ఆస్పత్రి నుంచి పవన్ కల్యాణ్ డిశ్ఛార్జ్.!

Publish Date:Jul 15, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముంబైలోని  కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఆ ఆస్పత్రిలో ఆయన భుజానికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. సర్జరీ సక్సెస్ అయిన తరువాత కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉన్న పవన్ కల్యాణ్   బుధవారం జులై 15) ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  

గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ రెండు భుజాల  రొటేటర్ కఫ్  సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే వైద్యుల సూచన మేరకు ఈ నెల 10న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో  నిపుణులైన వైద్య బృందం ఆయన కుడి భుజానికి సర్జరీ చేసింది.
సర్జరీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ గత నాలుగు రోజులుగా అక్కడి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ..  వేగంగా కోలుకుంటున్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ, ఆయన సంపూర్ణంగా కోలుకోవడానికి మరికొన్ని రోజుల పాటు ఖచ్చితంగా పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ముంబై వెళ్లి ఆయనను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం, ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు.

మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారనే సమాచారంతో జనసేన శ్రేణులు, తెలుగుదేశం కూటమి నేతలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో త్వరలోనే రాష్ట్ర విధుల్లో పాల్గొనాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో  పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

Pawan Kalyan shoulder surgery, Kokilaben Hospital Mumbai, AP Deputy CM Pawan Kalyan

By
en-us Political News

  
ప్రస్తుతానికి కోవిడ్ బారిన పడిన వారిలో ముగ్గురు రోగులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరే కాకుండా, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మహిళకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రైలు ఢీకొట్టిన వేగానికి స్కూల్ వ్యాన్ పూర్తిగా ముక్కలై, పట్టాల పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఒక సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
క్వార్టర్ ఫైనల్ పోరులో పీవీ సింధు, జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహారాతో తలపడాల్సి ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ క్రీడాకారిణి ఒకుహారా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. దీంతో సింధుకు ఆటోమేటిగ్గా సెమీస్ బెర్త్‌ ఖరారు అయిపోయింది.
గూగుల్ నుండి సరికొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ గూగుల్ పిక్స్ ఆగస్టు 18న అధికారికంగా విడుదల కాబోతోంది. అడోబ్, కాన్వాలకు పోటీగా వస్తున్న ఈ టూల్ ఫీచర్లు, ఉచిత ఆఫర్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
అమెజాన్ ప్రైమ్ డే ముగిసినా రోబోట్ వాక్యూమ్ క్లీనర్లపై 70 శాతం వరకు భారీ డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. డ్రీమ్, రోబోరాక్ మరియు ఎకోవాక్స్ బ్రాండ్లపై లభిస్తున్న క్రేజీ ఆఫర్ల పూర్తి వివరాలు మీకోసం.
మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాల సమాచారం. గత రెండు రోజులుగా ఆయన నీరసంగా ఉండటం, జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వాటికి శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వైద్యులు తెలిపారు.
అమెరికా ఎన్నికల నిబంధనలను సమూలంగా మార్చేందుకు ట్రంప్ ప్రతిపాదిస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ అంటే ఏమిటి? పౌరులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జులై 17 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 22, 24 క్యారెట్ల తులం పసిడి ధరలపై రూ.760 వరకు తగ్గుదల నమోదైంది. నేటి లేటెస్ట్ గోల్డ్ రేట్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బులియన్ మార్కెట్లో బంగారం వెండి నిష్పత్తి 69 కి చేరింది. 2026 లో 80 మార్కు దాటిన ఈ రేషియో ప్రస్తుతం సాధారణ స్థితికి రావడంతో ఏ లోహంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయో నిపుణుల విశ్లేషణ ఇక్కడ చదవండి.
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి భవిష్యత్ పెట్టుబడులపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బంగారం, ఆయిల్ కంటే నీటి హక్కులకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిపారు.
భారత సరిహద్దుల్లో భద్రతా బలగాలు నిరంతరం నిఘా ఉంచడంతో, ఈసారి భూమార్గాలను విడిచిపెట్టి జలమార్గాల ద్వారా చొరబడేందుకు వాటర్ ఫోర్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. ఈ వాటర్ ఫోర్స్ నీటి అడుగున ఉండి పోరాడేందుకు ఇస్తున్న శిక్షణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బహిర్గతం కావడంతో లష్కరే ఉగ్రకుట్ర బయటపడింది.
అమెరికాలో ఓటింగ్ విధానాన్ని మార్చేందుకు డోనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ SAVE America Act 2026 బిల్లు విశేషాలు, పౌరసత్వ నిరూపణ నిబంధనలు మరియు దీనివల్ల ఓటర్లపై పడే ప్రభావం గురించిన పూర్తి వివరాలు.
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? జూలై 19న లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్ హిట్ మ్యాన్ కెరీర్‌లో చివరిదా? అసలు నిజమేంటో ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.