన్నారు. స్థానిక ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేలా ముందుకుసాగుతానన్న ఆయన  కూటమి ఐక్యతకు   భంగం వాటిల్లకుండానే, అధిక స్థానాలలో జనసేన పోటీ చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.  క్షేత్రస్థాయి బలాబలాలు, అభ్యర్థుల గెలుపు అవకాశాలను పరిగణనలోనికి తీసుకునే  స్థానిక ఎన్నికలలో సీట్ల సర్దుబాటు ఉంటుందని పవన్ చెప్పారు.  

Pawan Kalyan Strategy for local body elections, Janasena Party, AP Local Body Elections, TDP Janasena Alliance, Seat Sharing Strategy

By
en-us Political News

  
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.