కేటీఆర్‌కు పవన్ కల్యాణ్ లెటర్.. జగన్‌రెడ్డికి చురకలు!

Publish Date:Feb 25, 2022

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్’కు లేఖ రాశారు. అయితే ఆయన లేఖ రాసింది, కేటీఆర్’కే అయినా, అందులోని అక్షరాలు గుచ్చుకున్నది మాత్రం, ఎవరికో వేరే చెప్పనక్కరలేదు. అవును, జగన్ రెడ్డికే అయన పరోక్షంగా చురకలు అంటించారు. 2014 నాటి ఎన్నిక‌ల‌ గాయాన్నిగుర్తుచేసుకుని జగన్ రెడ్డి ఇప్పటికీ పవన్ కళ్యాణ్’పై పగ సాధిస్తూనే ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్’లో సినిమా రంగాన్ని తన‌ కాలి కింద చెప్పులా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్ చెప్పులో రాయిలా గుచ్చుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపధ్యంలోనే అసలే పాత పగతో రగిలిపోతున్న జగన్ రెడ్డి,  పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం విడుదల విషయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అవరోధాలు సృష్టిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే, సినిమా హాల్స్’పై దాడులు చేయించారు. సినిమా టికెట్ల రేట్లు పెంచేందుకు సినిమా ఇండస్ట్రీతో డీల్ కుదుర్చుకున్నా, ‘భీమ్లా నాయక్’  విడుడలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇంకా అనేక విధాల వేధింపులకు గురి చేస్తున్నారు. 

ఈ నేపద్యంగా హైదరాబాద్’లో జరిగిన ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్’లో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను, సినిమా పరిశ్రమకు ఇచ్చిన ప్రోత్సాహాన్నీ, ప్రస్తుతిస్తూ పవన్ కళ్యాణ్ మంత్రికి రాసిన లేఖ ద్వారా జగన్ రెడ్డికి చురకలు అంటించారు. అందులో ఆయన, “ఎంత భావ వైరుధ్యాలున్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలి ” అని పేర్కొన్నారు. ఇక్కడ ఆయన ప్రత్యక్షంగా, జగన్ రెడ్డిని ఏమీ అనలేదు కానీ, ‘తెలంగాణ నేతలకు’అని ప్రత్యేకించి చెప్పడం ద్వారా, ఏపీ నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పకనే చెప్పారు. రాజు గారి పెద్ద భార్య మంచిదంటే, రెండవభార్య గురించి చెప్పనక్కర లేదు కదా .. అలాగే, పవన్ కళ్యాణ్ “ఎంత భావ వైరుధ్యాలున్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలి ”అని అన్నారంటే ఏపీ పాలకులకు ఆ సంస్కారం లేదని చెప్పడం  గానే అర్థం చేసుకోవాలని అంటున్నారు. 

నిజానికి, రాజకీయంగా పవన్ కళ్యాణ్’ కు మొదటి నుంచి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పట్ల కొంత ప్రత్యేక గౌరవం ఉన్న మాట నిజం. అయినా ఆయనకు తెరాస నాయకులకు మధ్య పెద్దగా సయోధ్యత, స్నేహ సంబంధాలు లేవు. పవన్ కళ్యాణ్, కేటీఆర్ ఒకరి నొకరు దూషించుకున్న సందర్బాలున్నాయి. అలాగే, పవన్ కళ్యాణ్, కేసేఆర్ కూడా ఒకరినొకరు దూషించుకున్నారు. ఒకరు తాట తీస్తానంటే, ఇంకొకరు ముక్కలు, ముక్కలుగా నరుకుతా’ అన్నారు. అందుకే, పవన్ కళ్యాణ్” కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి కుల, మత, భాష, ప్రాంతీయ బేధాలుండవు. అంతే కాదు భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి నిండైన హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని లేఖలోపేర్కొన్నారు. అంటే, పవన్ కళ్యాణ్ లేఖ రాసింది తెలంగాణ మంత్రి కేటీఆర్ కైనా, వాతలు పెట్టింది మాత్రం జగన్ రెడ్డికే.. అంటున్నారు విశ్లేషకులు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనిషి సహజ వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించగలిగితే, సుమారు 1,400 సంవత్సరాల వరకు జీవించే అవకాశం
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.