మరో ఇద్దరితో పవన్ కళ్యాణ్ కటీఫ్

Publish Date:Dec 10, 2014

Advertisement

 

‘పవర్‌స్టార్’ పవన్ కళ్యాణ్ తానే స్వయంగా అందర్నీ దూరం చేసుకుంటూ వుంటారా? లేక పవన్ కళ్యాణ్‌కే అందరూ దూరమైపోతూ వుంటారా? ఈ ప్రశ్న ‘‘విత్తు ముందా.. చెట్టు ముందా’’ అనే ప్రశ్నకంటే చాలా క్లిష్టమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాలు వెతికే రిస్కు చేయడం కంటే... అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమయిందో ఆ పాయింట్లోకి వెళ్తే మంచిది. పవన్ కళ్యాణ్‌ కెరీర్‌లోనూ, వ్యక్తిగతంగానూ ఆయనకి ఎంతోమంది దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా దూరమయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ), ‘జనసేన’ పార్టీకి సోలో ప్రతినిధిగా వున్న రాజు రవితేజ కూడా చేరారు. అరె... మొన్నటి వరకూ వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్‌కి జిగిరీ దోస్తుల్లా వున్నారే... ఇంతలోనే ఏమైందన్న సందేహం కలుగుతోంది కదూ?

 

ఈమధ్యకాలంలో పవన్ కళ్యాణ్‌కి బాగా సన్నిహితమైన వ్యక్తుల్లో పీవీపీ కూడా ఒకరు. పీవీపీ అంటే సామాన్యమైన వ్యక్తేమీ కాదు... పెద్ద వ్యాపారవేత్త. సినిమా రంగంలో కూడా విజయాలు సాధించాడు. అలాంటి పీవీపీ పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీయాలన్న ఉద్దేశంతో ఆయనకి చేరువయ్యారు. అలా పవన్‌కి, పీవీపికి మంచి స్నేహం కుదిరింది. ఆ స్నేహంతోనే ‘జనసేన’ పార్టీకి సంబంధించిన రెండు భారీ బహిరంగసభల్ని పీవీపీ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. అందుకు ప్రత్యుపకారంగానే గడచిన ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం టిక్కెట్‌ కోసం పీవీపీని పవన్ కళ్యాణ్ రికమండ్ చేశారు. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ మాట కాదనలేక పీవీపీకి పార్లమెంట్ టిక్కెట్ కూడా ఇచ్చారు. అయితే ఆ టిక్కెట్ని ఆశించిన తెలుగుదేశం నాయకుడు కేశినేని నాని పట్టుపట్టడంతో చంద్రబాబు పీవీపీకి సారీ చెప్పేశారు. అయితే ఆ దశలో పవన్ కళ్యాణ్ పట్టుబట్టి తనకు టిక్కెట్ ఇప్పిస్తారని పీవీపీ ఆశించారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎక్కువ చొరవ చూపించకపోవడంతో విజయవాడ ఎంపీ కావాలన్న పీవీపీ కల కరిగిపోయింది.

 

తన కలను నిజం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా చొరవ చూపలేదని పీవీపీ మనసు కష్టపెట్టుకున్నారని తెలుస్తోంది. అందుకే విజయవాడలో భారీ షాపింగ్ మాల్‌ని నిర్మించిన పీవీపీ దాని ప్రారంభోత్సవానికి సచిన్ టెండూల్కర్ని ఆహ్వానించారు. అప్పటి వరకూ సన్నిహితంగా వున్న పవన్ కళ్యాణ్‌‌ని మాత్రం ఆహ్వానించలేదు. అక్కడితో ఆగని పీవీపీ జనసేన సభల కోసం తాను ఖర్చుపెట్టిన డబ్బుతోపాటు, సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేయాలని పవన్ కళ్యాణ్‌ని డిమాండ్ చేశారట. దాంతో పవన్ కళ్యాణ్ రెండు కోట్లు మినహా మిగతా డబ్బంతా తిరిగి ఇచ్చేశారట. ఆ రెండు కోట్లు త్వరలో సర్దుతానని చెప్పారట. ఇలా వీరిద్దరి స్నేహ సుమం వాడిపోయింది.

 

ఇక పవన్ కళ్యాణ్‌కి దూరమైన మరో మిత్రుడు రాజు రవితేజ. పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని పెట్టకముందు రాజు రవితేజ అంటే ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణే స్వయంగా రాజు రవితేజ తన పార్టీ వ్యవహారాలన్నీ చూస్తారని ప్రకటించడంతో రాజు రవితేజ సడెన్‌గా లైమ్ లైట్‌లోకి వచ్చారు. చాలాకాలంపాటు పవన్ కళ్యాణ్ అంటే రాజు రవితేజ, రాజు రవితేజ అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వీరిద్దరి మధ్య స్నేహ బంధం వెల్లివిరిసింది. అయితే ఆ తర్వాత ఏమైందోగానీ రాజు రవితేజని పార్టీ వ్యవహారాల నుంచి పవన్ కళ్యాణ్ దూరంగా పెట్టడం ప్రారంభించారు. పార్టీకి సంబంధించి ఏదైనా చెప్పాలంటే తానే చెబుతానని తన పార్టీకి వేరే ప్రతినిధులెవరూ లేరని పవన్ వెల్లడించడంతో రాజు రవితేజ ఎంత వేగంగా లైమ్ లైట్లోకి వచ్చారో అంతే వేగంగా చీకట్లోకి వెళ్ళిపోయారు. ఇదీ జరిగింది. ఇక భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌కి ఎవరెవరు చేరువవుతారో.. ఎవరెవరు దూరమవుతారో వేచి చూడాలి.

By
en-us Political News

  
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.