కూటమిలో పవన్ సొంత అజెండా?

Publish Date:Dec 14, 2025

Advertisement

అమరావతి వేదికగా తాజాగా  జరిగిన రెండు సమావేశాలు.. రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఓ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగితే.. మరో సమావేశం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగింది. అదేంటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి ఉపముఖ్యమంత్రి, ఐదు శాఖల మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ హాజరవ్వాలి కదా? పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకోవడం ఏంటి? అనే  అనుమానాలు మీకు కలగవచ్చు... మీకే కాదు.. కూటమిలో ఉన్న నేతలతో పాటు రాజకీయ నాయకులకు ఇదే అనుమానం కలుగుతోంది. 

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అన్ని శాఖల హెచ్‌ఓడీలు, కార్యదర్శులు , మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో  సమావేశం నిర్వహించారు.  ఈనెల 17, 18 తేదీల్లో జరగబోతున్న కలెక్టర్స్ కాన్ఫిరెన్స్ కి కర్టెన్ రైజర్ గా జరిగింది ఈ సమావేశం. పరిపాలకు సంబంధించినటు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇలాంటి కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ  రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్  కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి  సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.  వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎన్డీఏలో అత్యంత యాక్టివ్‌గా కనిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారన్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వేగంగా విస్తరిస్తోంది. మొదటి రోజుల్లో జరిగిన ప్రతి ముఖ్య సమావేశానికి స్వయంగా హాజరై, ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందున్న జనసేనాని, ఇటీవల మాత్రం కీలక అధికారిక ఈవెంట్స్‌కి కూడా హాజరుకాకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ముఖ్య మీటింగ్‌లకు కూడా పవన్ డుమ్మా కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అమరావతిలోనే ఉన్నప్పటికీ...సీఎం చేపట్టే అత్యావశ్యక కార్యక్రమాలకు వెళ్లకుండా, ఆయన సొంత షెడ్యూల్‌ని ఫాలో అవుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఎస్ఐబీపీ సమావేశాలు, విశాఖ ఇండస్ట్రియల్ సమ్మిట్, సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం, రాజధాని ప్రాజెక్టుల రివ్యూ, పెన్షన్ల పంపిణీ వంటి ప్రభుత్వ ముఖ్య వేడుకలు, మీటింగ్‌లు, లాంచింగ్‌లు.. వీటి వేటిలోనూ  పవన్ కనిపించకపోవడం చిన్న విషయం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి భాగస్వామ్యంలో ఇలాంటి గ్యాప్… ముఖ్య కార్యక్రమాల్లో పవన్ కనిపించకపోవడం… సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ అన్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందంటున్నారు. 

అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ వాంటెడ్ గా చేస్తున్నారా? లేక ముందస్తుగానే షెడ్యూల్ అయిన కారణంగానే  సీఎం సమావేశానికి హాజరు కాలేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తుంది. అంతే కాదు  పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పాలనలో తన ఇమేజ్‌ని పెంచుకోవాలని భావిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక పార్టీ అధినేతగా  విడివిడిగా సమావేశాలు పెట్టుకోవడం ద్వారా.. దాని ఇంపాక్ట్ క్యాడర్ మీద కూడా పడే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కూటమి సభల్లో  మూడు పార్టీల కార్యకర్తలు కలిసి ఉండాలని, చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని... కార్యకర్తలు, నేతల ప్రవర్తన కారణంగా కూటమి ఐక్యతను దెబ్బతీయొద్దంటూ  పదేపదే చెబుతున్న పవన్ కళ్యాణ్.... ఆచరణలో తాను స్వయంగా ఎందుకు ఫాలో కావట్లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కారణాలు ఏమైనా గానీ.. పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశాలు పెట్టుకోవడం.. కూటమి కలిసి చేస్తున్న  కార్యక్రమాలకు హాజరు కాకపోవడం వల్ల నెగిటివ్ టాక్ స్ప్రెడ్  అవుతుందనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ వినపడుతోంది. పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో  ముఖ్యమంత్రి కీలకమైన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎంగా  ఉన్న మల్లు భట్టి విక్రమార్క  కచ్చితంగా పాల్గొంటున్నారు.. కర్ణాటకలోనూ ఇదే తరహా వాతావరణం కనిపిస్తోంది. కానీ ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి సమావేశాలకు, కూటమి నిర్వహించే సమావేశాలకు పవన్ దూరంగా ఉండడం వెనుక  మతలబు ఏంటో జనసేన నాయకులే చెప్పాలంటున్నారు. మొత్తానికి తాజాగా జరిగిన హెచ్ఓడీలు, సెక్రటరీల సమావేశానికి పవన్ రాకపోవడం.. అమరావతి లోనే  తన శాఖకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడం వెనుక మతలబు ఏంటనే దానిపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.