వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల డిమాండ్ కు తలొగ్గిన కేంద్రం
Publish Date:Aug 8, 2024
Advertisement
పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా మోడీ సర్కార్ విపక్షాల డిమాండ్ కు తలొగ్గింది. గత పదేళ్లలో మంద బలంతో విపక్షాల అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకోవడానికి ఎన్నడూ ముందుకు రాని కేంద్రం.. ఇప్పుడు మాత్రం బిల్లుల విషయంలో విపక్షాల డిమాండ్ కు తలొగ్గక తప్పని పరిస్ధితులను ఎదుర్కొంటోంది. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు విషయంలో విపక్షాల డిమాండ్ కు కేంద్రం తలొగ్గింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై విపక్షాల అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకున్న కేంద్రం ఆ బిల్లును జేపీసీకి పంపాలని నిర్ణయించింది. అంతకు ముందు గురువారం (ఆగస్టు 8) వక్ఫ్బోర్డ్ సవరణ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఆ ఈ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితి చేయడంతో పాటు, ముస్లిం మహిళలను సభ్యులుగా చేసేలా సవరణలు చేశారు. సచార్ కమిటీ సిఫార్సులు మేరకు సవరణలు చేశామనీ, ముస్లిం మహిళలు, పిల్లలకు చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డులకు రావాల్సిన ఆదాయం రావడం లేదని.. సచార్ కమిటీ కూడా చెప్పిందని కిరణ్ రిజిజు గుర్తుచేశారు. అలాగే వక్ప్బోర్డు ఆదాయాలపై అందరికీ అవగాహన ఉందని.. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనిని తాము చేసి చూపించామని, కాంగ్రెస్ ఇతర పార్టీలు రాజకీయం కోసమే బిల్లును వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. చివరకు విపక్షాల డిమాండ్ కు తలొగ్గి బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు కేంద్రం నిర్ణయించింది.
http://www.teluguone.com/news/content/center-to-send-wuaqf-board-bill-to-jps-25-182558.html





