కేసీఆర్ నీ తాట తీస్తా! పవన్ కళ్యాణ్

Publish Date:Apr 26, 2014

Advertisement

 

తెదేపా-బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ఈరోజు వరంగల్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ కూడా కొంచెం హద్దులు మీరారు. దేశానికి ప్రధాని కాబోయే నరేంద్ర మోడీని ఉద్దేశించి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ‘మోడీ, బీడీ’ అని నోటికి వచ్చినట్లు వాగితే సహించబోనని హెచ్చరించారు.

 

“కేసీఆర్! నువ్వు నన్ను ఏమన్నా సహిస్తాను. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి చెప్పట్టబోతున్న బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ఏమయినా అంటే మేము సహించను. ఆయన గురించి చులకనగా మాట్లాడితే నీ తాట తీస్తాను! ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోనని తీవ్రంగా హెచ్చరించారు.

 

ఊహించినట్లే ఆయన మాటలకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ సహజంగా కొంచెం ఆవేశపరుడు గనుక ఆయన నుండి ఇటువంటి పంచ్ డైలాగులు రావాలని సభకు వచ్చిన వారు ఆశించడం సహజమే. ఇదంతా పార్ట్ అండ్ ప్యాక్ ఆఫ్ మన (మురికి) రాజకీయాలు అని అందరూ తేలికగా తీసుకోవచ్చును. అయితే ఇక్కడ గమనించ వలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మొదటి నుండి కూడా కేసీఆర్ తన ప్రసంగంలో ప్రత్యర్ధులను ఉద్దేశించి వాడే ‘సన్నాసులు, లఫంగులు’ వంటి తిట్లను వాడటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. రాజకీయ విలువలను మరింత దిగజార్చే అటువంటి బాషను ఎవరూ కూడా సమర్దించరు. దానిని అందరూ గట్టిగా ఖండించవలసిందే!

 

అయితే ఆయన బాషను తప్పు పడుతున్న పవన్ కళ్యాణ్ కూడా ఇంచుమించు అదే విధంగా మాట్లాడుతున్నారిప్పుడు. తనకంటే వయసులో, రాజకీయ అనుభవంలో ఎంతో పెద్దవాడయిన కేసీఆర్ ని పట్టుకొని ‘నీ తాట తీస్తానని’ అనడం ఏవిధంగా పవన్ సమర్దించుకోగలరు?

 

ఇక ఆయన తన జనసేన పార్టీ స్థాపిస్తున్న సందర్భంగా తనకు కులాలు, మతాలు, ప్రాంతాలు ఆపాదించవద్దని, అదేవిధంగా ప్రజలు కూడా ఈ బలహీనతల నుండి బయటపడి అన్ని విధాల సమర్దులు, నిజాయితీపరులు అయిన వ్యక్తులకే ఓటు వేయాలని హితబోద చేసారు. కానీ అదే పవన్ కళ్యాణ్ నేడు బీసీల ప్రస్తావన చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశంలో మొట్టమొదటి సారిగా బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ఏమయినా అంటే చూస్తూ ఊరుకోమని, కులాల ప్రసక్తి తేవడం ద్వారా ఈ బలహీనత నుండి ఆయన కూడా ఇంకా బయటపడలేదని స్పష్టం చేసారు. అందుకే ఎదుటవాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని ఒక కవి శలవిచ్చారు.

 

పవన్ కళ్యాణ్ కుల ప్రస్తావన తేకుండా దేశానికి ప్రధాని కాబోయే ఒక వ్యక్తిని పట్టుకొని ఆవిధంగా మాట్లాడవద్దని హెచ్చరించి ఉండి ఉంటే ఆయన స్థాయికి తగ్గటుగా ఉండేది. ఆశయాలను ఆచరణలో పెట్టడం ఆలోచినంత తేలిక కాదు. అయితే అలాగని ఆ ప్రయత్నం ఎన్నడూ మానుకోకూడదు. నిరంతర సాధనతోనే అది సాధ్యమవుతుంది.

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.