అల్లు అర్జున్ మీద పవన్ కళ్యాణ్ పరోక్ష పంచ్!
Publish Date:Aug 8, 2024
Advertisement
డైరెక్ట్.గా అల్లు అర్జున్ పేరును ప్రస్తావించనప్పటికీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ మీద పంచ్ విసిరారు. సినిమాల్లో హీరోల కేరెక్టర్ల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ‘‘నలభైయ్యేళ్ళ క్రితం హీరో అడవులను కాపాడేవాడు.. కానీ, ప్రస్తుతం మాత్రం హీరో అడవులలో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు.. ఇదీ... ప్రస్తుతం మన సినిమా పరిస్థితి’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. మొన్నటి ఎన్నికల సందర్భంగా నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి రవిచంద్రకిషోర్రెడ్డికి అల్లు అర్జున్ ప్రచారం చేసినప్పటి నుంచి కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య ‘గ్యాప్’ ఏర్పడినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు కుటుంబాలు ఈ ఊహాగానాలను ఖండిస్తున్నప్పటికీ, ‘దూరం’ వుందనే అభిప్రాయాలు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ని ఉద్దేశించి అన్నవేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-punch-to-allu-arjun-25-182563.html





