ప్రొటోకాల్ పక్కన పెట్టి, భద్రతను తోసిరాజని: బాబుతో పవన్ భేటీ: రాజీనామా వదంతులకు ఫుల్ స్టాప్.!

Publish Date:Oct 22, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో  భేటీ అయ్యారు. గురువారం (అక్టోబర్ 22) ఆయన   కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  

ఎన్నికల సంఘం 100 నియోజకవర్గాల్లో ఎన్నికలను నిలిపివేయడం, ఈ ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో  వీరిరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  అంతేకాకుండా, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు, ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. అన్నిటికీ మించి   ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ రాజీనామా చేస్తారనీ, తెలుగుదేశం, జనసేన పొత్తు విచ్ఛిన్నం అంటూ సోషల్  మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మధ్య జరిగిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ముఖ్యంగా బుధవారం (అక్టోబర్ 21) రాత్రి నుంచీ  సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయబోతున్నారని, తెలుగుదేశం పార్టీతో జనసేన తెగతెంపులు చేసుకోనుందంటూ కొందరు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీకి చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ వదంతు ప్రచారం అయ్యాయి.  దీంతో  ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ పవన్ కళ్యాణ్ నేరుగా సీఎం నివాసానికి వెళ్లి ఎలాంటి భద్రత లేకుండా సమావేశం అయ్యారని అంటున్నారు. 

కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన జనసేన, తెలుగుదేశం మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, రాష్ట్ర అభివృద్ధి,  ఎన్నికల వ్యూహాలపై ఇద్దరు నేతలు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని ఈ భేటీ మరోసారి చాటింది. ఎలాంటి ప్రోటోకాల్స్‌ను పాటించకుండా, అత్యంత సాధారణంగా పవన్ కళ్యాణ్  సీఎంను ఆయన అధికారిక నివాసానికి వెళ్లి కలవడం ఇరు పార్టీల మధ్యా ఉన్న సఖ్యత, సమన్వయాన్ని మరింత బలంగా చాటిందని పరిశీలకులు అంటున్నారు.   

[Pawan Kalyan Meet  Chandrababu Naidu, AP Politics, Jana Sena TDP Alliance, Local Body Elections, Resign Rumours, Andhra Pradesh Politics, Telugu One]

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.