టీడీపీ, బీజేపిలకి... పవన్ 'రెడ్' సిగ్నల్ ?

Publish Date:Dec 2, 2016

Advertisement


పవన్ కళ్యాణ్ ... ఈ పేరుకి ఎంత క్రేజ్ వుందో అంతే అయోమయం కూడా తోడై వుంటూ వస్తోంది! మరీ ముఖ్యంగా, పొలిటికల్ గా పవర్ స్టార్ వ్యూహం ఏంటో ఇంత వరకూ ఎవరికీ అర్థమైనట్టు కనిపించదు! 2014లో  జనసేన అంటూ హడావిడి చేసిన ఆయన దాన్ని పక్కన పెట్టి టీడీపీ, బీజేపి సేనలో చేరిపోయారు. రాజు అవుతాడని అభిమానులు ఊహించుకుంటే మామూలు సైన్యాధిపతిలా చంద్రబాబు, మోదీలకు ఉపయోగపడ్డాడు. అయినా కూడా జనం పవన్ ప్రభావంతో ఒకింత ఎక్కువ ఓట్లే వేశారు ఎన్డీఏ కూటమికి. కాని, చంద్రబాబు సీఎం, మోదీ పీఎం అయ్యాక పవప్ క్రమంగా వారికి దూరమవుతూ వస్తున్నాడు. తాజాగా కమ్యూనిస్టులతో బేటీ అయ్యి తన భవిష్యత్ రూట్ ఏంటో సంకేతాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు...


తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులది వింత వ్యవహారం. వాళ్లు కలవని పార్టీ అంటూ లేదు. ఏపీ, తెలంగాణల్లో పెద్దగా బలం లేని బీజేపితో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు సీపీఎం, సీపీఐ  వాళ్లు! ఓ సారి టీడీపీతో, ఓ సారి కాంగ్రెస్ తో, ఓ సారి టీఆర్ఎస్ తో... ఇలా ప్రధాన పార్టీలన్నిటితో కలిసి పని చేశారు. వైసీపీతో కూడా వాళ్లకు బాగానే అవగాహన వున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే, ప్రతీ అయిదేళ్లకు పొత్తులు మార్చేయటంతో వాళ్లకు గత కొంత కాలంగా అసలుకే మోసం వచ్చింది. క్రమంగా తెలంగాణ, ఆంద్రప్రదేశుల్లో వాళ్ల ప్రభావం తగ్గిపోతోంది. ప్రస్తుత ఏపీ అసెంబ్లీలోనైతే  ఒక్క ఎర్ర కండువా ఎమ్మెల్యే కూడా లేడు. అదీ పరిస్థితి... 


జనసేన పార్టీతో రాబోయే ఎన్నికల్లో కలకలం సృస్టిస్తాడని భావిస్తున్న పవన్... బలం తగ్గిపోయి అంపశయ్యని చేరిన కమ్యూనిస్టుల్ని ఎందుకు చేరదీస్తున్నాడు? తాజాగా ఆయన సీపీఐ నాయకులతో ఎందుకు భేటీ అయ్యారు? పైకి ప్రజా సమస్యలనీ రొటీన్ గా చెబుతోన్నా రానున్న సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని పవన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది! అందుకు, క్యాడర్ వున్న కమ్యూనిస్టుల్ని పవర్ స్టార్ వాడుకోవాలనుకుంటాన్నారేమో! అటు ఎర్ర పార్టీల వారికి కూడా టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీల కంటే సినిమా గ్లామర్ వుండే జనసేనే కాస్త బెటర్ అనిపించవచ్చు. తిరిగి కొన్నైనా సీట్లు పవన్ ఫాలోయింగ్ తో సంపాదించుకోవచ్చని వాళ్ల క్యాలికులేషన్ కావొచ్చు. అంతా అనుకున్నట్టు జరిగితే ఇద్దరికీ లాభమే... 


పవన్ ఎప్పుడు సభ పెడతాడో, వేదిక మీద నుంచి ఏం మాట్లాడతాడో ఎవ్వరికీ అర్థం కావటం లేదు ఈ మధ్య. అటువంటి అనూహ్యమైన స్పందన కలిగిన పవన్ కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు దిగుతాడా అంటే... ఇప్పుడే చెప్పటం కష్టం. ఎన్నికల టైంకి ఏదైనా కావొచ్చు. కాని, 2014లో పచ్చ, కాషాయ కండువాలు కప్పుకుని బరిలో నిల్చిన కళ్యాణ్ ఈ సారి ఎర్ర కండువా వేసుకుని నామినేషన్ వేస్తే మాత్రం వ్యవహారం రంజుగానే వుంటుంది. టీడీపీ, బీజేపి ఒక వైపు, వైసీపీ ఒక వైపు, లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకున్న పవన్ ఒక వైపు వుండటంతో ఏపీలో త్రిముఖ పోటీ ఫుల్ గా రక్తి కడుతుంది!

 

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.