పవన్ కల్యాణ్ లో అస్పష్టత.. జనసేనలో గందరగోళం!

Publish Date:Jul 18, 2022

Advertisement

యుద్ధానికి వెళ్లాలా వ‌ద్దా అనే దానిలో రాజుకి రెండు ఆలోచ‌న‌లు వుండ‌కూడ‌దు. ప్ర‌జా ర‌క్ష‌ణ‌కు కంక‌ణం క‌ట్టుకున్నాన‌ని ప్ర‌గ‌ల్భాలు పలికితే సరిపోదు,   రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు దిగాలి లేదా  రంగంలోకి దూకేయాలి.  గ‌ట్టుమీద కూచుని మ‌రిదీ ఎటెళితే బావుంట‌దంటావ్ అని సంబంధంలేని వాడిని అడిగితే ఎలా?  అదుగో అలా వుంది ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం. అధికార కాంక్ష బాగానే వున్న‌ప్ప‌టికీ, అంతే స్థాయిలో లోపల ఉన్న ఓటమి భయాన్ని బయట పడకుండా ఉత్తర కుమార ప్రగాల్బాలతో పబ్బం గడిపేసుకుందామంటే కుదరదు.   ఒక‌సారి ఒక‌ ర‌కంగా మ‌రోసారి మ‌రో ర‌కంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తే   వీరాభిమానులు కూడా మ‌రో నిర్ణ‌యం తీసునే ప్రమాదం ఉంది. రాజ‌కీయ‌ రంగంలోకి కాళ్లూ చేతులూ పెట్టేసిన త‌ర్వాత ఇంకా తెర మీదే వున్నాన‌కుంటే ఎలా జనసేనానీ..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనం కోసమే తన రాజకీయాలు అంటూ చెబుతున్న మాటలపై ఎవరికీ అపనమ్మకం లేదు. అయితే ఆ జనం కోసం ఆయన అధికారంలోకి వచ్చి పని చేయా లనుకుం టున్నారా.. లేక ప్రశ్నించే పార్టీగా అధికారానికి దూరంగా ఉండాలనుకుంటున్నారా అన్న విషయంలోనే ఆయన ప్రసంగాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. అధికారం కాదు.. ప్రజలకు అండగా నిలవడమే ముఖ్యమంటూనే.. ఆయన కాబోయే ముఖ్యమంత్రిని తానేనంటూ ప్రకటనలు చేస్తున్నారు.

అదే సమయంలో అదే ప్రసంగంలో ఎన్నికలలో ఓడిపోయినా..ప్రజల పక్షానే నిలబడతానంటూ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే ఆయన   ఆయనపై ఆయన రాజకీయ ప్రస్థానంపై జనంలో పూర్తి విశ్వాసం కనిపించడం లేదు. 2014 ఎన్నికలలో ఎన్నికలకు దూరంగా ఉండి.. తెలుగుదేశం, బీజేపీలకు బయట నుంచి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఆ తరువాత ఏపీలో తెలుగుదేశానికి అధికారాన్ని కట్టబెట్టినది తానేనంటూ క్లెయిమ్ చేసుకోవడం ప్రారంభించారు. సహజంగానే తెలుగుదేశం పార్టీ దానికి ఖండించింది.

దాంతో ఇరు పార్టీల మధ్యా దూరం పెరిగింది. ఆ తరువాత 2019 ఎన్నికలలో   తెలుగుదేశం,  బీజేపీలకు దూరం జరిగి సొంతంగా జనసేన ఎన్నికల బరిలోకి దిగింది. అయితే ఆ ఎన్నికలలో పార్టీ  ఘోర పరాజయాన్ని చవి చూసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం పాలయ్యారు. ఇందుకు ప్రధాన కారణం ఆయన ప్రసంగాలలో విజయం పట్ల విశ్వాసం కనిపించకపోవడమేనని అప్పట్లో పరిశీలకులు పలు విశ్లేషణలు చేశారు. ఇది జరిగి మూడేళ్లు అయ్యింది. అప్పటికీ, ఇప్పటికీ ఆయన ప్రసంగాలలో అదే అస్పష్టత, అదే సందిగ్ధం. అంతెందుకు.. ఆయన రాజకీయ అరంగేట్రం చేసినప్పటి కన్య్ఫూజన్ ఇప్పటికీ అలాగే ఉందని పరిశీలకులు అంటున్నారు.  

ఆయన ప్రసంగాల్లో ఆయనలోని విశ్వాస లేమి ప్రస్ఫుటంగా ప్రతిధ్వనిస్తుంటుంది. ఒక గందరగోళం విన్నవారికి కలుగుతుంది. అసలు ఆయనలోనే స్పష్టత లేదన్నది తేటతెల్లమౌతుంది.  అసలు ఆయన జనసేనకు ఓటేయమని కోరారా.. వద్దని చెప్పారా అన్న అసుమానం కలుగుతుంది. ఇటీవల ఆయన తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జరిగిన రైతు భరోసా యాత్ర సభలోనూ  అదే చెప్పారు. అధికారం కోసం రాలేదని విస్పష్టంగా ప్రకటిస్తూనే.. తానే సీఎం, జనసేనదే అధికారం అన్నారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలే ఆయన రాజకీయ నిబద్ధతపై, సీరియస్ నెస్ పై జనంలో సందేహాలకు కారణమౌతున్నాయి.

అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని అధినేత విస్పష్టంగా ప్రకటిస్తే జనం ఆయన పార్టీకి ఎందుకు ఓటేస్తారు. పైగా అభ్యర్థిని చూసి కాదు.. అధికారం అక్కర్లేదంటున్న తనను చూసి ఓటేయమని అడిగితే ఎందుకు వేస్తారు. కౌలు రైతులకు సహాయం చేయడం, పేద విద్యార్థులకు సహాయం చేయడం వంటి సామాజిక కార్యక్రమాలు సంపన్నులు చేసే ఛారటీలకు తేడా ఏముంది? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.    అధికార కాంక్ష లేదంటూనే జనసేన అధికారంలోకి వస్తుందనిప్రకటిస్తారు. అధికారం కోసం రాలేదని చెప్పడం జనంలోకి ఎటువంటి ప్రతికూల సంకేతాలు పంపుతుందో..  అధికారం వస్తే ఇవి చేస్తాం అవి చేస్తాం అని అదే నోటితో ప్రకటనలు చేయడం జనసేనానికి, జనసేన పార్టీకి అంత కంటే ఎక్కువ నష్టం చేస్తుందని పరిశీలకుల భావన. అసలు ఒక రాజకీయ పార్టీ అధినేత.. గెలవకపోయినా, అధికారంలోకి రాకపోయినా ఫర్వాలేదని చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఏ మూలో తనలో ఉన్న అభద్రతా భావాన్ని చాటుకోవడం తప్ప.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హాజరుకాలేదు.  భాజపాతో పొత్తు ఉన్నప్పటికీ పవన్‌ కల్యాణ్‌.. ప్రధాని సభలో ఎందుకు పాల్గొనలేదనే దానిపై భిన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో భీమవరం పర్యటనలో ఉన్న పవన్‌ కల్యాణ్‌  ప్రధాని పాల్గొనే సభకు తనకు ఆహ్వానం అందిందన్నారు. అయితే  స్థానిక ఎంపీకి ఆహ్వానం అందకపోవడం సరికాదన్న భావనతోనే ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పారు. ఈ మాటల ద్వారా బీజేపీతో దాదాపు తెగతెంపులు జరిగాయన్న సంకేతాలు ఇచ్చారు. ఇక ఓట్ల కోసం తాను కులాన్నే నమ్ముకుంటానన్న అర్ధం వచ్చేలా పవన్ మాట్లాడటం ద్వారా తనలోని రాజకీయ డొల్లతనాన్ని బయట పెట్టేసుకున్నారు. మరో సందర్భంలో అసందర్బంగా రాష్ట్రంలో పొత్తుపొడుపుల చర్చకు తెరతీశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వను అనడం ద్వారా తానే పొత్తులకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాన్ని ఇచ్చారు. ఆ వెంటనే పొత్తులకు జనసేన ఆప్షన్స్ అంటూ అసాధ్యాలను ఆప్షన్స్ గా పెట్టి ఆచరణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికకే తాను పని చేస్తున్నానని చెప్పకనే చెప్పారు.  ఇన్ని పరస్పర విరుద్ధ వ్యాఖ్యలతో ఆయన జనసేన పార్టీని ఏ దిశగా తీసుకువెళుతున్నారు అన్న సందేహం పార్టీ శ్రేణుల్లోనే కలిగేలా చేస్తున్న పవన్ ఇక జనంలో కలిగిస్తున్న అయోమయానికి, ఆయనలో ఉన్న గందరగోళమే కారణమని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.